
సిడ్నీ: ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి రెండు వన్డేలతోపాటు మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను కూడా అర్ధంతరంగా రద్దు చేసింది. సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు. మోచేతులను తాకించుకుంటూ అభినందించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment