
కరాచీ: కరోనా (కోవిడ్–19) దెబ్బకు వచ్చే నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే, టెస్టు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల మధ్య ఏకైక వన్డే ఏప్రిల్ 1న జరగాల్సి ఉండగా... ఫిబ్రవరిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌కు కొనసాగింపుగా రెండో టెస్టు ఏప్రిల్ 5 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అవి ఎప్పుడు జరుగుతాయనే విషయంపై సమాచారం లేదు. మార్చి 24 నుంచి జరగాల్సిన పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నీ పాకిస్తాన్ కప్ వన్డే టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఇప్పటికే కుదింపుతో సాగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) క్రికెట్ టోర్నీకి మరో షాక్ తగిలింది. కరోనా భయంతో ఈ లీగ్‌ను వదిలిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), డేవిడ్ వీస్ (ఆస్ట్రేలియా), సెక్కుగె ప్రసన్న (శ్రీలంక) కూడా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment