విశాఖ స్పోర్ట్స్ : సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా శ్రీలంక జట్టు శుక్రవారం బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌ను ప్రాక్టీస్ చేసింది. భారత్ జట్టు విశ్రాంతి తీసుకోగా శ్రీలంక ప్రాక్టీస్‌లో పాల్గొంది. శ్రీలంక జట్టు కోచ్ పోతాస్ ఆటగాళ్లకు నెట్స్‌లోనే మెళకువల్ని నేర్పించారు. చమిరా ఫాస్ట్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోగా కెప్టెన్ పెరీరా నెట్ ప్రాక్టీస్‌లో ఉల్లాసంగానే గడిపాడు. బ్యాటింగ్‌కు ప్రాక్టీస్ చేశాడు. ఏంజిలియో తన ఫాస్ట్ బౌలింగ్‌కు మరింత పదును పెట్టేందుకు తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు సచిత్, డిసిల్వ సయితం ప్రాక్టీస్ చేశారు.
వన్డే నిర్వాహక కమిటీ సమావేశం
విశాఖలోని వైఎస్‌ఆర్ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ నిర్వహణకై నిర్వాహక కమిటీ శుక్రవారం సమావేశమైంది. వైఎస్‌ఆర్ స్టేడియంలో నిర్వాహక కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటగాళ్ల భద్రత ఏర్పాట్లు, టికెట్ల విక్రయాలు, అత్యవసర పరిస్థితిలో ఏర్పాట్లు, పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్ నిర్వహాణ తదితర అంశాలపై చర్చించారు. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్‌లైట్లను పరిశీలించారు. ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ , కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, డీసీపీలు ఫకీరప్ప, షిమోషిన్, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం సుదేశ్‌కుమార్, ఏసీఏ కార్యదర్శి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ జట్టు నెట్ ప్రాక్టీస్...
గురువారమే విశాఖ చేరిన భారత్ జట్టు శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచి వైఎస్‌ఆర్ స్టేడియంలోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. శనివారం ఒంటిగంటన్నర నుంచి భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్ జరగనుంది. శ్రీలంక శనివారం సయితం పదిగంటలనుంచి ప్రాక్టీస్ చేసుకోనుంది.
అప్పన్న సన్నిధిలో రవిశాస్త్రి
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం టీం ఇండియా క్రికెట్ కోచ్ రవిశాస్త్రి , బ్యాటింగ్ కోచ్ సంజయ్‌బంగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రవిశాస్త్రి, సంజయ్‌బంగర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. –సింహాచలం (పెందుర్తి)
శ్రీలంక ముమ్మర ప్రాక్టీస్
Published Sat, Dec 16 2017 1:41 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment