సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో వై సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గత వారం చైనాలో లాంచ్ చేసిన ‘వివో వై 83’ ని శుక్రవారం ఇండియన్ మార్కెట్లో ప్రారంభించింది. ఇక్కడి మార్కెట్లో దీని ధరను రూ. 14,990గా నిర్ణయించింది. ఇది దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివోఆన్‌లైన్ సైట్‌లలో లభిస్తుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభ్యం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్క్రీన్లపై మూడువేళ్లతో కిందికి స్లైడ్ చేస్తే ఈ ఫీచర్ (డబుల్ స్క్రీన్) సులభంగా యాక్టివేట్ అవుతుందని వివో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జెరోమ్ చెన్ తెలిపారు.
వివో వై 83 స్పెసిఫికేషన్లు
6.22అంగుళాల హెచ్‌డీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్
టెక్ హీలియో పీ 20 ఎస్‌ఓసీ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13ఎంపీ హై డెఫినిషన్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment