జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు.
అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్ లల్లాకు ఒక గంట బ్రేక్ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు.
ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్.
(చదవండి: ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..)
Comments
Please login to add a commentAdd a comment