
మనమేం సిరీస్ కోల్పోలేదు: సచిన్
టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అండగా నిలిచారు
న్యూఢిల్లీ: తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూసి విమర్శల పాలౌతున్న టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అండగా నిలిచారు. ఆదివారం ఢిల్లీలో 21 కిలోమీటర్ల మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్.. టీమిండియా ఓటమిపై స్పందించారు.
'మనమేం సిరీస్ కోల్పోలేదు. ఒక ఓటమి ఎదురైనంతమాత్రాన మాత్రాన తిరిగి పోరాడలేమని కాదు' అని సచిన్ పేర్కొన్నారు. భారత జట్టులో మంచి పోరాటపటిమ ఉందని.. మిగిలిన మ్యాచ్‌ల్లో పుంజుకొని ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.