ఇక రోడ్డు పక్కే రెస్ట్‌ | now rest beside road | Sakshi
Sakshi News home page

ఇక రోడ్డు పక్కే రెస్ట్‌

Published Mon, Jan 9 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

now rest beside road

 - వాహనదారులకు జాతీయ రహదారి పక్కన వసతి సముదాయాలు  
కర్నూలు(అగ్రికల్చర్‌):  జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యార్థం రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో వసతి సముదాయం (వే సైడ్‌ ఎమినిటీస్‌) ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 44వ జాతీయ రహదారిపై కృష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు టోల్‌ ప్లాజా సమీపంలో, 18వ జాతీయ రహదారిపై అహోబిలం సర్కిల్‌ దగ్గర వీటిని ఏర్పాటు చేస్తామని జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ రహదారిపై సుదీర్ఘంగా ప్రయాణించే వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమదాయాలను ఏర్పటు చేస్తామన్నారు. వీటిని ప్రభుత్వ,ప్రైవేట్‌ భాగస్వామ్యాల్లో ,  ఒకటి నుంచి రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూములను సమకూర్చడంపై అధికారులు దృష్టి సారించారు. లోకల్‌ టూరిజం కింద కర్నూలు మండలంలోని గార్గేయపురం చెరువు వనాన్ని, నంద్యాల సమీపంలో చిన్నచెరువును అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గార్గేయపురం చెరువులో బోటింగ్‌ సదుపాయం కల్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement