అధరహో...!
బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్ అనగానే... టకీమని ఇమ్రాన్ హష్మీ గుర్తొస్తారు. ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు లిప్ లాక్ ఉండాల్సిందే. అదే పంథాలో ముందుకెళ్తున్నారు బాలీవుడ్ భామ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హైవే, 2 స్టేట్స్, హమ్టీ శర్మాకీ దుల్హనియా... ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది ఈ నాలుగు సినిమాలే. ఈ నాలుగింటిలోనూ తాను జతకట్టిన కథానాయకులతో లిప్ కిస్‌లను లాగించేసింది అలియా. అందుకే... ప్రస్తుతం అలియాను బాలీవుడ్‌లో అందరూ లేడీ ఇమ్రాన్ హష్మీ అని పిలుస్తున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ‘షాన్‌దార్’. షాహిద్‌కపూర్ ఇందులో కథానాయకుడు.
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ... ‘ఈ దఫా అలియా అధరాలను అందుకునే అదృష్టశాలి షాహిద్’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమవ్వడం మొదలయ్యాయి. దీనికి తగ్గట్టే దర్శకుడు వికాశ్‌బాల్ కూడా ఈ సినిమాలో ‘అధర’హో అనిపించేలా కిస్సింగ్ సీన్ ప్లాన్ చేశారట. అది కూడా సాదాసీదా కిస్సింగ్ సీన్ కాదని సమాచారం. ఇప్పటివరకూ అలియా చేసిన లిప్‌లాక్‌లను తలదన్నే స్థాయిలో ఈ సీన్ ఉంటుందని వినికిడి. కథ గమనానికి ఈ లిప్‌లాక్ చాలా అవసరమవ్వడం వల్లే... దర్శకుడు ఈ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది.