సాక్షి, న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఎస్‌ఎల్‌తో కలసి క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ నిర్వహిస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్‌లోకి వస్తుందని ఆశించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 5.10 కోట్ల డోస్‌ల సరఫరా కోసం క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ, సీఎస్‌ఎల్‌తో ఒక బిలియన్ డాలర్ల (దాదాపు 7,400 కోట్ల రూపాయలు) ఒప్పందం కూడా చేసుకొంది. (లండన్ వీధుల్లో బిన్ లాడెన్ ప్రతినిధి)
అయితే ఈ వ్యాక్సిన్ ఉన్న వారందరికి హెచ్‌ఐవీ ఉన్నట్లు పాజిటివ్ ఫలితాలు రావడంతో వారంతా హాహాకారాలు చేయడంతో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న పరిశోధకులు వెంటనే తమ ట్రయల్స్‌ను ఆపేసి వ్యాక్సిన్ ఫార్ములాను అటకెక్కించారు. తమ వ్యాక్సిన్ తీసుకున్నవారికి వాస్తవంగా హెచ్‌ఐవీ ఉన్నట్లు తప్పుడు ఫలితాలు రావడంతో వారంతా ప్రజల్లో తమ పరవుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను పరిగణలోకి తీసుకొని తాము ట్రయల్ప్‌ను నిలిపివేస్తున్నట్లు పరిశోధకులు ప్రకటించారు.
వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం చేసుకోకముందే దీనితో హెచ్‌ఐవీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆస్ట్రేలియా వ్యాక్సిన్ శాస్త్రవేత్త నికోలాయ్ పెట్రోవస్కీ ప్రభుత్వాన్ని హెచ్చరంచారట. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదట. అప్పటికే ఎలుకలపై జరిపిన ట్రయల్స్‌లో హెచ్‌ఐవీ ఉన్నట్లు తప్పుడు ఫలితాలొచ్చాయట. ఎందుకైనా మంచిదని మరో రెండు వ్యాక్సిన్ల కోసం తాము చివరి నిమిషంలో ఆర్డర్ చేశామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం నాడు మీడియాకు తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనేకెతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వైరస్ వ్యాక్సిన్ రెండు కోట్ల డోసుల కోసం, అలాగే మరో 110 లక్షల డోసుల నోవావ్యాక్సిన్ కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు ప్రధాని స్వయంగా ప్రకటించారు. (క్రిస్మస్‌కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!)
Comments
Please login to add a commentAdd a comment