ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్‌వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.
మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్‌లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్‌లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్‌వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment