
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ (116).. సచిన్‌ను (115) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (210 క్యాచ్‌లు) టాప్‌లో ఉండగా.. వీవీఎస్ లక్ష్మణ్ (135) రెండో స్థానంలో ఉన్నాడు.
కాగా, పెర్త్ టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలుపొందాలంటే మరో 362 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మిచెల్ మార్ష్ (39), అలెక్స్ క్యారీ (1) క్రీజ్‌లో ఉన్నారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని 0, ఉస్మాన్ ఖ్వాజా 4, కమిన్స్ 2, లబూషేన్ 3, స్టీవ్ స్మిత్ 17, ట్రవిస్ హెడ్ 89 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. రాహుల్ 77, పడిక్కల్ 25, పంత్ 1, జురెల్ 1, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశారు. నితీశ్ కుమార్ రెడ్డి 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.
దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా (5/30), సిరాజ్ (2/20), హర్షిత్ రాణా (3/48) కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Comments
Please login to add a commentAdd a comment