
ఆఫ్ ద ఫీల్డ్
ఆట మారినా అదే ‘శైలి’
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత క్రికెటర్లు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం రెండు గంటల పాటు మన క్రికెటర్లు బ్యాడ్మిం టన్ ఆడుతున్నారు. అయితే ఒకరితో ఒకరు కాకుండా... చిన్నస్వామి స్టేడియంలోని బ్యాడ్మింటన్ క్లబ్ సభ్యులతో కలిసి ఆడుతున్నారు. ధోని, కోహ్లి వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం బ్యాడ్మిం టన్ ఆడారు. అయితే ఆట మారినా వీళ్ల శైలి మాత్రం మారలేదు. ధోని తన ఆటతీరులో ఎక్కువగా డ్రాప్స్, ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు సాధించాడు. క్రికెట్‌లో సింగిల్స్ దొంగిలించే తరహాలో ఇక్కడా పాయింట్లు రాబట్టాడు. దీనికి భిన్నంగా కోహ్లి దూకుడు ప్రదర్శిం చాడు. స్మాష్‌ల ద్వారానే పాయింట్లు సాధిం చే ప్రయత్నం చేశాడు. ప్రతి పాయిం ట్‌నూ వేగంగా ముగించాలనే తపనతో ఆడాడు. ఇషాంత్, భువనేశ్వర్, ధావన్, అశ్విన్, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, మురళీ విజయ్ కూడా తమ కెప్టెన్లతో పాటు బ్యాడ్మిం టన్ ఆడుతూ కనిపించారు.