
భారత్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వార్నర్!
సొంతగడ్డపై భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్... గత కొంతకాలంగా మోకాలి, తుంటి ఎముక గాయంతో బాధపడుతున్నాడు.
దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చి వార్నర్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్ల బృందం భావిస్తోంది. జనవరిలో జరిగే ఆసీస్ పర్యటనలో భారత్... ఐదు వన్డేలు, మూడు టి20లు ఆడుతుంది.