సిరీస్పై కన్నేసిన భారత్
విండీస్ మహిళలతో రెండో వన్డే నేడు
సాక్షి, విజయవాడ స్పోర్‌ట్స: తొలి వన్డే విజయంతో జోరుమీదున్న భారత మహిళల జట్టు మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే రెండో వన్డేలో విజయం సాధించాలనే లక్ష్యంతో మిథాలీ సేన బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌తో పాటు వేద ఫామ్‌లో ఉంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఒత్తిడి విండీస్ జట్టుపై వుంది. దీంతో పాటు ఒక్క మ్యాచ్ గెలిచినా... ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశమూ వెస్టిండీస్‌ను ఊరిస్తుంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచకప్‌కి అర్హత సాధించింది.