మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు. అయితే ఈ వై క్రోమోజోముకు సంబంధించి షాకింగ్ అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవులలోని రెండు సెక్స్ క్రోమోజోమ్‌లలో ఒకటైనవై క్రోమోజోమ్ క్రమంగా అంతర్ధాన మవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్‌లో ఆఅధ్యయన పేపర్ ను ప్రచురించారు.
మగవారిలో సాధారణంగా ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ (XY) ఉంటాయి. అదే ఆడవారిలో అయితే రెండు ఎక్స్ క్రోమోజోములు (XX) లుంటాయి. ఈ వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కంటే చాలా చిన్నది. తాజా అధ్యయనం ప్రకారం పురుషుల్లో వై క్రోమోజోమ్ క్రమంగా మాయవుతోందని పరిశోధకులు తేల్చారు.
ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ , శాస్త్రవేత్త జెన్నిఫర్ ఎ. మార్షల్ గ్రేవ్స్ ప్రకారం, వై క్రోమోజోమ్ సమయం గతించిపోతోంది ఈ ధోరణి కొనసాగితే, వై క్రోమోజోమ్ 11 మిలియన్ సంవత్సరాలలో పూర్తిగా అదృశ్యమవుతుంది, ఇది మగ సంతానం , మానవ మనుగడ గురించి భయాలను పెంచుతుంది.
అయితే అంత భయపడాల్సిన పనిలేదు
అయితే జపాన్‌కు చెందిన ఎలుకల జాతి, దాని అంతర్ధానమైనందున, మరో కొత్త మగ జన్యువును అభివృద్ధి చేసుకుంది. కనుక 1.1 కోట్ల ఏళ్ల కాలంలో వై క్రోమోజోమ్ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్ క్రోమోజోమ్ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి ‘Y’ క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్ సంవత్సరాలలో ‘వై’ క్రోమోజోములోని జన్యువుల (Genes) సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.
జపాన్‌లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా Y క్రోమోజోమ్ జన్యువులు ఇతర క్రోమోజోమ్‌లకు మారినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా, వారు క్రోమోజోమ్ 3పై SOX9 జన్యువు దగ్గర చిన్న DNA ను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్ SOX9ని యాక్టివేట్ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన SRY జన్యువు పాత్రను తీసుకుంటుంది. Y క్రోమోజోమ్ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్ వోల్ కూడా దాని వై క్రోమోజోమ్‌ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.
సర్వైవల్ కీలకం
మానవ వై క్రోమోజోమ్‌ల క్షీణత అంశం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువును అభివృద్ధితో మగ జాతి ఉనికికి వచ్చే నష్టమేమీ ఉండదంటున్నారు. అయినప్పటికీ, ఇటువంటి పరిణామాత్మక మార్పులు వివిధ మానవ జనాభాలో బహుళ లింగ-నిర్ధారణ వ్యవస్థల ఆవిర్భావానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, దీని ఫలితంగా కొత్త జాతులు ఏర్పడతాయని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment