టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ (3262), పాంటింగ్ (2555), వీవీఎస్ లక్ష్మణ్ (2434), రాహుల్ ద్రవిడ్ (2143), మైఖేల్ క్లార్క్ (2049), చతేశ్వర్ పుజారా (2033) బీజీటీ 2000 పరుగులు పూర్తి చేసుకున్నారు.
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 పరుగుల మైలురాయిని తాకాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 359/5గా ఉంది. విరాట్ (40), వాషింగ్టన్ సుందర్ (14) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత ఆధిక్యం 405 పరుగులుగా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (161) భారీ సెంచరీతో తొక్కగా.. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (77) ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (25) కాసేపు నిలకడగా ఆడాడు.
రిషబ్ పంత్ (1), ధృవ్ జురెల్ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్- 150 ఆలౌట్ (కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (37), ధృవ్ జురెల్ (11), నితీశ్ రెడ్డి (41), హాజిల్‌వుడ్ 4/29, మార్ష్ (2/12), స్టార్క్ (2/14), కమిన్స్ 267))
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 104 ఆలౌట్ (నాథన్ మెక్‌స్వీని (10), ట్రవిస్ హెడ్ (11), అలెక్స్ క్యారి (21), మిచెల్ స్టార్క్ (26), బుమ్రా (5/30), హర్షిత్ రాణా (3/48), సిరాజ్ (2/20))
Comments
Please login to add a commentAdd a comment