ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్‌ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment