దేశంలో సెప్టెంబర్ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.
మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.
ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 2% ఉంది. డీజిల్ 1.7%, ఎల్‌పీజీ 4.5%, పెట్రోల్ ధరలు 5.8% సీఏజీఆర్ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment