
మెల్‌బోర్న్: భారత్‌తో రేపటి నుంచి మొదలయ్యే టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతినిచ్చారు. మాథ్యూ వేడ్ సారథ్యంలోని ఆసీస్ జట్టును ఎంపిక చేయగా, ఇందులో తాజా వరల్డ్‌కప్ ఆడిన ఏడుగురు ఆటగాళ్లున్నారు.
హెడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్, స్టొయినిస్, అబాట్, ఆడమ్ జంపాలు భారత్‌తో తలపడేందుకు అందుబాటులో ఉండగా... కెపె్టన్ కమిన్స్ సహా పలువురు ఆటగాళ్లు ఆ్రస్టేలియాకు పయనమయ్యారు. విశాఖపట్నంలో గురువారం జరిగే తొలి టి20తో భారత్, ఆసీస్ మధ్య సిరీస్ ప్రారంభమవుతుంది.
ఆ్రస్టేలియా టి20 జట్టు: వేడ్ (కెప్టెన్ ), హెడ్, స్మిత్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఆరన్ హార్డీ, బెహ్రెన్‌డార్ఫ్, అబాట్, ఎలిస్, తన్వీర్ సంఘా, షార్ట్, కేన్ రిచర్డ్‌సన్, జంపా.
Comments
Please login to add a commentAdd a comment