y
-
మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?
మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైనవై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధాన మవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో ఆఅధ్యయన పేపర్ ను ప్రచురించారు.మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) లుంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు.ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ ప్రకారం, వై క్రోమోజోమ్ సమయం గతించిపోతోంది ఈ ధోరణి కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది.అయితే అంత భయపడాల్సిన పనిలేదుఅయితే జపాన్‌కు చెందిన ఎలుకల జాతి, దాని అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. కనుక 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.జపాన్‌లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్‌లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని వై క్రోమోజోమ్‌ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.సర్వైవల్ కీలకంమానవ వై క్రోమోజోమ్‌ల క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగ జాతి ఉనికికి వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. అయినప్పటికీ, ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ-నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచించారు. -
karnataka assembly election 2023: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే
యశవంతపుర: ప్రధాని మోదీ విష సర్పమని, తాకినవారు మరణిస్తారని చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వెనక్కి తగ్గారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలనుద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. అసలేం జరిగింది? సొంత రాష్ట్రం కర్ణాటకలో ప్రచారంలో భాగంగా గురువారం గదగ జిల్లాలోని రాన్ నియోజకవర్గ పరిధిలోని గజేంద్రగడలో పార్టీ ప్రచార సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ‘ పొరపాటు చేయకండి. జాగ్రత్త. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వ్యక్తి. మరీ అంత విషతుల్యం కాదంటారా.. అయితే ఒకసారి తాకి చూడండి. మరణం తథ్యం. శాశ్వత నిద్రలోకి జారుకుంటారు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ అవినీతి పాలన అందించిన బీజేపీ నాయకులను మోదీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మోదీ ముఖం చూసి ఓటు వేసే కాలం పోయింది’ అని అన్నారు. ప్రధానిని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెంటనే హావేరి సభలో ప్రసంగిస్తూ ఖర్గే వివరణ ఇచ్చారు. ‘బీజేపీ పార్టీ ఒక విషసర్పం అనేదే నా ఉద్దేశం. ఆ పార్టీ సిద్ధాంతం విషతుల్యం. ఆ సిద్ధాంతాలను ఆచరిస్తే అంతమైనట్లే ఇక అనే ఉద్దేశంలో మాట్లాడాను’ అని వివరించారు. -
కశ్మీర్‌పై షహబాజ్ కారుకూతలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దుచేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. కశ్మీర్ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. భారత్‌తో సత్సంబంధాలనే తాను కోరుకుంటున్నానని, కానీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని చెప్పారు. పొరుగుదేశాలను ఎవరం ఎంచుకోలేమని, వాటితో కలిసి జీవించాలని, దురదృష్టవశాత్తు దేశ విభజన సమయం నుంచి భారత్‌తో పాక్‌కు సత్సంబంధాలు లేవని చెప్పారు. 2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని, దీంతో కశ్మీర్ లోయలో, రోడ్లపై కశ్మీరీల రక్తం చిందుతోందని విషం కక్కారు. కశ్మీర్ విషయంపై చర్చకు మోదీ ముందుకురావాలని, ఆ సమస్య పరిష్కారమైతే ఇరుదేశాలు పేదరికం, నిరుద్యోగంలాంటి ఇతర కీలకాంశాలపై దృష్టి పెట్టవచ్చని సూచించారు. రాబోయే తరాలు ఎందుకు బాధలు పడాలని, ఐరాస తీర్మానాలకు, కశ్మీరీల ఆంక్షాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ఆహ్వానించారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో–పాక్ సంబంధాలు దిగజారాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగించడం, అధికరణ 370ని రద్దు చేయడంతో పాక్‌లోని భారత హైకమిషనర్‌ను పాక్ బహిష్కరించింది. అనంతరం భారత్‌తో వాయు, భూమార్గాలను మూసివేసింది. వాణిజ్యాన్ని, రైల్వే సేవలను నిలిపివేసింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది. -
ఈక్విటీల్లో పన్ను ప్రయోజనం..!
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి అడుగు పెట్టాం. వేతన జీవి తన ఆదాయం, పన్ను భారం, పన్ను ఆదా చేసుకోవడానికి ఇంకా వెసులుబాటు ఉందా? ఉంటే ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలి..? ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించుకోవాలి. చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే పన్ను అంశాన్ని పట్టించుకుంటుంటారు. హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకునే వారూ ఉన్నారు. కొత్త పన్నువిధానంలోకి మారిన వారికి ఈ పెట్టుబడులపై హడావుడి అవసరమే లేదు. నూతన విధానంలో పన్ను మినహాయింపులు పెద్దగా లేవు. అదే సమయంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, గతం నుంచి ఉన్న పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80సీసీబీ, 80డీ ఇలా ఎన్నో సెక్షన్ల కింద గణనీయమైన పెట్టుబడి ఆదాకు అవకాశం ఉంది. వీటి గురించి ఓ సారి సమీక్షించుకోవాల్సిందే. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకపోవడం మినహాయింపుల్లో అతి ముఖ్యమైన విభాగం. ఈ ప్రయోజనం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. లక్ష్యాలు ముఖ్యం.. పెట్టుబడికి సంబంధించి ఏ నిర్ణయమైనా అది మీ ఆర్థిక లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పన్ను ఆదాను అదనపు ప్రయోజనంగా చూడాలే కానీ, దానినే ఒక లక్ష్యంగా భావించకూడదు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మీరు ఇతర పథకాలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. పన్ను ఆదా కోసం తిరిగి ఈఎల్ఎస్ఎస్ తరహా ఈక్విటీ సాధనాల వైపు చూడడం సరికాదు. అప్పుడు ఒకే విభాగంలో (ఈక్విటీల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం) అధిక రిస్క్ (కాన్సంట్రేషన్ రిస్క్) తీసుకున్నట్టు అవుతుంది. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షలపై పన్ను ఆదాకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అన్నీ కూడా ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఉంది. కాకపోతే ఇందులో పెట్టుబడులకు 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలం కోసం దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, వేతన జీవులు ఈపీఎఫ్‌కు ప్రతీ నెలా చేసే జమను పరిగణనలోకి తీసుకోవాలి. తనకు, తన జీవిత భాగస్వామి లేదా చిన్నారులకు సంబంధించి జీవిత బీమా ప్రీమియంపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు (గరిష్టంగా ఇద్దరు పిల్లలకే), గృహ రుణానికి సంబంధించి అసలుకు చేసే చెల్లింపులను కూడా చూపించుకోవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూడండి. రూ.1.5 లక్షల మొత్తానికి తగ్గితే అప్పుడు.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉత్పత్తిని అర్థం చేసుకోవాలి.. ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. లాకిన్ పీరియడ్‌లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. సెక్షన్ 80సీ కింద అనుమతి ఉన్న కొన్ని సాధనాల నుంచి నిర్ధేశిత కాలవ్యవధికి ముందే వైదొలగొచ్చు. ఇందుకు జరిమానా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. మొత్తం పెట్టుబడి నుంచి 11.5 శాతాన్ని మినహాయిస్తారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 2 శాతం వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల నుంచి పన్ను ఆదా పొందిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. గతంలో పొందిన ప్రయోజనంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎన్ఎస్సీ పెట్టుబడిని ఐదేళ్లకు ముందుగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం డిపాజిట్‌దారు మరణించిన సందర్భాల్లోనే ఉపసంహరణకు అనుమతిస్తారు. ముందు నుంచే ప్రణాళిక.. ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ మీకు అనుకూలమైన సాధనం అని భావించినట్టయితే.. పెట్టుబడులకు ముందు నుంచే ప్రణాళిక రచించుకోవాలి. దేశీయ ఈక్విటీలు గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. కనుక పన్ను ఆదా కోసం ఏక మొత్తంలో పెట్టుబడి సూచనీయం కాదు. జనవరి నుంచి మార్చి వరకు మూడు విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తదుపరి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ప్రతీ నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారి అధిక రాబడులకు అవకాశం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్లలో ఉండే ఆటుపోట్లను సులభంగా అధిగమించి, పెట్టుబడులపై వాటి ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. ఫండ్స్ పథకాల పనితీరును ముందుగానే సమగ్రంగా సమీక్షించుకుని పెట్టుబడులు ప్రారంభించాలి. ఆ పథకాల్లోనే దీర్ఘకాలం పాటు (ఏవైనా అసాధారణ మార్పులు వస్తే తప్ప) కొనసాగాలి. అంతేకానీ, ప్రతీ ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను ఆదా పథకాలను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం పరిమితి దాటకుండా చూసుకోవాలి. పన్ను బాధ్యతను చూడాలి.. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు రూ.1.5లక్షలపై ఏటా పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, వీటిని తిరిగి వెనక్కి తీసుకునే సమయంలో లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేదు. కనుక లాకిన్ ముగిసిన అనంతరం ఏటా రూ.లక్ష వరకే వెనక్కి తీసుకోవడం ద్వారా అప్పుడు కూడా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలోనూ పన్ను ఉండదని కోరుకునే వారు.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎండోమెంట్ జీవిత బీమా సాధనాల వంటి వా టికే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఏటా రూ.2.5 లక్షల పెట్టుబడికి సైతం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడుల పరంగా ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం పన్ను ఆదాతోపాటు, రాబడిని దీని ద్వారా సమకూర్చుకోవచ్చు. ఇందులోనూ గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ సాధనం కనుక పెట్టుబడి అవసరమైన సందర్భంలో (లాకిన్ ముగిసిన అనంతరం) వెనక్కి తీసుకోవాలంటే.. అదే సమయంలో మార్కెట్లు పతనాలను చూస్తుంటే కొంతకాలం వేచి చూడాల్సిన రిస్క్ ఇందులో ఉంటుంది. -
హిందూయిజం, హిందూత్వ వేర్వేరు
వార్ధా/న్యూఢిల్లీ: హిందూయిజం, హిందూత్వ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అవి రెండూ వేర్వేరు అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎక్కడా చెప్పలేదని, కానీ హిందూత్వ ఆ పని చెయ్యమంటోందని విమర్శించారు. హిందూమతాన్ని అనుసరిస్తూ ఉంటే హిందూత్వ అన్న కొత్త పదం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో వార్ధాలోని సేవాగ్రమ్ ఆశ్రమంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆన్లైన్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘హిందూయిజానికి, హిందూత్వకి ఉన్న తేడాలేంటి? ఆ రెండూ ఒకటేనా? ఒక్కటే అయితే రెండింటికి ఒక్కటే పేరు ఉండాలి కదా! అందుకే అవి రెండూ వేర్వేరు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఉపనిషత్తులు చదివాను. హిందూ మత గ్రంథాలు చదివాను. అందులో ఎక్కడా అలా లేదు. కానీ వారిని కొట్టమని హిందూత్వ చెబుతోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మన జాతి సిద్ధాంతం ఒకటేనని, అదొక విలువైన రత్నమన్నారు. అందులో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎల్ల ప్పుడూ సజీవంగా, మహత్తర చైతన్యంతో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ దానిని కనిపించకుండా చేస్తూ మీడియాని అడ్డం పెట్టుకొని హిందూత్వని విస్తరిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్నవి కాంగ్రెస్ సిద్ధాంతం, ఆరెస్సెస్ సిద్ధాంతాలేనని, బీజేపీ పనిగట్టుకొని విద్వేషాలు నూరిపోస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ మతంపై ఎందుకంత ద్వేషం: బీజేపీ హిందూత్వకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. హిందూమతంపై కాంగ్రెస్ నేతలు ద్వేషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించింది. రాహుల్ ఆదేశాల మేరకే సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, చిదంబరం వంటి నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. -
ఐటీ, బిజినెస్ సర్వీసెస్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 6.4 శాతం వృద్ధి సాధించింది. విలువ రూ.51,713 కోట్లకు చేరింది. ఐడీసీ నివేదిక ప్రకారం.. 2019 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే గతేడాది ఇదే కాలంలో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ మార్కెట్ 5.1 శాతం వృద్ధి సాధించింది. కంపెనీలు డిజిటల్ వైపు పెద్ద ఎత్తున ఫోకస్ చేయడమే ఈ వృద్ధికి కారణం. పరిశ్రమలో ఐటీ సేవల వాటా 78 శాతం ఉంది. వృద్ధి 7.3 శాతం నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5.7 శాతం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతోపాటు క్లౌడ్, సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కంపెనీల పెట్టుబడి వ్యయం పెరగడంతో ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రాబోయే కాలంలో మరింత జోరుగా ఉంటుంది. నాలుగేళ్లలో ఇలా.. భారత ఐటీ, బిజినెస్ సర్వీసెస్ 2025 నాటికి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఐడీసీ తెలిపింది. ‘2020–25 మధ్య ఏటా 8.2 శాతం వృద్ధి సాధిస్తుంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వ్యాపార విధానం మార్పు, కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు, వినియోగదార్లు, సిబ్బంది అనుభూతి పెరిగేందుకు, స్థితిస్థాపకత మెరుగుకు సంస్థలు డిజిటలీకరణకు పెట్టుబడులను కొనసాగిస్తాయి. ప్రభుత్వ, తయారీ రంగాలు 2020లో ఐటీ పెట్టుబడులను ఆలస్యం చేశాయి. 2021 జనవరి–జూన్‌లో ఖర్చులను పెంచాయి. వ్యాక్సినేషన్, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, కస్టమర్ల సెంటిమెట్‌తో పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి తిరిగి రానుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు ప్రాసెస్ ఆటోమేషన్, కస్టమర్ల అనుభూతి, హైబ్రిడ్ క్లౌడ్ నిర్వహణపై ఫోకస్ చేశాయి’ అని వివరించింది. -
ఇక్కడ మా కథలు నచ్చవని హిందీకి వెళ్లాం
‘‘మా ప్రాజెక్ట్స్ అన్నీ రిస్క్‌తో కూడు కున్నవే... కమర్షియల్స్ కాదు... అందుకే కంటెంట్‌ని నమ్మి సినిమా బండి’ విషయంలో మరోసారి రిస్క్ తీసుకున్నాం. మా నమ్మకం మంచి ఫలితాన్ని ఇచ్చింది’’ అన్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. వికాస్ వశిష్ఠ, సందీప్, రాగ్ మయూర్, ఉమ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సినిమా బండి’. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే చెప్పిన విశేషాలు. ► ప్రవీణ్ మా దగ్గర వర్క్ చేయలేదు. కానీ ‘సినిమా బండి’ కంటెంట్, ప్రవీణ్ నైపుణ్యం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. కొత్తవాళ్ల ప్రతిభను నమ్మి, మా డబ్బులతోనే చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకున్నాం. వేరే స్టూడియోస్కి వెళితే వాళ్ల జోక్యం ఉంటుంది. అలా అయితే క్రియేటివ్ పరంగా ఇబ్బందులు వస్తాయనుకుని ‘డీటుఆర్ ఇండీ’ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాం. ‘సినిమా బండి’ నిర్మించాం. ఈ సినిమాకి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ► మా సినిమా కెరీర్ హైదరాబాద్ నుంచే మొదలైంది. సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏడాది పాటు ఇక్కడే ఉన్నాం. తెలుగు సినిమాలు తీయా లని ప్రయత్నించాం. సమయం గడుస్తోంది కానీ సినిమాలు కుదర్లేదు. సరే.. మా కథలు ఇక్కడ నచ్చవేమో అనుకుని హిందీకి వెళ్లాం. అయితే తెలుగు సినిమాకు కనెక్ట్ అయ్యే ఉన్నాం. హీరోలు మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ... ఇలా మరికొంత మంది హీరోలతో మాకు మంచి అనుబంధం ఉంది. మంచి కథ కుదిరితే మా దర్శకత్వంలో తెలుగులో సినిమా ఉంటుంది. ► ఆ రకం సినిమాలు చేయండి, ఈ రకం సినిమాలు తీయండి, రీమేక్ సినిమాలు చేయండి.. అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ మేం మా ఆలోచనాధోరణికి తగ్గ సినిమాలే చేస్తున్నాం. మా నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోంది. దర్శక–నిర్మాతలుగా మేం చేసిన ‘ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో నిర్మించిన ‘స్త్రీ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. ఇప్పుడు నిర్మించిన ‘సినిమా బండి’ చిన్న సినిమా అయినా మంచి స్పందన లభిస్తోంది. మా ఇద్దరి మధ్య వాదనలు జరగవని కాదు. కానీ మా గొడవ అంతా మంచి అవుట్‌పుట్ కోసమే. ► భవిష్యత్‌లో ఓటీటీల హవా ఉంటుందని మేం ఐదేళ్ల క్రితమే ఊహించాం. 2016లో ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ కోసం అమెజాన్‌తో సైన్ చేశాం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పుడు ఉన్నంత పాపులారిటీ అప్పుడు లేదు. టెక్నాలజీ, కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వంటి కారణాల వల్ల ఓటీటీలు ప్రేక్షకులకు వేగంగా దగ్గరయ్యాయి. ఇక 2016లోనే మేం ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్ సైన్ చేసినా.. ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టడానికి రెండేళ్లు పట్టింది. ► సినిమా కావొచ్చు, వెబ్ సిరీస్ కావొచ్చు.. ఇది చిన్న పిల్లల కంటెంట్, ఇందులో హింస ఎక్కువగా ఉంది, ఇది పెద్దల సినిమా అంటూ.. ఆ ప్రాజెక్ట్ కంటెంట్‌కు ఒక గుర్తింపు ఉంటే మంచిదే. ఇక సెన్సార్షిప్ విషయానికి వస్తే.. మా వరకు మేం ఒక సెల్ఫ్ సెన్సార్‌ను ఫాలో అవుతాం. చైల్డ్ అబ్యూజ్, మితిమీరిన హింస వంటి అంశాలకు సంబంధించి అందరి ఫిల్మ్ మేకర్స్‌కు నియమనిబంధనలు ఉండటం మంచిదే. ఓటీటీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తే, అవి వ్యూయర్స్‌కు మేలు చేయాలని మేం కూడా కోరుకుంటాం. ► షారుక్ ఖాన్‌కి ఓ కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్‌కు కాస్త టైమ్ పడుతుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్లోని వెబ్ సిరీస్ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. మరొక మూడు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్... సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పాయ్‌కి అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం. రాజ్, డీకేతో సమంత -
రిస్క్ తక్కువ... స్థిరమైన రాబడి
స్థిరమైన పనితీరుతో పాటు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు డీఎస్‌పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. సెబీ మార్పుల తర్వాత కూడా ఈ పథకం పనితీరులో ఎటువంటి మార్పుల్లేవు. ఇది ఇక ముందూ మల్టీక్యాప్గానే కొనసాగుతుంది. పనితీరు ఈ ఫండ్ అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులతో ముందున్నది. ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ఎన్ఎస్ఈ 500. మూడేళ్ల కాలంలో 14.6 శాతం, ఐదేళ్లలో 19.6 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన పథకం ఇది. ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 12.8 శాతం, 16.3 శాతం, 10.9 శాతంగానే ఉండడం గమనార్హం. అంటే బెంచ్ మార్క్‌తో పోలిస్తే డీఎస్‌పీబీఆర్ ఈక్విటీ అపార్చునిటీస్ 2–5 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు తెలుస్తోంది. అధిక శాతం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో మోస్తరు ఎక్స్పోజర్ రాబడులకు కారణం. మొత్తం నిధుల్లో 80% లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు, 10–15% మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించింది. అధిక వికేంద్రీకృత పోర్ట్‌ఫోలియో విధానంతో అన్ని మార్కెట్ల సమయాల్లోనూ మెరుగైన పనితీరుకు, కరెక్షన్లో పతనాన్ని పరిమితం చేయడం, అదే సమయంలో ర్యాలీల్లో మోస్తరు పనితీరుకు దోహదపడ్డాయి. అన్ని కాలాల్లోనూ మార్కెట్‌కు ధీటైన పనితీరు కోరుకునేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. పోర్ట్‌ఫోలియో గతంలో ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్ మేర ఉంటే, గడిచిన ఏడాది కాలంగా 70 స్టాక్స్పైగా కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ సంఖ్య పెంచుకోవడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. పథకం మొత్తం నిధుల్లో 22.1 శాతం బ్యాంకింగ్ రంగంలోనే ఇన్వెస్ట్ చేసింది. ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో 9.1 శాతం పెట్టుబడులు పెట్టింది. ఫార్మాలో 7.2 శాతం, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల సంబంధిత స్టాక్స్‌లో 6.1 శాతం, ఆటోమొబైల్ రంగ స్టాక్స్‌లో 5.9 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే మాత్రం ఈ పథకం పనితీరు ఆశించిన మేర లేదు. దీనికి కారణం బ్యాంకింగ్ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టడమే. అయితే, ఇదే కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్పోజర్ తీసుకోవడం కలిసొచ్చింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే అధికంగా ప్రయోజనం పొందే కన్స్ట్రక్షన్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉంది. చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం స్టాక్స్‌లో ఎక్స్పోజర్ తగ్గించుకుంది. ఇక పథకం నిర్వహణలోని నిధుల్లో 5–7 శాతం మేర డెట్ పెట్టుబడులు, నగదు రూపంలో కలిగి ఉంది. ఐదేళ్లు, ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు పరిశీలించతగిన పథకంగా చెప్పుకోవచ్చు. -
‘ఫ్యాన్’.. బింగ్‌బింగ్..
ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు.. మధ్యలో ఏదో సమస్య వచ్చి.. ఒకరి ప్లేసులోకి మరొకరు వెళ్తారు.. లేదా.. హీరో వల్ల విలన్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు.. దీంతో తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా హీరో ముఖంలా కనిపించేటట్లు మార్చేసుకుని.. హీరోను ఇబ్బందులు పెడతాడు. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూశాం. ఆ మధ్య వచ్చిన ‘ఎవడు’సినిమాలో కూడా జయసుధ అల్లు అర్జున్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసి.. తన కొడుకైన రామ్‌చరణ్ తేజలా అతడి ముఖాన్ని మార్చేస్తుంది.. సినిమాల్లో ఒకే.. కానీ నిజజీవితంలో ఇది సాధ్యమా? ఓసారి ఈ ఫొటోను చూడండి.. రెండూ ఒకరి ఫొటోలాగే కనిపిస్తున్నా.. ఇద్దరూ వేర్వేరు.. అలాగని కవలలు కాదు.. ఇందులో ఒకరు సినిమా తార(కుడివైపు). మరొకరు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తనకు ఇష్టమైన తారలాగే మారిపోయిన ఆమె అభిమాని. ఫాన్ బింగ్‌బింగ్. చైనాలో క్రేజీ స్టార్. ఆమె అందానికి చాలా మంది ఫిదా. హే చెంగ్జీ కూడా ఆమెలాగే కావాలనుకుంది. 8 ఏళ్లు కష్టపడింది.. రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు.. అంతే.. కట్ చేస్తే.. ఎవరు ఒరిజినల్.. ఎవరు డూప్లికేట్ అన్న విషయాన్ని కనిపెట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. కొన్నిసార్లు పేపర్లలో ఫాన్ బింగ్‌బింగ్ అంటూ చెంగ్జీ ఫొటోలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఫాన్ బింగ్‌బింగ్, చెంగ్జీలు వేర్వేరుగా వచ్చారు. అయితే.. మరుసటి రోజు కొన్ని పేపర్లలో ఫాన్ బింగ్‌బింగ్ అంటూ చెంగ్జీ చిత్రాలు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లు ఇద్దరి మధ్యా తేడాను కనుగొనలేక అయోమయంలో పడేవారు. తనకు ఫాన్ బింగ్‌బింగ్ అంటే ఇష్టమేనని.. అయితే.. తనకంటూ సొంత వ్యక్తిత్వముందని.. తనను తననుగానే గుర్తించాలని చెంగ్జీ అంటోంది. ఇంకో విషయం.. చెంగ్జీ ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఓ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్‌ను కూడా పెట్టారట. అది కూడా చెంగ్జీలాగే సూపర్ హిట్. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
వివో కొత్త స్మార్ట్‌ఫోన్: స్ప్లిట్ స్క్రీన్
సాక్షి, ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో వై సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. గత వారం చైనాలో లాంచ్ చేసిన ‘వివో వై 83’ ని శుక్రవారం ఇండియన్ మార్కెట్లో ప్రారంభించింది. ఇక్కడి మార్కెట్లో దీని ధరను రూ. 14,990గా నిర్ణయించింది. ఇది దేశంలోని అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివోఆన్లైన్ సైట్లలో లభిస్తుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభ్యం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్క్రీన్లపై మూడువేళ్లతో కిందికి స్లైడ్ చేస్తే ఈ ఫీచర్ (డబుల్ స్క్రీన్) సులభంగా యాక్టివేట్ అవుతుందని వివో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జెరోమ్ చెన్ తెలిపారు. వివో వై 83 స్పెసిఫికేషన్లు 6.22అంగుళాల హెచ్డీ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ టెక్ హీలియో పీ 20 ఎస్ఓసీ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 256జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 13ఎంపీ హై డెఫినిషన్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ -
బాబు ఎన్నికల మెజీషియన్
అనంతపురం: ఎన్నికల వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో ప్రజలను ఒక మెజీషియన్ లా భ్రాంతిలోకి, నెట్టి పబ్బం గడుపుకుంటారని డీవైఎఫ్ఐ నగర అధ్యక్షుడు వై.బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హామీలు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు తన బూటకపు మాటలతో పట్టభద్ర నిరుద్యోగ యువత ఓట్లను దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు. -
'సమైక్య శంఖారావం' వల్లే మళ్లీ అఖిలపక్ష భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని మాజీ ఐఏఎస్ అధికారి, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం ఆయన ఏలూరులో విలేకర్లతో మాట్లాడుతూ... అందువల్లే కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు కోర్టు అనుమతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి... వైఎస్ విజయమ్మ పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకున్నారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. గత నెల 26న సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ఆ సభకు హజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే.