సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రారంభమైన ఈ వన్డే సిరిస్‌కు తొలిసారి ఆడియెన్స్‌ని అనుమతించారు. సిడ్నీ, కాన్‌బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి వన్స్‌మోర్ వార్నర్ బుట్టబొమ్మ అంటూ కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. లాక్‌డౌన్ సమయంలో అన్ని టోర్నిలు నిలిచిపోవడంతో క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో టిక్‌టాక్‌లు చేస్తూ వార్నర్ కుటుంబం అభిమానులకు దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్‌బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి టాలీవుడ్ ఫ్యాన్స్‌కు చేరువయ్యారు వార్నర్. ఈ నేపథ్యంలో నేడు మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు ‘వన్స్‌మోర్ వార్నర్.. బుట్టబొమ్మ’ అంటూ అరిచారు. (చదవండి: జంపా.. ఆర్సీబీ గుర్తొచ్చిందా?)
ఇక ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment