ఆరు వారాలు విశ్రాంతి | Six weeks Bed Rest for Ravi Teja | Sakshi
Sakshi News home page

ఆరు వారాలు విశ్రాంతి

Published Sat, Aug 24 2024 3:26 AM | Last Updated on Sat, Aug 24 2024 3:26 AM

Six weeks Bed Rest for Ravi Teja

స్క్రీన్‌పై జోష్‌గా కనిపించే రవితేజ సినిమాలు చేయడంలోనూ అంతే జోష్‌గా ఉంటారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంటారు. కాగా ఈ బిజీ షెడ్యూల్‌కి ఆరు వారాలు బ్రేక్‌ పడింది. కొన్నాళ్లుగా రవితేజ తన 75వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఈ మధ్య యాక్షన్‌ సీన్‌ చేస్తుండగా రవితేజ కుడి చేతికి గాయం అయింది. కండరం చిట్లినా లెక్క చేయకుండా షూటింగ్‌ చేస్తుండటంతో గాయం పెద్దదైందట.

చివరికి శస్త్ర చికిత్స వరకు దారి తీసింది. హైదరాబాద్‌కి చెందిన ఓ ఆస్పత్రిలో గురువారం ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఈ గాయం తగ్గడానికి ఆరు వారాలు పడుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పీఆర్‌ టీమ్‌ పేర్కొంది. దాంతో రవితేజ 75వ చిత్రం షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్‌ పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement