బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. 6 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 164/5గా ఉంది. రవీంద్ర జడేజా (4), రిషబ్ పంత్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 310 పరుగులు వెనుకపడి ఉంది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్ 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
పాత రోజులను గుర్తు చేసిన కింగ్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మళ్లీ పాత రోజులను గుర్తు చేశాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో హాఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతులను అద్భుతంగా వదిలిపెట్టిన విరాట్.. చూడచక్కని షాట్లతో అభిమానులను అలరించాడు. కమిన్స్ బౌలింగ్‌లో విరాట్ ఆడిన ఓ కవర్ డ్రైవ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
How do you rate Virat Kohli Cover Drive? #AUSvIND #ViratKohli𓃵 pic.twitter.com/RTcQlq27Sl
— Huzaifa (@Huzaifa_Says11) December 27, 2024
ఈ షాట్ విరాట్ కెరీర్ పీక్స్‌లో ఉన్న రోజులను గుర్తు చేసింది. కమిన్స్ సంధించిన పర్ఫెక్ట్ హాఫ్ వాలీని విరాట్ అద్బుతమైన కవర్ డ్రైవ్‌గా మలిచాడు. ఈ షాట్ ఆడేప్పుడు విరాట్ ఫుట్‌వర్క్, బ్యాలెన్స్ అద్భుతంగా ఉండింది. భీకర ఫామ్‌లో ఉండిన రోజుల్లో విరాట్ ఇలాంటి షాట్లు ఆడేవాడు. బౌండరీగా వెళ్లిన ఈ షాట్ చూసి విరాట్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతా బాగుందని అనుకునే లోపే షాక్ ఇచ్చిన విరాట్
ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతులను అద్భుతంగా వదిలేస్తున్నాడని చర్చించుకుంటున్న లోపే విరాట్ తన అభిమానులకు మరోసారి షాకిచ్చాడు. బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని నిక్ చేసి వికెట్ పారేసుకున్నాడు. అంతకుముందే లేని పరుగుకు ప్రయత్నించి యశస్వి జైస్వాల్ (82) రనౌటయ్యాడు. పరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment