Imran Hashmi
-
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్‌చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్‌గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్‌లో విలన్‌గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్‌గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
డైలాగ్స్ మర్చిపోతున్నా, అందువల్లే అనుకుంటా: బిగ్‌బీ
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా నటించిన చిత్రం ‘చెహ్రే’. అమితాబ్, ఇమ్రాన్ హిష్మీ ప్రధాన పాత్రలో సెస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రేపు విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తమ సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత ఆనంద్ పండిట్, బిగ్‌బీ, ఇమ్రాన్ హష్మీలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించి సినిమా విశేషాలపై ముచ్చటించారు. చదవండి: స్వరా భాస్కర్ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు ఈ సందర్భంగా బిగ్‌బీ మాట్లాడుతూ.. ‘సినిమాలు మనల్ని ఉత్సాహరుస్తుంటాయి. కొత్త సినిమా, స్రిప్ట్ నా ద్గగరికి వచ్చిందంటే చాలు మొదట ఇందులో నా పాత్ర, కథ ఏంటో తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతాను. దర్శకుడు రూమీ జాఫ్రీ చెహ్రే కథతో నా దగ్గరికి రాగానే నా పాత్ర గురించి చెప్పమన్నాను. అతడు వివరించాడు. నా పాత్ర, కథ బాగా నచ్చటంతో ఒకే చెప్పాను. ఇంతకాలం కామెడీ చిత్రాల్లో నటించిన నేను ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: మాస్క్ లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది : హీరోయిన్ ఇక ఇమ్రాన్ హష్మీ అమితాబ్ గురించి మాట్లాడుతూ.. సినిమా కోసం బిగ్‌బీ చేయాల్సిందంతా చేస్తారన్నాడు. ఆయన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారని చెప్పడంతో వెంటనే అమితాబ్ అలా న్యాయం చేయకపోతే సినిమాను అవమానించినట్టే అవుతుందన్నారు. అయితే స్క్రిప్ట్‌ను ఎక్కువ రిహార్సల్స్ చేయడంపై ప్రస్తావన రావడంతో బిగ్‌బీ స్పందిస్తూ.. ఈ మధ్య తాను పెద్ద పెద్ద డైలాగ్‌లు గుర్తు పెట్టుకోలేకపోతున్నానని, ఎక్కడ మర్చిపోతానోనని పదే పదే రిహార్సల్ చేస్తున్నాని చెప్పారు. అంతేగాక వయసు రిత్యా మతిమరుపు పెరిగినట్టుంది అంటూ ఆయన చమత్కారించారు. కాగా ఈ వయసులో కూడా బిగ్‌బీ తన నటనతో యంగ్ హీరోలను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఆయన డైలాగ్‌లు మర్చిపోతున్నానని చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు. చదవండి: చిరు కోసం సల్మాన్.. ప్రభాస్ కోసం అమితాబ్, కొత్తగా టాలీవుడ్ -
సల్మాన్ ఖాన్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ
ముంబై: ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాల తర్వాత మళ్లీ ఏజెంట్ టైగర్‌గా నటించనున్నారు సల్మాన్ ఖాన్. టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయిక. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించనున్నారు. సల్మాన్ ను ఢీకొనే సీరియస్ విలన్ గా ఇమ్రాన్ పాత్ర ఉంటుందట. మార్చి నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలో మొదటి షెడ్యూల్ తర్వాత దుబాయ్‌కి వెళ్లనుంది చిత్రబృందం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. -
తల్లి పేరు సన్నీ లియోన్.. షాక్‌తో మైండ్ బ్లాక్
పట్నా: హెడ్డింగ్ చూడగానే వీరిద్దరికి వివాహం ఎప్పుడు అయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఆగండి ఇంకో విషయం కూడా చెప్తాము.. ఆ తర్వాత మీ ఆశ్చర్యం మరి కాస్తా ఎక్కువవతుంది. అది ఏంటంటే వీరిద్దరు ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్లో ఉంటున్నారని.. వీరికి 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చదువుతుంటేనే గందరగోళంగా అనిపిస్తుంది కదా.. హాల్‌టికెట్ తీసుకుని చూసుకున్న తర్వాత సదరు యువకుడు మనకంటే ఎక్కువ ఆశ్చర్యపోయుంటాడు. ఇంకా చెప్పాలంటే షాక్‌తో మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ఓ కాలేజీ స్టూడెంట్ అడ్మిట్ కార్డ్ మీద అతడి తల్లి దండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ పేర్లు ప్రింట్ చేశారు కాలేజీ యాజమాన్యం. (చదవండి: జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి) వివరాలు.. కుందన్ కుమార్(20) అనే యువకుడు ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్ టికెట్ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎందుకంటే దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఈ అడ్మిట్ కార్డ్ తెగ వైరలవుతోంది. యూనివర్సిటీ రిజాస్టారర్ రామ్ కృష్ణ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థి వల్లనే ఈ తప్పిదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దర్యాప్తు చేస్తున్నాం.. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హారామీ
ఇమ్రాన్ హష్మి నటించిన లేటెస్ట్ హిందీ చిత్రం ‘హారామీ’కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హారామీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇండో – అమెరికన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. ముంబై వీధుల్లో జరిగే క్రైమ్ కథా చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘మా టీమ్ అందరి శ్రమ వల్ల బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి మా సినిమా ఎంపికైందని అనుకుంటున్నాను. ఇండియన్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ఇమ్రాన్ హష్మి. అక్టోబర్ 21 నుంచి 30 వరకూ బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
డైరెక్టర్ బచ్చన్
యాభై ఏళ్లుగా కెమెరా ముందే ఉంటూ భారతీయ ప్రేక్షకులను అలరిస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. నటుడిగా, నిర్మాతగా, కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన ఆయన ఎప్పుడూ డైరెక్టర్ చైర్లో కూర్చోలేదు. తాజాగా ‘చెహ్రే’ సినిమాలో కొన్ని సన్నివేశాలకు దర్శకుడిగా మారారు బచ్చన్. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో రూమీ జాఫ్రీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చెహ్రే’. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో ఉద్యోగ విరమణ చేసిన లాయర్‌గా కనిపించనున్నారు అమితాబ్ బచ్చన్. ఈ సినిమా షూటింగ్ కోసం స్లోవాకియా వెళ్లారు చిత్రబృందం. అక్కడ తీసిన ఓ చేజ్ సన్నివేశం, చిన్న ఫైట్ సీన్‌కి బచ్చన్ దర్శకత్వం వహించారట. మరి పూర్తిస్థాయిలో సినిమాను డైరెక్ట్ చేసే ఉద్దేశం అమితాబ్‌కి ఉందా? లేదా? సమాధానం ఆయనే చెప్పాలి. ‘చెహ్రే’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది. -
మాఫియాలోకి స్వాగతం
సౌత్‌లో మంచి జోరుమీదున్న పూజాహెగ్డే హిందీలో మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో హిందీలో ‘ముంబై సాగ’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని బీటౌన్‌లో కథనాలు వస్తున్నాయి. మరి.. సంజయ్‌గుప్తా వెండితెర మాఫియాలో పూజా జాయిన్ అవుతారా? వెయిట్ అండ్ సీ. హృతిక్‌రోషన్ ‘మొహెంజోదారో’, అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాల్లో పూజా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. జాకీష్రాఫ్, సునీల్æశెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్న ‘ముంబై సాగ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ప్రభాస్ (‘జాన్’వర్కింగ్ టైటిల్), అల్లు అర్జున్, వరుణ్‌తేజ్ (వాల్మీకి) సినిమాల్లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నో బ్రేక్.. సింగిల్ టేక్
‘సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ’ అనే డైలాగులు సినిమాల్లో సరదా సందర్భాల్లో చాలానే వింటుంటాం. కానీ మన ఇండియన్ ఇండస్ట్రీల్లో అలాంటి యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అమితాబ్ తాజాగా తన నటనతో ‘చెహర్’ చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేశారట. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్, కృతీ కర్బందా, రియా చక్రవర్తి ముఖ్య పాత్రల్లో రుమీ జాఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చె హర్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో 14 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చేశారట అమితాబ్. అంత లెంగ్తీ సీన్‌ని ఒకే ఒక్క టేక్‌లో చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టీమ్ అంతా నిలబడి అమితాబ్‌కు చప్పట్లు కొట్టారట. ఈ విషయాన్ని ఆ చిత్ర సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి తెలిపారు. ‘‘అమితాబ్‌గారు ఇవాళ ఇండియన్ సినిమా చరిత్రలో మరో అద్భుతం సృష్టించారు. 14 నిమిషాలు ఏకధాటిగా నటించి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సార్, ఏమాత్రం డౌన్ లేదు. ప్రపంచంలో మీరు నిజంగా బెస్ట్’’ అని ట్వీట్ చేశారు రసూల్. -
మిస్టరీ స్టార్ట్!
ముంబైలో జరుగుతున్న ఓ మిస్టరీలో భాగస్వాములయ్యారు అమితాబ్ బచ్చన్. మరి... ఈ మిస్టరీ తాలూకు డీటైల్స్ తెలిసేది మాత్రం వెండితెరపైనే. అమితాబ్‌బచ్చన్, ఇమ్రాన్ హష్మి, కృతీకర్బందా ముఖ్య తారలుగా తెరకెక్కనున్న సినిమాకు ‘చెహ్రీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. రుమి జఫ్రే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లింగ్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో మొదలైంది. రేఖ చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, థ్రిత్మన్ చక్రవర్తి, రఘుబీర్ యాదవ్, అనుకపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
క్యాన్సర్‌ను జయించిన హీరో కొడుకు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి సంక్రాంత్రి సందర్భంగా తన అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన కుమారుడు అయాన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన కుమారుడితో దిగిన ఫోటోలను పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు. అయాన్‌కు 2014లో క్యాన్సర్ సోకినట్లు వైద్యులు ధృవీకరించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చికిత్స చేయించడంతో అయాన్ పూర్తిగా కోలుకున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. అభిమానుల ప్రార్థనలతో తన కుమారుడు క్యాన్సర్ నుంచి విముక్తి పొందాడని ఆనందం వ్యక్తం చేశారు. కాగా బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. సోనాలీ బింద్రే, ఇర్ఫాన్ ఖాన్లు కూడా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. -
ఆ నిబంధన పెట్టుకున్నా!
‘మర్డర్, జన్నత్, గ్యాంగ్‌స్టర్, మిస్టర్ ఎక్స్, బాద్షాహో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇమ్రాన్ హష్మి. రీసెంట్గా ‘చీట్ ఇండియా’ సినిమాతో నిర్మాతగానూ మారారాయన. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న ఈ సినిమాలో హీరోగానూ నటిస్తున్నారు ఇమ్రాన్. ప్రస్తుతం మహిళలపై లైగింక వేధింపులకు సంబంధించిన ‘మీటూ’ ఉద్యమం గురించి ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఉద్యమానికి సంబంధించి ఇకపై తాను నటించబోయే సినిమా కాంట్రాక్ట్స్‌లో ‘యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్’ క్లాజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని ఇమ్రాన్ పేర్కొన్నారు. ‘‘ఇతర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో ఇలాంటి క్లాజ్ ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ క్లాజ్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. కానీ ఫిల్మ్ ప్రొడక్షన్లో సరిగ్గా అమలు కావడం లేదు. నా కంపెనీలో స్త్రీలు, పురుషులకు ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మీ టూ’ ఉద్యమంలో నా పేరు వస్తుందనుకోవడం లేదు. ఎందుకంటే నేనేప్పుడూ డైరెక్టర్స్ చెప్పిన వాటిని మాత్రమే చేశాను’’ అన్నారు. -
బాలీవుడ్ ఆఫరొచ్చిందోచ్
రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ ‘ముని’తో తెలుగు ఆడియన్స్‌కు పరిచయ మయ్యారు హీరోయిన్ వేదిక. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఎక్కువగా తమిళం, మలయాళ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్గా వేదికకు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫరొచ్చింది. సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీతో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందిస్తున్న ‘ది బాడీ’ సినిమాలో హీరోయిన్గా వేదికను సెలెక్ట్ చేశారు. హిందీలో ఫస్ట్ మూవీలోనే ఇమ్రాన్ హష్మీ, రిషీ కపూర్‌తో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు వేదిక. ‘‘ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సూపర్ ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు వేదిక. స్పానిష్ మూవీ ‘ది బాడీ’కి రీమేక్‌గా ఈ సినిమాను వయాకామ్ 18 మూవీస్, సునీర్ కేటర్‌పాల్ నిర్మిస్తున్నారు. -
లాయర్‌గా లారాదత్తా?
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అజహర్’. ఇందులో టైటిల్ రోల్‌ను ఇమ్రాన్ హష్మీ చేస్త్తున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతా బిజ్లానీ పాత్రను నర్గిస్ ఫక్రి చేస్తున్నారు. కాగా, లాయర్ పాత్ర కోసం ‘లంచ్ బాక్స్’ ఫేం నిమ్రత్ కౌర్‌ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ పాత్రకు లారాదత్తాను ఎంపిక చేశారని సమాచారం. -
మరో లవ్ స్టోరీతో వస్తోన్న ఇమ్రాన్ హష్మీ
-
సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..
బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీకి ఏమొచ్చిందో ఏమో! సన్నీ లియోన్‌తో నటించేందుకు నో చెప్పేశాడు. ఇమ్రాన్ తదుపరి చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక ఐటెమ్ సాంగ్‌లో సన్నీ లియోన్‌తో కలసి స్టెప్పులు వేయాలని చిత్ర నిర్మాతలు కోరితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అడల్ట్స్టార్తో నటించేది లేదంటూ నిర్మాతలకు తెగేసి చెప్పేశాడు. దీంతో ఈ ఐటెమ్ సాంగ్ కోసం నిర్మాతలు ఇంటర్నేషనల్ మోడల్స్ వెతుకులాటలో పడ్డారు. లీసా హైడన్‌కు డెంగీ.. ఢిల్లీలో ప్రొమో కార్యక్రవూల్లో బిజీ బిజీగా ఉన్న సవుయుంలో ‘షౌకీన్స్’ నటి లీసా హైడెన్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. వెంటనే ఆమె ప్రొమో కార్యక్రవూలకు ప్యాకప్ చెప్పేసి, ముంబైకి తిరుగు ప్రయూణమైంది. బీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమెకు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె పాల్గొనాల్సిన ప్రొమో కార్యక్రవూలన్నీ నిలిచిపోయూరుు. అనుష్కా శర్మ తొలి ఐటెమ్ సాంగ్.. పొడవు కాళ్ల సుందరి అనుష్కా శర్మ ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలో తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుంది. రణవీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ ఐటెమ్ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రించనున్నారు. ఈ పాటలో ప్రియూంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, షెఫాలీ షా కూడా కనిపించనున్నారు. -
అధరహో...!
బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ అనగానే... టకీమని ఇమ్రాన్ హష్మీ గుర్తొస్తారు. ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు లిప్ లాక్ ఉండాల్సిందే. అదే పంథాలో ముందుకెళ్తున్నారు బాలీవుడ్ భామ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హైవే, 2 స్టేట్స్, హమ్టీ శర్మాకీ దుల్హనియా... ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది ఈ నాలుగు సినిమాలే. ఈ నాలుగింటిలోనూ తాను జతకట్టిన కథానాయకులతో లిప్ కిస్లను లాగించేసింది అలియా. అందుకే... ప్రస్తుతం అలియాను బాలీవుడ్లో అందరూ లేడీ ఇమ్రాన్ హష్మీ అని పిలుస్తున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ‘షాన్‌దార్’. షాహిద్‌కపూర్ ఇందులో కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ... ‘ఈ దఫా అలియా అధరాలను అందుకునే అదృష్టశాలి షాహిద్’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమవ్వడం మొదలయ్యాయి. దీనికి తగ్గట్టే దర్శకుడు వికాశ్బాల్ కూడా ఈ సినిమాలో ‘అధర’హో అనిపించేలా కిస్సింగ్ సీన్ ప్లాన్ చేశారట. అది కూడా సాదాసీదా కిస్సింగ్ సీన్ కాదని సమాచారం. ఇప్పటివరకూ అలియా చేసిన లిప్‌లాక్‌లను తలదన్నే స్థాయిలో ఈ సీన్ ఉంటుందని వినికిడి. కథ గమనానికి ఈ లిప్‌లాక్ చాలా అవసరమవ్వడం వల్లే... దర్శకుడు ఈ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. -
కిస్... ‘బోర్డర్’ క్రాస్..!
హీరో ఇవ్రూన్హష్మీ వుుద్దులు ‘హద్దులు’ దాటుతున్నారుు. తాజా చిత్రం ‘రాజా నట్వర్లాల్’లో పాకిస్థాన్ టాప్ హీరోరుున్ హుమైవూ వూలిక్తో నటించిన వుుద్దు సీను.. అక్కడ కలకలం రేపుతోంది. ఈ ‘వుుద్దు’ కట్ చేయూలని అక్కడి జనాలు గోల చేస్తున్నారు. పాక్ సంస్కృతిని వూలిక్ భ్రష్టు పట్టిస్తుందంటూ వుండిపడుతున్నారనేది ‘ది గార్డియున్’ కథనం. డెరైక్టర్.. తీవ్రత లేదంటేనే తాను చేశానని, ఏది ఏమైనా.. అతను పాకిస్థానీ కానందుకే ఈ గొడవంతా అంటోందీ ‘స్వీట్హార్ట’. రీమేక్ ‘సింగమ్’ రోరింగ్! సొంతగా ఆలోచించే పనిలేకుండా... దక్షిణాది చిత్రాల రీమేక్‌లతో కలెక్షన్ కింగ్లైపోతున్నారు బాలీవుడ్ బిగ్ స్టార్లు. పూరీ ‘పోకిరి’ని సల్మాన్ ‘వాంటెడ్’గా చేసుకుని బంపర్ హిట్ కొట్టేశాడు. ఈ దెబ్బకు రీమేక్‌లనే నవుు్మకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా అజయ్ దేవ్‌గణ్ తమిళ్ రీమేక్ ‘సింగమ్ రిటర్న్స్’ బాక్సాఫీసు వద్ద సింహ గర్జన చేస్తోంది. 15 రోజుల్లో ఏకంగా రూ.136.14 కోట్లు వసూలు చేసి సంచలనాలు నమోదు చేస్తోంది. ఐస్.. వైరస్..! ఇదేదో ‘సవాళ్ల సీజన్’లా ఉంది. ఐస్ బకెట్ చాలెంజ్ ఎక్కించిన ఈ వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. టాప్ స్టార్లను బాగా పట్టేసింది. తాజాగా వులయూళ సూపర్‌స్టార్ వువుు్మటి... బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు ఓ కొత్త సవాలు విసిరాడు... ‘మై ట్రీ చాలెంజ్’! తాను స్వయుంగా మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్ మీడియూలో పోస్ట్ చేశాడు. మొక్కలతో ఎన్నో ఉపయోగాలున్నాయుంటున్నాడు. వురి షారూఖ్ ఎలా స్పందిస్తాడో! -
అధరం.. మధురం.... గచ్ఛామి!
ఆఫ్ స్క్రీన్‌పై ఎలా ఉన్నా.. ఆన్‌స్క్రీన్‌పై బుద్ధిమంతుడిగా కనిపించే సల్లూ.. లైన్ దాటాడు. కామన్‌గా తన సినిమాల్లో లిప్‌లాక్‌లకు చోటివ్వని సల్మాన్ ‘కిక్’లో మాత్రం.. పెదాలు కలిపాడట. జాక్వెలిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాడట. ఈ కండల వీరుడు ముద్దు సన్నివేశం ఎలా పండించాడో చూడాలి! స్క్రీన్‌పై ముద్దులు పంచే ఇమ్రాన్హష్మీని చూసి మొదట్లో ఆకతాయి అనుకున్నాననేది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్ కామెంట్. రాజా నట్వర్లాల్ సినిమాలో హష్మీతో చేసిన ఈ అమ్మడు మాట మార్చుకుంది. హష్మీ ఎలాంటివాడో ఆయనతో కలసి నటి స్తే గానీ తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఫన్నీగై అని కితాబిచ్చింది. సోనమ్ కపూర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రానున్న ‘ఖూబ్సూరత్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ముద్దు సీన్ సోషల్ హబ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఖూబ్సూరత్’లో హీరో విక్రమ్ బుగ్గలను అధరాలతో తడిమిన సీన్‌ను సోనమ్ ఆన్లైన్లో ‘షేర్’ చేసి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
మా అబ్బాయి ఆరోగ్యం బావుంది
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మళ్ళీ షూటింగ్‌కు హాజరవుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారుడు అయాన్‌కు టొరంటోలో చికిత్స చేయించిన ఇమ్రాన్ ముంబైకి తిరిగొచ్చి, క్రైమ్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘మా అబ్బాయి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. త్వరగా కోలుకున్నాడు. ట్యూమర్‌కు ముంబైలో ఆపరేషన్ చేయించినప్పుడు కానీ, తాజాగా టొరంటోలో కెమోథెరపీ చేసినప్పుడు కానీ మా వాడు ఉత్సాహంగానే ఉన్నాడు. ఆపరేషన్ అయిన రెండో రోజు నుంచే ఆసుపత్రిలో ఉత్సాహంగా పరిగెత్తాడంటే నమ్మండి’’ అని పిల్లాడి కబుర్లను పంచుకున్నారు ఇమ్రాన్. చిన్నపిల్లల్లో లుకేమియా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది. కానీ, ఇమ్రాన్ హష్మీ కుమారుడికి ‘విల్మ్స్’ అనే అరుదైన క్యాన్సర్ వచ్చింది. ‘‘క్యాన్సర్ అనగానే పెద్దవాళ్ళం భయపడిపోతుంటాం. కానీ, ముందుగా కనిపెడితే క్యాన్సర్లలో నూటికి తొంభై అయిదు చికిత్సకు లొంగేవే. పైగా, మనకన్నా పిల్లలే చాలా దృఢంగా, ధైర్యంగా ఉంటారు. వారికి మనం అండగా నిలబడాలి. అంతే’’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. రెండేళ్ళ వయసు నుంచి అయన్కు బ్యాట్మన్ అంటే మహా ఇష్టం. పాలు తాగడం దగ్గర నుంచి ఏది చేయాలన్నా బ్యాట్మన్ పేరు చెప్పి, ఇమ్రాన్ దంపతులు పని చేయించేవారట. ఇప్పుడు చికిత్స సమయంలోనూ ఇమ్రాన్ ఆ టెక్నిక్కే వాడినట్లుచెప్పారు. క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులు వచ్చిన పిల్లలతో తల్లితండ్రులు ఎలా ఉండాలన్న దానికి ఇమ్రాన్ ప్రవర్తన ఓ ఉదాహరణ కదూ.