హిందూపురం అర్బన్ :
ఈఎస్‌ఐ సంఖ్య నమోదు సీరీస్ మార్పు జరిగినట్లు ఈఎస్‌ఐ బ్రాంచ్ అధికారి ఉబేదుల్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపప్రాంతీయ కార్యాలయం తిరుపతి పరిధిలోకొచ్చే అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నమోదైన సంస్థల ఈఎస్‌ఐ సంఖ్య మార్పు జరిగినట్లు తెలిపారు. ఈఎస్‌ఐ నమోదు సంఖ్య 52 సీరీస్‌కు బదులు 79 సీరీస్‌గా మార్చామన్నారు. ఈవిషయంలో అవసరమైన వివరాలకు ఈఎస్‌ఐ పోర్టల్‌లో లాగిన్ అవ్వడానికి ఇబ్బందులు ఉంటే sro-tirupathi@esic.inకు మెయిల్ చేసుకోవాలన్నారు. అలాగే మరింత సమాచారం కోసం 0877–2246187 ఫోన్ చేసి సంప్రదించొచ్చన్నారు.