rest
-
ఎయిరిండియా సిబ్బందికి షేరింగ్ రూమ్
ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దుఅధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్‌రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
ఆరు వారాలు విశ్రాంతి
స్క్రీన్‌పై జోష్‌గా కనిపించే రవితేజ సినిమాలు చేయడంలోనూ అంతే జోష్‌గా ఉంటారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంటారు. కాగా ఈ బిజీ షెడ్యూల్‌కి ఆరు వారాలు బ్రేక్ పడింది. కొన్నాళ్లుగా రవితేజ తన 75వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఈ మధ్య యాక్షన్ సీన్ చేస్తుండగా రవితేజ కుడి చేతికి గాయం అయింది. కండరం చిట్లినా లెక్క చేయకుండా షూటింగ్ చేస్తుండటంతో గాయం పెద్దదైందట.చివరికి శస్త్ర చికిత్స వరకు దారి తీసింది. హైదరాబాద్‌కి చెందిన ఓ ఆస్పత్రిలో గురువారం ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఈ గాయం తగ్గడానికి ఆరు వారాలు పడుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పీఆర్ టీమ్ పేర్కొంది. దాంతో రవితేజ 75వ చిత్రం షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. -
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన యాప్‌లో ఎస్‌వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
రామ్ లల్లాకు ఒక గంట విశ్రాంతి!
జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు. అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్ లల్లాకు ఒక గంట బ్రేక్ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్. (చదవండి: ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..) -
డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి
మెల్బోర్న్: భారత్‌తో రేపటి నుంచి మొదలయ్యే టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతినిచ్చారు. మాథ్యూ వేడ్ సారథ్యంలోని ఆసీస్ జట్టును ఎంపిక చేయగా, ఇందులో తాజా వరల్డ్‌కప్ ఆడిన ఏడుగురు ఆటగాళ్లున్నారు. హెడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్, స్టొయినిస్, అబాట్, ఆడమ్ జంపాలు భారత్‌తో తలపడేందుకు అందుబాటులో ఉండగా... కెపె్టన్ కమిన్స్ సహా పలువురు ఆటగాళ్లు ఆ్రస్టేలియాకు పయనమయ్యారు. విశాఖపట్నంలో గురువారం జరిగే తొలి టి20తో భారత్, ఆసీస్ మధ్య సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ్రస్టేలియా టి20 జట్టు: వేడ్ (కెప్టెన్ ), హెడ్, స్మిత్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఆరన్ హార్డీ, బెహ్రెన్‌డార్ఫ్, అబాట్, ఎలిస్, తన్వీర్ సంఘా, షార్ట్, కేన్ రిచర్డ్సన్, జంపా. -
భక్త మహాశయులకు...
అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు. అలా పునాది పడి.. రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్రూమ్లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు. వెయ్యి మంది సేదతీరేలా.. మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు. ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు. -
రోహిత్ కు విశ్రాంతి మరి కోహ్లీ సంగతి ఏంటి..!
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
డాడీ
‘‘ఇంక నావల్ల కాదు.. భరించలేను’’అంటూ పొత్తి కడుపు పట్టుకొని లుంగలు చుట్టుకుపోతోంది చందన.‘‘ఓర్చుకో చందూ.. ప్లీజ్.. చూడు ఈ మంత్ తప్పకుండా పీరియడ్స్ మిస్ అవుతావ్’’ ఆమె పక్కన కూర్చోని తల నిమురుతూ అన్నాడు అనిరుద్.ఆ మాటకు అతని కళ్లల్లోకి చూసింది చందన. ‘‘నిజం.. ఈసారి కన్సీవ్ అవడం ఖాయం...’’భరోసా ఇస్తున్నట్టుగా ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేయి విడిపించుకుంటూ దిండు ఆసరాగా గోడకు ఒరిగి కూర్చుంది చందన. కిటికీలోంచి గార్డెన్‌లోకి చూస్తూ.. ‘‘ఈ ట్రీట్మెంట్... ఈ పెయిన్ నా వల్ల కాదు అనిర్.. ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం...’’అంది. ఆ మాట అతనికి కొత్త కాదు కాని.. ఆ స్వరం కొత్తగా వినిపించింది. స్థిరమైన అభిప్రాయం మోస్తున్నట్టు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి చందన తలను తన వైపు తిప్పుకుంటూ ‘‘ఒక్క చాన్స్ చూ..ద్...’’ అని అతను మాట పూర్తి చేసేలోపలే.. ‘‘నీడ్ టు టేక్ రెస్ట్’’ అంటూ అటువైపు తిరిగింది చందన. ఇంకో మాట మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు అనిరు«ద్. పెళ్లయి ఆరేళ్లవుతున్నా పిల్లల్లేరు. ఆస్తి, అంతస్తు.. మంచి ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. అన్నీ ఉన్నాయి. ఆ ఇంటికి కళ తెచ్చే పిల్లలే లేరు. ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అనిరు«ద్ లోపం సరిచేయరానిది. ఆ విషయం తెలిసినా.. చందన మీదే ప్రెషర్. నరకం అనుభవిస్తోంది ఆమె. అర్థమైనా కృత్రిమ గర్భధారణ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నాడు అనిరు«ద్. రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కావాలని. ఆ చాదస్తం చందన ప్రాణం తీస్తోంది. దిండులో తల దూర్చి పొగిలి పొగిలి ఏడుస్తోంది ఆమె. గది బయటకు వచ్చేసిన అనిరు«ద్కూ తెలుసు చందన ఏడుస్తోందని. నిట్టూరుస్తూ.. ‘‘ఏమైనా ఇంకో చాన్స్ చూడాల్సిందే’’ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుంటే ఫోన్.. బీప్.. మెస్సేజ్‌ను ఇండికేట్ చేస్తూ!చూసుకున్నాడు.. ‘‘డాడీ.. వాంట్ రిమోట్ కంట్రోల్ కార్’’ అని ఉంది. రెడిక్యులస్.. చిరాగ్గా అనుకుంటూ మెస్సేజ్ డిలీట్ చేశాడు. ఆఫీస్‌కు కార్ డ్రైవ్ చేశాడు. గుయ్.. గుయ్.. ..... ..... .... .... గుయ్.. గుయ్‘‘అబ్బా.. ఆ ఫోన్ చూడు అనిర్..’’ మధ్య రాత్రి ఫోన్ వైబ్రేషన్ సౌండ్‌కి ఇరిటేట్ అవుతూ చందన. ‘‘ఊ.. పోనిద్దూ.. పడుకో’’ అంటూ అటు తిరిగి ముసుగేసుకున్నాడు అనిరు«ద్.గుయ్.. గుయ్... ..... .... .... గుయ్.. గుయ్ ‘‘అబ్బా...’’ అని విసుక్కుంటూ అనిరు«ద్ ఫోన్ తీసింది. కళ్లునులుముకుంటూ చూసింది.. మెస్సేజెస్.. స్క్రీన్ మీద నోటిఫికేషన్స్‌లో.. ‘‘డాడీ...’’ అని కనిపించింది. ‘‘అనిర్.. ఏవో మెస్సేజెస్ ..’’ భర్తను తట్టి లేపుతూ.‘‘పొద్దున చూసుకుంటాలే.. ’’ నిద్ర మత్తుతోనే అనిరు«ద్. పక్కన పెట్టబోతుంటే మళ్లీ ఓ మెస్సేజ్ వచ్చింది. చూసింది. ‘‘డాడీ...’’ అని ఒక మెస్సేజ్... ‘‘డాడీ... వై డింట్ యు గివ్ రిప్లయ్?’’ అని ఒకటి.. ‘‘డాడీ.. రిమోట్ కంట్రోల్ కార్ తేలేదూ?’’ అని ఓ మెస్సేజ్, ‘‘డాడీ.. గిమ్మీ రిప్లయ్.. ’’, ‘‘డాడీ.. ప్లీజ్.. ప్లీజ్..’’ అంటూ ఓ అయిదారు మెస్సేజ్లున్నాయి. అన్నీ చదివింది. నిద్ర ఎగిరిపోయింది ఆమెకు. వెంటనే అనిరు«ద్‌ను లేపి.. ఏంటిది? అని అడిగాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆలోచనలో పడింది. అనిరు«ద్‌కు పిల్లలా? మరి మెడికల్ రిపోర్ట్? అతనిలో కౌంట్ తక్కువనే కదా చెప్పారు డాక్టర్! అబద్ధమా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకో... ఛ.. ఇలా ఆలోచిస్తుందేంటి తను? మరో అమ్మాయి, ఆమెతో పిల్లలు ఉంటే తననెందుకు ఇబ్బంది పెడ్తాడు ట్రీట్మెంట్స్తో? ఏమో.. తనకు అనిరు«ద్ పట్ల అలాంటి థాట్ రాకుంటా ఉండడానికి ట్రీట్మెంట్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నాడేమో? ఆ డాక్టర్ అనిరుద్ ఫ్రెండే కదా.. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా? ఆ చాన్స్ ఉందా? అందుకే అడాప్షన్ వద్దంటున్నాడా? లాంటి ఆలోచనలతో.. అనుమానాలతో తెలీకుండానే నిద్రలోకి జారుకుంది చందన. ‘‘డాడీ.... డాడీ...’’ అయిదేళ్ల అమ్మాయి గుసగుసగా పిలుస్తున్నట్టు.ఒకేసారి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ‘‘డాడీ... డాడీ..’’ మళ్లీ పిలుపు. గాబరాగా అనిరు«ద్ లైట్ వేయబోయాడు. వెలగలేదు. అప్పటిదాకా వెలిగిన బెడ్‌లైట్ కూడా ఆరిపోయింది. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్చేసింది చందన. అనిరు«ద్ వంక చూసింది. మొహం నిండా చెమటలతో వణుకుతున్నాడు. ఉన్నట్టుండి గాలి.. వెర్రెత్తినట్టు బెడ్రూమ్ కిటికీలను.. కర్టెన్లూ ఊపేస్తోంది.. కిటికీ తలుపులు ఊడిపడిపోతాయేమోనన్నంతగా! ‘‘పిల్లలు కావాలా డాడీ?’’ మళ్లీ ఆ పిల్ల గొంతే! ‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’కంపిస్తున్న స్వరంతో అనిరు«ద్. ‘‘నీ కూతురిని డాడీ.. పొద్దున ... మధ్యాహ్నం మెస్సేజెస్ పెట్టా కదా.. చూసుకొనీ డిలీట్ చేశావ్. ఇందాక కూడా పెట్టా. నువ్వు పట్టించుకోలేదు.. అందుకే వచ్చా డాడీ..’’ పలుకుతోంది పిల్ల గొంతు. ‘‘ఏయ్.. ఏంటా ముదురు మాటలు? డాడీ ఎవరు ? డాడీ అట డాడీ?’’ భయం ప్లేస్‌లో చిరాకు, కోపం వచ్చాయి అనిరు«ద్‌కి. మళ్లీ గాలి విసురుగా.. ఒక్కసారి ఆ ఇంటినే ఊపేసింది. ‘‘అనిర్...’’ భయంతో గట్టిగా అరిచింది చందన. ‘‘చందూ..’’ అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను. ‘‘అనిర్.. ఏంటిదంతా? ఎవరా పాపా? కనిపించదేంటి?’’ అంత భయంలోనూ భర్త మీదఅనుమానంతో ఆమె. ‘‘తెలీదు.. నాకూ కన్ఫ్యూజన్గానే ఉంది’’చెమటలు తుడుచుకుంటూ అతను. ‘‘అబద్ధం..’’ అరిచింది ఆ పిల్ల గొంతు. ఒక్కసారిగా వణికారు ఇద్దరూ. ‘‘డాడీ.. అబద్ధం చెప్పకు డాడీ.. ’’ అంతలోకే మార్దవంగా ఆ పిల్ల. మెల్లగా బెడ్ దిగి.. ‘‘ఏయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్?’’ ‘‘అదేంటి డాడీ.. నన్ను మర్చిపోయావా?’’ అని వినిపించగానే ఒక్కసారిగా గదిలో లైట్ వెలిగింది. గదంతా చూశారిద్దరూ .. ఎవరూ లేరు.చందనకు కోపం వస్తోంది. అనిరు«ద్ తనను మోసం చేశాడని. ఆ ఆగ్రహంతోనే భర్త టీషర్ట్ కాలర్ పట్టుకుంది.. ‘‘అనిర్.. నన్నెందుకు చీట్ చేస్తున్నావ్? ఆ పాపఎవరు?’’అంటూ!‘‘వ్వాట్..?’’ఖంగుతిన్నఅనిరు«ద్ షర్ట్ కాలర్ విడిపించుకుంటూ ‘‘గాన్ మ్యాడ్?’’ అరిచాడు. బిత్తరపోయింది చందన. ‘‘ఏం జరుగుతుందో చూసే ఆ మాట అంటున్నావా చందూ?’’ బాధగాఅతను.‘‘రాత్రి నీ సెల్‌కు వచ్చిన మెస్సేజెస్ చూశా.. ఈ అమ్మాయే కాబోలు’’ అంటూ సెల్ ఫోన్ తీసి అతని చేతికి ఇచ్చింది. చదవబోతూంటే బయట కార్ హార్న్ మోగింది గట్టిగా.. ఉలిక్కిపడ్డారిద్దరూ.మోగుతూనే ఉంది.. గబగబా పోర్టికోలోకి పరిగెత్తారు. హెడ్లైట్లు వెలుగుతూ... ఆరుతూ.. ఆరుతూ వెలుగుతూ.....!కార్ దగ్గరకు వెళ్లారు.. విండో గ్లాసెస్ మీద ‘‘డాడీ.. నన్ను ఇంటికి తెచ్చుకోండి... ప్లీజ్’’అని రాసుంది. అది చూసి ఆవేశంతో తుడిచేయబోయాడు అనిరు«ద్.. మళ్లీ హార్న్ మోగింది! అనిరు«ద్ చేయి పట్టి ఆపింది చందన.. తుడిచేయొద్దు అన్నట్టుగా! మళ్లీ మాటలు వినిపించాయి.. ‘‘డాడీ.. ప్లీజ్ మమ్మీ మాట వినండి.. అనా«థను దత్తత తీసుకోండి.. నాలా చెత్తకుప్పలో చనిపోనివ్వకండి.. డాడీ.. ప్లీజ్.. మమ్మీని అలా హాస్పిటల్‌కి తిప్పకండి. అడాప్ట్ చేసుకోండి.. నన్నూ.. మమ్మీని కాపాడండీ.. ప్లీజ్ డాడీ.. ప్లీజ్ డాడీ...’’ అంటూ ఆ పాప స్వరం ఏడుస్తోంది.. చందనాకూ దుఃఖం ఆగలేదు! - సరస్వతి రమ -
ఇక హాయిగా విశ్రమిస్తా: కోహ్లి
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేస్తుందన్న విశ్వాసాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ గెలవడంతో సంతోషంగా బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. కివీస్‌తో మూడో వన్డే ముగిసిన తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... ‘చివరి రెండు వన్డేల్లోనూ మేము విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంద’ని అన్నాడు. సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలకు కోహ్లి అందుబాటులో ఉండడం లేదు. న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ గెలవడం పట్ల విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నామన్నాడు. మూడో వన్డే చివర్లలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ బాగా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. డ్రెసింగ్ రూములో కూర్చుని ప్రతి పరుగుకు కేరింతలు కొట్టామన్నాడు. ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభపై నమ్మకం ఉంచి, దాన్ని మైదానంలో ప్రదర్శించడంతో విజయాలు దక్కాయని విశ్లేషించాడు. కాగా, చివరి రెండు వన్డేలకు కోహ్లి స్థానంలో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. -
మనిషెందుకు ఇలా చేస్తాడు?!
తల్లి ఒంటె, పిల్ల ఒంటె విశ్రాంతిగా ఉన్నాయి. ‘‘అమ్మా.. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా?’’ అంది పిల్ల ఒంటె. ‘‘తప్పకుండానమ్మా... అడుగు, చెప్తాను’’ అంది తల్లి ఒంటె. ‘‘వీపు పైన మనకు ఎందుకిలాగా ఉంది?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘దీన్ని మూపురం అంటారు. ఇందులో నీళ్లు నిలువ ఉంటాయి. అవసరం అయినప్పుడు వాటితో దాహం తీర్చుకోవచ్చు. ఎడారిలో నీళ్లు దొరకవు కాబట్టి దేవుడు మనకు ఈ ఏర్పాటు చేశాడు’’అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి మన కాళ్లు ఎందుకు ఇంత పొడవుగా, పాదాలు ఇంత గుండ్రంగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారిలో నడిచేందుకు వీలుగా దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా.’’ అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి కనురెప్పలు ఎందుకమ్మా ఇంత పెద్దవిగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారి గాలుల నుంచి, ఇసుక తుపాన్ల నుంచీ ఈ కనురెప్పలు మన కళ్లను, చూపును కాపాడేందుకు దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా..’’ అని చెప్పింది తల్లి ఒంటె. పిల్ల ఒంటె అలా ఒక్కో ప్రశ్నా అడుగుతుంటే తల్లి ఒంటె ఉత్సాహంగా సమాధానాలు చెబుతోంది. పిల్ల ఒంటె కొద్దిసేపు మౌనంగా ఉండి, మళ్లీ ఒక ప్రశ్న అడిగింది. ‘‘ఎడారిలో జీవించడానికి కదా అమ్మా.. దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు. మరి ఇక్కడ ఎందుకున్నాం.. ఈ ‘జూ’ లో..’’ అని అడిగింది పిల్ల ఒంటె. తల్లి ఒంటె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. పిల్ల ఒంటెను దగ్గరకి తీసుకుని హత్తుకుంది. ‘దేవుడు అలా చేస్తే, మనిషి ఇలా ఎందుకు చూస్తాడో’ అనుకున్నట్లుగా ఆలోచనలో పడిపోయింది. నేర్పు, నైపుణ్యం, తెలివి, అనుభవం.. ఇవన్నీ అనువైన చోట మాత్రమే ఉపయోగపడతాయి. అనువుకాని చోట వాటి వల్ల ప్రయోజనం ఉండదు. -
శ్రీలంక ముమ్మర ప్రాక్టీస్..విశ్రాంతిలోభారత్..
విశాఖ స్పోర్ట్స్ : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా శ్రీలంక జట్టు శుక్రవారం బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. భారత్ జట్టు విశ్రాంతి తీసుకోగా శ్రీలంక ప్రాక్టీస్‌లో పాల్గొంది. శ్రీలంక జట్టు కోచ్ పోతాస్ ఆటగాళ్లకు నెట్స్‌లోనే మెళకువల్ని నేర్పించారు. చమిరా ఫాస్ట్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోగా కెప్టెన్ పెరీరా నెట్ ప్రాక్టీస్‌లో ఉల్లాసంగానే గడిపాడు. బ్యాటింగ్‌కు ప్రాక్టీస్ చేశాడు. ఏంజిలియో తన ఫాస్ట్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు సచిత్, డిసిల్వ సయితం ప్రాక్టీస్ చేశారు. వన్డే నిర్వాహక కమిటీ సమావేశం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ నిర్వహణకై నిర్వాహక కమిటీ శుక్రవారం సమావేశమైంది. వైఎస్ఆర్ స్టేడియంలో నిర్వాహక కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటగాళ్ల భద్రత ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు, అత్యవసర పరిస్థితిలో ఏర్పాట్లు, పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ నిర్వహాణ తదితర అంశాలపై చర్చించారు. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్లైట్లను పరిశీలించారు. ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ , కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీలు ఫకీరప్ప, షిమోషిన్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుదేశ్‌కుమార్, ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్... గురువారమే విశాఖ చేరిన భారత్ జట్టు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి వైఎస్ఆర్ స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. శనివారం ఒంటిగంటన్నర నుంచి భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శ్రీలంక శనివారం సయితం పదిగంటలనుంచి ప్రాక్టీస్ చేసుకోనుంది. అప్పన్న సన్నిధిలో రవిశాస్త్రి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి , బ్యాటింగ్ కోచ్ సంజయ్బంగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రవిశాస్త్రి, సంజయ్బంగర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. –సింహాచలం (పెందుర్తి) -
రెస్ట్ కాదు అరెస్ట్..!
► ఆర్టీసీ డ్రైవర్ల విశ్రాంతి గదిలో ఉక్కపోత ► ఏసీలు పని చేస్తున్నా చల్లదనం లేని వైనం ► దూర ప్రాంత డిపోల డ్రైవర్లకు కంటి మీద కునుకు కరువు ► నిద్ర లేమితో ప్రమాదాలు జరుగుతాయేమోనని ఆందోళన రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. బస్సు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణలు ఇప్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత పేరుతో నిధులు ఖర్చు పెడుతుంటుంది. ఇంత హడావిడి చేసే ఆర్టీసీ అధికారులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) లో దూర ప్రాంత సర్వీసుల డ్రైవర్లకు విశ్రాంతి తీసుకునే భాగ్యం మాత్రం కల్పించలేకపోతున్నారు. డ్రైవర్ల కోసం ప్రత్యేక గది ఉన్నా బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు సేదతీరే అవకాశం లేక నిద్రకు దూరమవుతూ ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం కార్మిక వర్గాలకు ఇబ్బందిగా మారింది. రాజధాని ప్రాంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రయాణీకులతో విజయవాడకు చేరుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులను నడిపే డ్రైవర్లకు బస్టాండ్లోవిశ్రాంతి తీసుకునే అవకాశం లేక కంటి మీద కునుకు దూరమవుతోంది. డ్రైవర్లు విశ్రాంతి తీసుకొనేందుకు బస్టాండ్‌లో ప్రత్యేకంగా 120 బెడ్లతోకూడిన ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. అందులోపది ఏసీలు బిగించారు. ఆ గదిలో ప్రస్తుతంఏసీలన్నీ పని చేస్తున్నట్లు కన్పిస్తున్నా చల్లదనం రాక ఉక్కపోతతో ఉడికిపోతోంది. ఉక్కపోతతో డ్రైవర్లు నిద్రపోలేక ఆరుబయటే కూర్చొంటున్నారు. గదిలో ఫ్యాన్లు లేకపోవడంతోపాటు ఏసీల నుంచి కారే నీటితో గదిలో దుర్వాసన వస్తోంది. నిద్రకు దూరమై.. దూర ప్రాంతాల నుంచి రాత్రంతా ఏకాగ్రతతో సర్వీసును తీసుకొచ్చిన డ్రైవర్లు పగటి సమయంలో విశ్రాంతి తీసుకొని తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతుంటారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి సుమారు వందకు పైగా సర్వీసులు విజయవాడకు చేరుకుంటాయి. రోజుకు కనీసం ఆరు గంటలపాటు డ్రైవర్లకు నిద్ర అవసరం. నిద్రకు దూరమైతే అలసటతో పాటు ఏకాగ్రత కొల్పోయే పరిస్థితి ఉంటుంది. అలా ఏకాగ్రత లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం సూర్యాపేటలో నిలిపి ఉన్న ట్యాంకర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు సురక్షితంగానే ఉన్నా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అలసటకు గురై ఏకాగ్రత కొల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం.. విజయవాడ పీఎన్ బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తుంది. డ్రైవర్ల విశ్రాంతి గదిలో ఏసీలు సక్రమంగా పనిచేయకపోయినా వారు పట్టించుకోరు. పలుమార్లు డ్రైవర్లు ఫిర్యాదులు చేసినా సృందన ఉండదు. గదిలో పది రోజుల కొకసారి కూడా బెడ్ షీట్లు మార్చడం లేదు. దీంతో బెడ్షీట్లు దుర్వాసన వస్తున్నాయి. వివిధ రుగ్మతలతో బాధపడే డ్రైవర్లు ఉంటారు. వారు వాడిన బెడ్‌షీట్‌నే మరొకరు వాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఏసీల నుంచి నీరు కారుతుండడంతో గది అపరిశుభ్రంగా మారింది. ఉక్కపోతతో నిద్ర పట్టడం లేదు.. గదిలో నిద్రపోదామంటే ఉక్కపోత. ఏసీలు పని చేస్తూనే ఉంటాయి కానీ కూలింగ్ రాదు. బెడ్‌పై పడుకుంటే నిద్రపట్టక ఆరుబయటే తిరుగుతున్నాం. ఏసీలు పని చేయటం లేదని చాలా సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోరు. రాత్రంతా బస్సును నడిపి అలసిపోయి ఉన్నా విశ్రాంతి లేక ఇబ్బంది పడుతున్నాం. – ఎన్వీ కుమార్, డ్రైవర్, కడప జిల్లా ఆరు బయటే ఉంటున్నాం.. గదిలోకి వస్తే నిద్ర రాదు. బెడ్ షీట్లు పది రోజులకి ఒకసారి కూడా మార్చడం లేదు. అవి దుమ్ము పట్టిపోయాయి. ఏసీలు పని చేస్తున్నట్లు అన్పిస్తుందే కానీ కూలింగ్ రావటం లేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదు. – ఎస్ కె మున్నా, డ్రైవర్, కడప జిల్లా -
ఇక రోడ్డు పక్కే రెస్ట్
- వాహనదారులకు జాతీయ రహదారి పక్కన వసతి సముదాయాలు కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యార్థం రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో వసతి సముదాయం (వే సైడ్ ఎమినిటీస్) ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 44వ జాతీయ రహదారిపై కృష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు టోల్ ప్లాజా సమీపంలో, 18వ జాతీయ రహదారిపై అహోబిలం సర్కిల్ దగ్గర వీటిని ఏర్పాటు చేస్తామని జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ రహదారిపై సుదీర్ఘంగా ప్రయాణించే వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమదాయాలను ఏర్పటు చేస్తామన్నారు. వీటిని ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యాల్లో , ఒకటి నుంచి రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూములను సమకూర్చడంపై అధికారులు దృష్టి సారించారు. లోకల్ టూరిజం కింద కర్నూలు మండలంలోని గార్గేయపురం చెరువు వనాన్ని, నంద్యాల సమీపంలో చిన్నచెరువును అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గార్గేయపురం చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించారు. -
ఎండ.. తగలకుండ..
మండే ఎండలకు యాక్షన్ ప్లాన్ అలర్ట్ జారీ చేస్తే.. పగటి పూట బస్సులు బంద్ పరిశ్రమల్లో కార్మికులకు పగటి వేళ విశ్రాంతి అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా ఉండటంతో వేసవిలో వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా సమాయత్తం కావాలని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత పెరిగితే రాబోయే రెండు, మూడు నెలల్లో వడ దెబ్బ మరణాలు సంభవించే ప్రమాదముందని ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఇటీవలే రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం సమీక్ష నిర్వహించి అన్ని శాఖలకు కీలక సూచనలు చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై.. వడ గాల్పుల తీవ్రత పెరిగినట్లుగా సర్కారు హెచ్చరిక జారీ చేస్తే వెంటనే చేపట్టాల్సిన చర్యలను ఆయా విభాగాలకు సూచించింది. - సాక్షి, హైదరాబాద్ ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే (మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు) వేళలో బస్సులు నడవకుండా ఆర్టీ సీ యాజమాన్యం చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ పోలీసులు, టీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, నిర్మాణ రంగ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐస్ప్యాక్లను పంపిణీ చేయాలి. పరిశ్రమల్లోని కార్మికులు, కార్యాలయాల్లోని ఉద్యోగుల విధులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపు ఇవ్వాలి. పెద్ద బస్టాండ్లు, ప్రయాణ టెర్మినళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలి. వడగాల్పులు, వాటితో తలెత్తే దుష్ర్పభావాలు, నివారణ, చికిత్సా విధానం తదితర అంశాలతో ప్రత్యేక అప్లికేషన్‌ను తయారు చేయాలని ఐటీ శాఖకు సూచించింది. ఎండల తీవ్రతను, వాటి వల్ల ఏయే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయాలతో కూడిన సమాచారాన్ని వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖకు ఎప్పటికప్పుడు అందజేయాలి. ఎండ వేడిమి వల్ల సంభవించే వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన సమాచారాన్ని వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ వైద్య శాఖకు సూచించింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు ఇతర అన్ని ఆసుపత్రుల్లో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలి. వడ దెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఆసుపత్రులన్నింటా అత్యవసర మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఆరోగ్యాధికారులు వారానికోసారి విధిగా అన్ని ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలి. ఆసుపత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న నైట్ షెల్టర్లను ఇప్పట్నుంచీ పగటిపూట కూడా తెరిచే ఉంచాలి. తద్వారా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించాలి. 104, 108 వాహనాల్లో రోజంతా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంచాలి. వడగాల్పులపై ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారమిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లు, జంక్షన్లలో ఐస్ ప్యాక్‌లు, ఎండ నుంచి ఉపశమనాన్నిచ్చే పండ్లు, పదార్థాలను అందుబాటులో ఉంచాలి. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో నీడ కల్పించే ఏర్పాట్లు చేయాలి. ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. పగటి పూట ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా పాఠశాలల ఆవరణను వినియోగించుకోనివ్వాలి. యాజమాన్యాలు అందుకు అనుమతించాలి. పశువులు, కోళ్లు మరణించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ రైతులకు అవగాహన కల్పించాలి. -
తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం
మోకాలి కండర గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత్‌తో అడిలైడ్‌లో మంగళవారం జరగనున్న తొలి టి20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం మెల్బోర్న్లో విశ్రాంతి తీసుకుంటున్న మ్యాక్స్‌వెల్ ఈనెల 29న జరిగే రెండో టి20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘మ్యాక్స్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడు. కాబట్టి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టి20కి జట్టుతో కలుస్తాడు’ అని జట్టు కోచ్ డి వెంటో చెప్పారు. -
చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా!
అమితాబ్ బచ్చన్‌ని చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యం కలగక మానదు. 72 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా సినిమాలూ, యాడ్స్ చేస్తున్నారు. ‘ఎందుకండీ ఇంత కష్టపడతారు.. రెస్ట్ తీసుకోవచ్చుగా’ అని ఎవరైనా అమితాబ్‌తో అంటే, ‘ఇప్పుడు నాకేమైందని రెస్ట్ తీసుకోవాలి. బాగానే ఉన్నానుగా’ అని నవ్వుతూ అనేవారు. ఇప్పుడు మాత్రం ఆయన ఓపిక సన్నగిల్లుతోందట. ‘ఇంత ఎనర్జీ మీకు ఎక్కణ్ణుంచి వస్తోంది? ఇంత బిజీగా ఎలా పని చేయగలుగుతున్నారు?’ అని ఎవరైనా అడిగితే అమితాబ్‌కి చిరాకుగా ఉంటోందట. ఆ విషయం గురించి ఆయన చెబుతూ - ‘‘నేనూ అందరిలాంటి మనిషినే. ఈ వయసులో ఇంట్లో కాలక్షేపం చేయకుండా పని చేయడమేంటి? అని అడుగుతుంటే కోపం వస్తోంది. కొంతమందేమో అతిగా పొగుడుతున్నారు. మీరు సూపర్ సార్.. మీ ఎనర్జీ అదుర్స్ సార్ అని పొగుడుతుంటే ఇబ్బంది ఉంటోంది. అందుకే ఎవరూ నన్ను పొగడొద్దు. నా పని నేను చేస్తున్నాను. ఉదయం పని చేస్తా.. మధ్యాహ్నం చేస్తా.. అవసరమైతే రాత్రిపూట కూడా చేస్తా.. పని చేస్తా.. చేస్తా.. చేస్తూనే ఉంటా. నాకు అందులోనే ఆనందం ఉంది. నా ఆనందం కోసం చేస్తున్న పనికి ప్రశంసలు ఆశించడంలేదు’’ అన్నారు. -
రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!
గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే నిర్ణయాల వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. నిజానికి ఆ పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్‌గా ప్రకటించింది. జింబాబ్వే టూర్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ జూన్ 29న ముంబైలో సమావేశమైంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతోపాటు యువ జట్టును సిద్ధం చేసి.. వారికి సారధిగా రైనాను ఎంపికచేశారు. కానీ బీసీసీఐ పెద్ద రాకతో సీన్ రివర్సయింది. రైనాకు కెప్టెన్సీ వద్దని, ఇతర సీనియర్లలాగే అతనికి కూడా రెస్ట్ ఇవ్వమని సెలక్షన్ కమిటీని ఒత్తిడి చేశాడట ఆ పెద్దమనిషి. మరోదారిలేని సెలెక్టర్లు ఆయన చెప్పినట్లే రైనాకు విశ్రాంతినిచ్చారు. ఎందుకిలా చేశారంటే.. సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించారట. అదే విషయాన్ని తమ సహచరుడి ద్వారా సెలక్షన్ కమిటీకి చెప్పించారట. ఆ సందర్భంలోనే 'సెలక్షన్ కమిటీ నిర్ణయాం వెనుక లలిత్ మోదీ ట్వీట్ ప్రభావమేమైనా ఉందా?' అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ 'రైనా అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కనుక ఐసీసీయే అతడి వ్యవహార్ని పర్యవేక్షిస్తుంది' అని చెప్పడం, రైనా కూడా 'నేను ఎలాంటి తప్పుచేయలేదు. ఆటే ప్రాణంగా శ్వాసించాను' అని ప్రకటించడం తెలిసిందే. -
తండ్రయిన అశ్విన్
భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి... అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. పాప బరువు 3.1 కిలోలు ఉందని... తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అశ్విన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అశ్విన్ దం పతులకు ధోని, సాక్షి అభినందనలు తెలి పారు. 2011లో అశ్విన్, ప్రీతిల వివాహం జరిగింది. -
స్మాల్ బ్రేక్ కావాలి గురూ!
నటననే వృత్తి చాలా సులభమనే అభిప్రాయం చాలా మందికి ఉంటోంది. దిగితే గాని లోతు తెలియదన్నట్టు అన్ని వృత్తుల్లోలాగానే ఇందులోనూ సాదక బాధకాలు ఎన్నో ఉంటాయన్న విషయం తక్కువ మందికే తెలుస్తుంది. నిత్యం స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే మాటలు వింటూ, ముఖాలు మాడే లైటింగ్‌లో నటిస్తూ టేక్ ఒన్, టేక్ టు అంటూ విసిగిపోకుండా నటించడం అంత ఆషామాషీ కాదు. ప్రముఖ తారలైతే బిజీ షెడ్యూల్‌తో ఎడతెరపి లేకుండా నటిచేస్తుంటారు. అలాంటి వారు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం సహజం. అది అవసరం కూడా. అలాగే నటి తమన్న నెలరోజుల పాటు షూటింగ్‌లకు దూరంగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారట. చాలామంది నటీనటులు వేసవి సమయాల్లో ఊటీ లాంటి శీతల ప్రాంతాల్లో విహార యాత్రలు చేస్తుంటారు. నటి తమన్న మాత్రం అక్టోబర్ నెలను విశ్రాంతి దినాలుగా ప్రకటించేశారు. ఈ మధ్య తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడిపిన తమన్నకు కుటుంబ సభ్యులను కూడా కలుసుకునే సమయం లేకపోయిందట. బంధుమిత్రుల శుభ కార్యాల్లోనూ పాల్గొనలేకపోయారట. దీంతో ఈ బ్యూటీ ఈ నెలంతా తన కుటుంబ సభ్యులతో గడిపేయాలనే నిర్ణయానికి వచ్చిందట. బంధువులను ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేయడం, వాళ్ల ఇళ్లకు వెళ్లి గడపడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనననున్నారట. అలాగే మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనల్లో మాత్రం నటిస్తారట. మళ్లీ నవంబర్లోనే సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
కలలో కల్లోల సముద్రం
స్వప్నలిపి మన కలలో అప్పుడప్పుడు... సముద్రం ముందు మౌనంగా కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు సముద్రం ఏ శబ్దం లేకుండా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా ఊగిపోతుంది. కల్లోల కడలిగా మారుతుంది. నిజానికి కొద్దిమంది, సముద్రాన్ని ఏ సినిమాల్లోనో తప్ప ఎక్కడా చూసి ఉండరు. ‘సముద్రాన్ని చూడలేదు’ అనే నిరాశ, చూడాలనే కోరిక ఇలా కలగా వస్తుందా? కానే కాదు. కలలో కనిపించే సముద్రం జీవితానికి ప్రతీకలాంటిది. నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచిపోతుందని అర్థం. ఇక కల్లోల సముద్రం మీలో ఉండే...అసాధారణమైన ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే, ఎలాంటి విషమ పరిస్థితిని అయినా తట్టుకోగలిగే సామర్థ్యం మీలో ఉన్నట్లు అర్థం. కేవలం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయాలనే కాకుండా, రకరకాల పరిస్థితుల ఆధారంగా ఉత్పన్నమయ్యే మానసికస్థితిగతులను ‘కడలి కల’ ప్రతిఫలిస్తుంది. ఉదా: మీలో మానసిక ప్రశాంతత లోపించిన సంఘటన ఏదైనా జరిగినప్పుడు...కల్లోలకడలికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఫ్రాయిడ్ ప్రకారం: దూరంగా కనిపిస్తున్న సముద్రం... మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని కనుగోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు...సముద్రంలో ఈత కొడుతున్నట్లు కల వస్తుంది. ‘నా నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇది సరియైన సమయం’ అని మనసులో బలంగా అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. -
కొడనాడుకు జయ
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి నిమిత్తం ఆదివారం కొడనాడుకు బయలుదేరారు. మీనంబాక్కం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ ఆమెకు వీడ్కోలు పలికారు. కొడనాడు ఎస్టేట్‌లో బ్రహ్మరథం పడుతూ జయలలితకు అక్కడి నేతలు స్వాగతం పలికారు. సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రధాని సింహాసనంపై కూర్చోవడం లక్ష్యంగా రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత కొంత కాలంగా వ్యూహ రచనలో నిమగ్నం అయ్యా రు. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి 40 స్థానాల కైవశమే లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఒంటి చేత్తో అభ్యర్థులను గెలిపించాలన్న కాంక్షతో నెలన్నరపాటు తీవ్ర ప్రచారం చేశారు. అవిశ్రాంతంగా ఆమె లోక్‌సభ పనుల్లో దూసుకెళ్లినా, ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్నది మే 16 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎన్నికలు ముగియడంతో ఇన్నాళ్లు పడ్డ శ్రమ నుంచి కాస్త విశ్రాంతి తీసుకునే రీతిలో కార్యాచరణను జయలలిత సిద్ధం చేసుకున్నారు. పయనం:విశ్రాంతి నిమిత్తం ప్రతి ఏటా తాను వెళ్లే నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లడానికి జయలలిత నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం కొడనాడు ఎస్టేట్‌కు జయలలిత పయనం అయ్యారు. సరిగ్గా 11.45 గంటలకు పోయేస్ గార్డెన్నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ 12.15గంటలకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు బయలు దేరారు. పార్టీ ప్రిసీడి యం చైర్మన్ మధుసూదనన్, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి, వైద్యలిం గం, వలర్మతి, పళనియప్పన్, పార్టీ నాయకులు, కార్యకర్త లు పెద్ద ఎత్తున తరలి వచ్చి వీడ్కోలు పలికారు. కొడనాడు నుంచి నేరుగా పార్లమెంట్లో అడుగు పెట్టాలంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తించడం విశేషం. బ్రహ్మరథం: కోయంబత్తూరు చేరుకున్న జయలలిత అక్కడి నుంచి హెలికాప్టర్లో కొడనాడుకు బయలు దేరారు. అక్కడి హెలిపాడ్ నుంచి కారులో ఎస్టేట్‌కు బయలుదేరిన ఆమెకు పార్టీ నాయకులు, అటవీ గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎస్టేట్ దారి పొడవున సచివాలయం, పార్లమెంట్ చిహ్నాలతో హోర్డింగ్‌లను హోరెత్తించారు. సచివాలయం నుంచి సీఎంగా కొడనాడుకు, కొడనాడు నుంచి పార్లమెంట్‌లోకి ప్రధానిగా అడుగు పెట్టాలని కాంక్షిస్తూ, హోర్డింగ్‌లలో పేర్కొనడం విశేషం. దారి పొడవున అటవీ గ్రామాల ప్రజల పారంపర్య సంగీతాలు, నృత్య ప్రదర్శనలతో జయలలితకు ఘన స్వాగతం పలికారు. నీలగిరి జిల్లా పార్టీ నాయకులు కలై సెల్వన్, లక్ష్మనన్, ఎంపీ కేఆర్ అర్జునన్, ఆ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తరలి వచ్చి జయలలితకు బ్రహ్మరథం పట్టారు. కొద్ది రోజులు ఇక్కడి నుంచి జయలలిత ప్రభుత్వ వ్యవహారాల్ని పరిశీలించనున్నారు. -
అనుభవించు రాజా..
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో అలసిపోయిన ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. మరో ఒకటి, రెండు రోజుల అనంతరం అధిష్టానం ఆదేశాల మేరకు తమకు నిర్ణయించిన ప్రాంతాల్లో ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. మండుటెండల్లో రెండు వారాల పాటు ప్రచారంలో పాల్గొన్న నాయకులందరూ పూర్తిగా అలసిపోయారు. గురువారం ఒకే దశలో మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ పూర్తి కావడం, రీపోలింగ్ కేంద్రాల సంఖ్య పెద్దగా లేకపోవడంతో నాయకులందరూ బతుకు జీవుడా అని వివిధ చోట్ల విశ్రాంతికి ఉపక్రమించారు. కొందరు రిసార్టులకు వెళితే, మరి కొందరు మసాజ్ పార్లర్లు, బంధువుల వ్యవసాయ క్షేత్రాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత మంది ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపు మే 16న జరగనుండడంతో అంతవరకు నాయకులు చేయగలిగిందేమీ లేదు. అప్పటి వరకు ఎన్నికల నియమావళి కూడా అమలులో ఉంటుంది కనుక ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలు కూడా పెద్దగా ఉండబోవు. దేశ వ్యాప్తంగా ఇంకా నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పార్టీల అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కావడంతో, గెలుపోటముల గురించి పెద్దగా ఆలోచించకుండా ప్రస్తుతం అందరూ బడలిక తీర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎండలు మండిపోతున్నా ఇన్నాళ్లూ విధి లేక ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇప్పుడు కాస్త విశ్రాంతి అనంతరం మరో ప్రస్థానం వైపు మళ్లాల్సి ఉంది. మే 12న తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు తొలుత తమిళనాడులో ప్రచారాని వెళ్లనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేపడతారు. పరమేశ్వర బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న గుజరాత్‌లోని వడోదరలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ పార్టీ తమిళనాడు పరిశీలకుడిగా నియమితులయ్యారు. మహారాష్ర్ట సహా ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం, పరమేశ్వరలు ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ర్టంలో రెండు దశల ఎన్నికల పూర్తయ్యాయి. ఈ నెల 24న ఆఖరి విడత ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ప్రచారం, సమన్వయ బాధ్యతలను పూర్తి చేసిన అనంతరం ఆయన బీహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్లతో పాటు మాజీ మంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, శోభా కరంద్లాజె, ఆర్. అశోక్‌లు వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లే అవకాశాలున్నాయి.