
తండ్రయిన అశ్విన్
భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి... అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. పాప బరువు 3.1 కిలోలు ఉందని... తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అశ్విన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అశ్విన్ దం పతులకు ధోని, సాక్షి అభినందనలు తెలి పారు. 2011లో అశ్విన్, ప్రీతిల వివాహం జరిగింది.