అమితాబ్‌బచ్చన్
ముంబైలో జరుగుతున్న ఓ మిస్టరీలో భాగస్వాములయ్యారు అమితాబ్ బచ్చన్. మరి... ఈ మిస్టరీ తాలూకు డీటైల్స్ తెలిసేది మాత్రం వెండితెరపైనే. అమితాబ్‌బచ్చన్, ఇమ్రాన్ హష్మి, కృతీకర్బందా ముఖ్య తారలుగా తెరకెక్కనున్న సినిమాకు ‘చెహ్రీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రుమి జఫ్రే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లింగ్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో మొదలైంది. రేఖ చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, థ్రిత్‌మన్ చక్రవర్తి, రఘుబీర్ యాదవ్, అనుకపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment