Student of the Year
-
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. ‘1 నేనొక్కడినే, 100%లవ్’ చిత్రాలకు కథ అందించిన హరి ప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేశారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది’’ అన్నారు. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.కిషోర్, కెమెరా: సునీల్ కుమార్.ఎ¯Œ . -
పాపం అనన్య.. నైట్ క్లబ్‌లోకి నో ఎంట్రీ
అనన్య పాండ్య.. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్ కూడా అధికంగానే ఉన్నారు. తన గ్లామర్‌తో ఎంతో మంది కుర్రకారుల గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఓ నైట్ క్లబ్లో మాత్రం ఎంట్రీ లభించలేదు. గత వారం అనన్య తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ముంబైలోని ఓ నైట్ క్లబ్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. క్లబ్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకొని బయటకు పంపించారు. కారణం ఏమిటంటే అనన్య వయసు 24 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. ఆ క్లబ్లో 24 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి ఉందని, ఆ కారణంతోనే అనన్యను అనుమతి ఇవ్వలేదని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. కాగా తన వయసు వల్లే క్లబ్‌లోకి వెళ్లలేకపోయానని అనన్య తెగ ఫీల్ అవుతుందట. -
మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు
ముంబై : టైగర్ ష్రాఫ్ తాజా సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్లు మాత్రంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా ఇండియాలో మొదటి వారంలో రూ. 57.90 కోట్ల కలెక్షన్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రెండో వారం వసూళ్లు ఈ సినిమాకు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది విడుదలైన ‘బాగీ2’ సినిమా మొదటి వారంలోనే వంద కోట్లు పైగా (రూ. 112.85 కోట్లు) సాధించి టైగర్ ష్రాఫ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ‘బాగీ’ సినిమా తొలి వారంలొ రూ. 59.72 కోట్లు రాబట్టింది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూలో టైగర్ ష్రాఫ్ సరసన చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే, తార నటించారు. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. -
టైగర్‌తో ఆ సన్నివేశంపై అనన్య రియాక్షన్..
ముంబై : స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూతో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇదే మూవీలో హీరో టైగర్ ష్రాఫ్‌తో ముద్దు సన్నివేశంపై స్పందించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన అనన్య తాను వేరొకరికి ముద్దు పెట్టడం ఇదే తొలిసారని, సో దీన్ని మరో కిస్‌తో పోల్చలేనని, అయితే తన తొలి బెస్ట్ కిస్ ఇదేనని చెప్పారు. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు సీక్వెల్‌గా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూ తెరకెక్కింది. ఒరిజినల్లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్ధ్ మల్హోత్రాలను కరణ్ జోహార్ బాలీవుడ్‌కు పరిచయం చేశారు. మరోవైపు సీక్వెల్లో టైగర్ ష్రాఫ్‌తో అలియా భట్ ఓ పాటలో ఆడిపాడారు. కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూను పునీత్ మల్హోత్రా తెరకెక్కించారు. -
ఆ భయం లేదు
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు అనన్యా పాండే. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ఇది సీక్వెల్. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరో. తారా సుతారియా ఈ సినిమాలో మరో హీరోయిన్. ‘‘మీ తొలి సినిమాలోనే ఇంకో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పోటీగా ఫీల్ అయ్యారా? అని అనన్యా పాండేని అడిగితే... ‘‘నాకు ఎటువంటి అభద్రతాభావం లేదు. కథ నచ్చితే నాతోపాటు పదిమంది హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. పైగా నా స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది. సినిమాలో అంతమంది ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ‘స్టూ్టడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది. -
ప్రతి రోజూ మ్యాజిక్
ఏడాది పాటు క్లాసులను పూర్తి చేశారు హీరోయిన్ అనన్యా పాండే. ఎవరీ అమ్మాయి అని ఆలోచిస్తున్నారా? అయితే చదవండి. బాలీవుడ్లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో ఒక కథానాయికగా నటించారు అనన్యా పాండే. ఈ సినిమా స్టార్ట్ చేసి గత మంగళవారంతో సరిగ్గా ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు అనన్య. ‘‘మా సినిమా స్టార్ట్ చేసి సరిగ్గా ఏడాది అయ్యింది. ఏడాదిగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉన్నాను. సెట్లో ప్రతిరోజూ ఏదో ఒక మ్యాజిక్ జరిగిందనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతోంది. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు అనన్య. పుణీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్యా పాండే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’. కరణ్ జోహర్ నిర్మించారు. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి ఇది సీక్వెల్. మే 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మూడో భాగాన్ని కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. -
చెప్పినట్లే వస్తారా?
చూస్తుండగానే గడియారంలోని మల్లు గిరగిరా తిరిగి సెకన్లు, నిముషాలు, గంటలు కరిగిపోయి క్యాలెండర్లో రోజులు మారిపోతున్నాయి. సెట్స్‌లో ఉన్న సినిమాలు షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. సినీ లవర్స్ అందరూ ఎప్పటికప్పుడు సినిమా స్టేటస్ తెలుసుకుంటుంటారు. యూనిట్ నుంచి రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. సల్మాన్ ఖాన్ ‘భారత్’ రంజాన్‌కి రానుంది. అజయ్‌దేవగణ్ ‘దే దే ప్యార్ దే’ (మే 17), హృతిక్‌రోషన్ ‘సూపర్ 30’ (జూలై 26), అక్షయ్ కుమార్ ‘కేసరి’ (మార్చి 21), ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ (మే 10) వంటి చిత్రాల విడుదల తేదీలు ఎప్పుడో ఖరారయ్యాయి. ఇప్పుడు గడచిన ఆరేడు రోజుల్లో విడుదల తేదీలు ఖరారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. మరి.. చెప్పిన తేదీకే వస్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘నరేంద్ర మోదీ’ ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నరేంద్ర మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపిస్తారు. రాజకీయాల్లో మోదీ సాధించిన విజయాలు, ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం గురించిన అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. నిజ జీవితం ఆధారంగా మోదీ వస్తే.. కల్పిత కథతో ‘కళంక్’ రెడీ అయింది. సరిగ్గా మోదీ వచ్చిన ఐదు రోజులకు ఈ పీరియాడికల్ మూవీ రానుంది. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్‌కపూర్ ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించారు. 1921 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇటీవల టీజర్ విడుదలైంది. ‘కళంక్ నహీ..ఇష్క్ హై’ అనే డైలాగ్‌తో టీజర్ కంప్లీట్ అవుతుంది. దీన్నిబట్టి ఇది లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఒకటి రియల్ లైఫ్, మరోటి ఫిక్షన్.. ఆ తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే సినిమాలందు సినిమాలు వేరయా అన్నట్లు.. తెరపైకి వచ్చే సినిమాల మీదా ఆడియన్స్ దృష్టి ఉండదు. కొన్ని సినిమాల మీదే ఉంటుంది. అలా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో చాలామంది దృష్టిని ఆకర్షించిన ఓ నవలాచిత్రం ఉంది. అనూజా చౌహన్ రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా అదే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్, సోనాక్షీ సిన్హా జంటగా నటిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 14న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కథేంటంటే.. ఒక అడ్వరై్టజింగ్ ఏజెన్సీకి చెందిన ఓ అమ్మాయితో టిఫిన్ చేస్తే.. ఆ తర్వాత ఆడబోయే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం అని నమ్ముతాడు ఓ క్రికెటర్. ఆ నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే విషయాలపై ఈ సినిమా ఉంటుంది. ఇందులో నిఖిల్ పాత్రలో దుల్కర్, జోయా పాత్రలో సోనాక్షి కనిపిస్తారు. నవలా చిత్రాల విభాగంలో ఈ ఏడాది ‘దిల్ బేచరా’ అనే మరో సినిమా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా షాంఘి జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ఏడాది నవంబర్ 29న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రానికి ముఖేష్ చబ్రా దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత జాన్ గ్రీన్ రచించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్యానర్స్‌కు గురైన ఓ యువకుడు, ఓ యువతిల ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ప్రేమకథలు, యాక్షన్ స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ ఎప్పుడూ వస్తుంటాయి. వీటితో పాటు ప్రతి ఏడాదీ కొన్ని దేశభక్తి చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈ ఏడాది రానున్న దేశభక్తి చిత్రాల్లో ‘మర్జవాన్’ ఒకటి. ‘సత్యమేవ జయతే’ ఫేమ్ మిలప్ జవేరి దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్ ముఖ్, రకుల్ ప్రీత్‌సింగ్, తారా సుతారియా ముఖ్య పాత్రలుగా ఈ చిత్రం రూపొందింది. నాజర్ కీలకపాత్ర చేశారు. దేశభక్తి సినిమా కాబట్టి విడుదలకు అక్టోబర్ 2 అనుకున్నారు. యాక్షన్, లవ్, పీరియాడికల్ మూవీస్ సిల్వర్ స్క్రీప్‌పై సందడి చేస్తున్న సమయంలో ‘ది స్కై ఈజ్ పింక్’ అంటూ ఓ సెంటిమెంట్ మూవీ రావడానికి రెడీ అయింది. ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అనారోగ్యంతో బాధపడే ఓ కూతరి కోసం ఓ తల్లి పడే తాపత్రయం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్. జైరా వసీమ్‌కు తల్లి పాత్రలో ప్రియాంకా చోప్రా నటించారని తెలిసింది. ఢిల్లీకి చెందిన మోటివేషనల్ స్పీకర్ ఆశా చౌదరి పాత్రలో నటించారట జైరా వసీమ్. సోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటి విడుదల తేదీలు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ప్రకటించిన తేదీకన్నా ముందే విడుదల అవ్వొచ్చు... వాయిదా పడొచ్చు. ఎప్పుడో విడుదల చేద్దామనుకున్న సినిమాను త్వరగా పూర్తి చేసి, విడుదల చేయొచ్చు. ఈ ఏడాది విడుదల అనుకున్న సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడొచ్చు. ఇండస్ట్రీలో ఇలా జరగడం సహజం. అందుకే ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బొమ్మ వచ్చిందా? లేదా? అన్నదే ప్రేక్షకులకు ముఖ్యం. వివేక్ ఒబెరాయ్ దుల్కర్, సోనమ్ సిద్ధార్థ్, మిలప్ ప్రియాంకా చోప్రా... సుశాంత్, సంజన -
‘అందుకే నేను అదృష్టవంతుడిని అయ్యాను’
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే- భావనా పాండే వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అనన్యా పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోలను షేర్ చేసిన అనన్య..‘మొదటి పెళ్లిరోజు నుంచి నుంచి మీతోనే ఉన్నాను. మీ ఇద్దరికీ 21వ వివాహ వార్షిక శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో... ‘ అవును... మీ ముగ్గురు నా జీవితంలో ఉండటం వల్లే నేను అదృష్టవంతుడిని అయ్యాను’ అని చుంకీ పాండే.. తన గారాల పట్టి విషెస్‌కు బదులిచ్చారు. కాగా బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చుంకీ పాండే 1998లో భావనను పెళ్లాడాడు. వీరికి అనన్య, రీసా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె అనన్య ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన ఓ హీరోయిన్గా అనన్య నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram Been around since the 1st one, happy 21st anniversary guys ❤️👼🏻 #DadYouGotLucky #Goals A post shared by Ananya 👩🏻🎓💫 (@ananyapanday) on Jan 16, 2019 at 11:21pm PST -
తొలి రోజే ‘ధడక్’ సరికొత్త రికార్డు
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా పరిచయం చేస్తూ కరణ్ జోహార్ నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్’. మరాఠీ మూవీ ‘సైరట్’కు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ నటనను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. శుక్రవారం(జూలై 20) విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించి జాన్వీ సంతోషాన్ని రెట్టింపు చేసింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ధడక్‌కు గొప్ప ఆరంభం.. నూతన తారలతో రూపొందినప్పటికీ తొలిరోజే 8.71 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరిట ఉన్న రూ. 8 కోట్ల రికార్డును అధిగమించిందంటూ’ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా ఈ రెండు సినిమాలు కరణ్ జోహారే నిర్మించారు. ‘ధడక్’ సినిమాలో జాన్వీకి జోడీగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించాడు. ‘బియాండ్ ద క్లౌడ్స్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన ఇషాన్‌కు హీరోగా మాత్రం ఇదే తొలి చిత్రం. #Dhadak takes a HEROIC START... Rarely does a film starring absolute newcomers open so well... Day 1 is higher than #StudentOfTheYear [₹ 8 cr]… Fri ₹ 8.71 cr. India biz. — taran adarsh (@taran_adarsh) July 21, 2018 -
కంట్రోల్ తప్పింది
తొలి సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్లో పాల్గొంటున్నారు కథానాయిక అనన్యా పాండే. కానీ బ్యాడ్‌లక్. సెట్లో ఆమెకు స్మాల్ యాక్సిడెంట్ అయ్యిందట. అయితే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఆరేళ్ల క్రితం విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రానికి సీక్వెల్‌గా పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియా ముఖ్య పాత్రలుగా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. టైగర్ ష్రాఫ్, అనన్యా పాండే, తారా సుతారియాలపై హై స్కూల్నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ సీన్లో భాగంగా అనన్యా కారు డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు కంట్రోల్ తప్పి చెట్టును ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు చిత్రబృందం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. దాంతో రిలీఫ్ అయ్యారట. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నార -
మరో ఇద్దరు స్టార్ వారసుల ఎంట్రీ!
బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్ అలీఖాన్, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్లో తన కెరీర్ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. -
హాట్... హాట్‌గా అలియా!
‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంలో ఆలియా భట్ అందాలు చూసి ఫ్లాట్ కాని కుర్రకారు లేరేమో. దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ తెరకెక్కించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆలియా భట్ గ్లామర్ కూడా ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి కాదేమో. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ మొదటి చిత్రమైనా ఆలియా భట్ బికినీలో అందాలు ఒలికించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడు మళ్లీ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘షాన్ దార్’ చిత్రంలో ఆలియా బికినీలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ‘క్వీన్’ ఫేం వికాస్ బెహల్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్నారు. -
పెద్ద రిస్క్ చేశా!
ఏ పాత్రనైనా ఆలియా భట్ అలవోకగా చేసేస్తుందని హిందీ రంగంలో పేరు. ఆమె నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’, ‘హైవే’ చిత్రాలు చూసినవాళ్లెవరయినా ఈ మాటలతో ఏకీభవిస్తారు. అలాంటి ఆలియా ‘‘నా జీవితంలో నేను పెద్ద రిస్క్ తీసుకున్నా. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి రిస్క్ తీసుకోనేమో’’ అంటున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ చెబుతున్నది ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం గురించి. ఇందులో చాలా క్లిష్టమైన పాత్ర చేస్తున్నానని ఆలియా పేర్కొన్నారు. హాకీ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నారామె. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకూ ఈ ఆట ప్రాక్టీస్ చేస్తున్నారట. అంతకుముందెప్పుడూ హాకీ ఆటను పెద్దగా చూసేదాన్ని కాదనీ, ఇప్పుడు చూడటం మాత్రమే కాదు... ఆడక తప్పడంలేదనీ ఆలియా అన్నారు. ఇప్పటివరకూ చేసిన అరడజను చిత్రాల్లో శారీరకంగా ఎక్కువ కష్టపెడుతున్న పాత్ర ఇదేననీ ఆమె తెలిపారు. -
ఆమెను 40 లక్షలమంది అనుసరిస్తున్నారు
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ భామ అలియాభట్‌కు ఫిదా అయిపోయేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య 40 లక్షలు దాటేసింది. 22 ఏళ్ల ఈ చిన్నది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా యువ హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ అమ్మడు షాందార్, ఉథా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ అనే చిత్రాల ద్వారా వెంటవెంటనే తన అభిమానులను పలకరించబోతోంది. అయితే, సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆమెను ఫాలో అయ్యేవారు దాదాపుగా 4.19 మిలియన్లకు చేరడంతో తెగ మురిసిపోతోంది అలియా భట్. అభిమానులారా మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సినిమాలు, పాటలు, జోకుల ద్వారా ఎలా వీలయితే అలా మీ అందరిని అలరింపజేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను' అంటూ వాగ్దానం చేసింది. -
ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట!
వర్తమానం ‘స్టూడెంట్ ఆఫ్ ఇయర్’, ‘హై వే’, ‘2 స్టేట్స్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆలియా భట్, ఒక టీవి షోలో జీకే (జనరల్ నాలెడ్జ్)లో తన టాలెంట్‌ను ప్రదర్శించి జాతిని నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఆమె లోకపరిజ్ఞానం మీద నెట్లో బోలెడు జోక్‌లు కూడా వచ్చాయి. అవి తట్టుకోలేక జీకేను పెంపొందించుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. చెప్పొచ్చేదేమి టంటే, తలుచుకోవాలేగానీ ఆలియా చాలా కష్టపడుతుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ముందు ఆలియా భట్ చాలా లావుగా ఉండేది. ‘‘అయిదు కిలోలైనా తగ్గితే... ఇంకా అందంగా ఉంటావు!’’ అని చెప్పాడు ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహర్. ‘‘అయిదు కిలోలేం ఖర్మ...పది కిలోలు తగ్గుతాను’’ అని చెప్పింది ఆలియా. చివరికి పదహారు కిలోల బరువు తగ్గి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ షూటింగ్‌కు హాజరైంది. దటీజ్ ఆలియా! బరువు తగ్గడానికి హడావిడి అనారోగ్య విధానాల జోలికి వెళ్లకుండా ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేది. యోగా, కిక్-బాక్సింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేసేది. అలాగే జంక్ ఫుడ్‌ను పూర్తిగా బహిష్కరించింది. అలా మూడు నెలలలో 16 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘బరువు తగ్గిన వైనంపై పుస్తకం ఒకటి రాయవచ్చు కదా!’’ అని ఎవరో సలహా ఇస్తే- ‘‘అవును సుమీ..ఈ ఐడియా ఏదో బాగుంది’’ అని కూడా అందట ఆలియా! -
అధరహో...!
బాలీవుడ్లో సీరియల్ కిస్సర్ అనగానే... టకీమని ఇమ్రాన్ హష్మీ గుర్తొస్తారు. ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు లిప్ లాక్ ఉండాల్సిందే. అదే పంథాలో ముందుకెళ్తున్నారు బాలీవుడ్ భామ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హైవే, 2 స్టేట్స్, హమ్టీ శర్మాకీ దుల్హనియా... ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది ఈ నాలుగు సినిమాలే. ఈ నాలుగింటిలోనూ తాను జతకట్టిన కథానాయకులతో లిప్ కిస్లను లాగించేసింది అలియా. అందుకే... ప్రస్తుతం అలియాను బాలీవుడ్లో అందరూ లేడీ ఇమ్రాన్ హష్మీ అని పిలుస్తున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ‘షాన్‌దార్’. షాహిద్‌కపూర్ ఇందులో కథానాయకుడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నుంచీ... ‘ఈ దఫా అలియా అధరాలను అందుకునే అదృష్టశాలి షాహిద్’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమవ్వడం మొదలయ్యాయి. దీనికి తగ్గట్టే దర్శకుడు వికాశ్బాల్ కూడా ఈ సినిమాలో ‘అధర’హో అనిపించేలా కిస్సింగ్ సీన్ ప్లాన్ చేశారట. అది కూడా సాదాసీదా కిస్సింగ్ సీన్ కాదని సమాచారం. ఇప్పటివరకూ అలియా చేసిన లిప్‌లాక్‌లను తలదన్నే స్థాయిలో ఈ సీన్ ఉంటుందని వినికిడి. కథ గమనానికి ఈ లిప్‌లాక్ చాలా అవసరమవ్వడం వల్లే... దర్శకుడు ఈ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. -
కష్టం ఫలించింది...
వయసులో చిన్నదే గానీ ఆలియా భట్ సాధించిన విజయాలు బాగానే ఉన్నాయి. ఈ 21 ఏళ్ల బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్లు కొట్టాయి. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తోపాటు హైవే, హంప్టీ శర్మా కీ దుల్హానియా, 2 స్టేట్స్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. కష్టపడడంతోపాటు అదృష్టం కలసి రావడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని ఆలియా చెప్పింది. నాలుగైదు హిట్లు దక్కినంత మాత్రాన గర్వం నెత్తికి ఎక్కడకూడదంది. ‘విజయాన్ని ఎలా కొలుస్తారో నాకు తెలియదు. నా అదృష్టం కొద్దీ మంచి అవకాశాలు దొరికాయి. సత్తా ఉన్న దర్శకులతో పనిచేసే భాగ్యం దక్కింది. వీళ్లు నా నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకోవడానికి కారకుడైన కరణ్ జోహార్‌కు కృతజ్ఞతలు. శ్రమించే తత్వం, అదృష్టం వల్లే విజయాలు దక్కాయి’ అని వివరించింది. ఆలియా మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు కరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే కెరీర్లో ఎన్ని మార్పులు వచ్చినా, తన వ్యక్తిత్వంలో మార్పేమీ లేదని ఈ యువతి చెప్పింది. ప్రస్తుతం హిట్లు ఖాతాలో ఉన్నా, భవిష్యత్‌లో అపజయాలు ఉంటాయోమోనన్న భయం కూడా వెన్నాడుతోందని తెలిపింది. హిందీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టమని స్పష్టం చేసింది. ఇక ఆలియా తదుపరి సినిమా షాందార్ కాగా, ఇందులో షాహిద్ కపూర్ హీరో. రణ్‌బీర్ కపూర్‌తోనూ మరో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఆలియా అందంపైనా బాగా దృష్టి పెట్టింది. బరువు తగ్గడం, మంచి ఆహారంపై శ్రద్ధ చూపుతోంది. మరీ బక్కపల్చగా ఉండడం తనకు ఇష్టముండదని, ఫిట్‌గా కనిపిస్తే చాలన్నది ఆలియా అభిప్రాయం. డబ్బు పెట్టి థియేటర్లకు వచ్చే వారికి ఆహ్లాదంగా అనిపించేలా నటులు ఉండాలని చెప్పింది. -
చూసి సంతోషించాలి
తన సినిమాలను చూసి అంతా సంతోషించాలనేది తన అభిమతమని వర్ధమాన నటుడు వరుణ్ ధవన్ పేర్కొన్నాడు. ధవన్ హీరోగా ఇటీవల విడుదలైన ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదలుకుని తాజా సినిమా ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ వరకూ వరుణ్ నటించిన సినిమాలన్నింటికీ వివిధ దర్శకులు దర్శకత్వం వహించారు. ప్రతి సినిమాలో వరుణ్ విభిన్నమైన పాత్రను పోషించాడు. తన తాజా ప్రాజెక్టులతోపాటు ఆలియాభట్‌తో అనుభవం తదితరాలకు సంబంధించిన తన మనోభావాలను మీడియాతో వరుణ్ పంచుకున్నాడు. ‘ఆలియాతో పనిచేయడం విభిన్నమైన అనుభూతిని కలిగించింది. నా నటనాశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో నటించిన సినిమాలకంటే ఆలియాతో నటించే సమయంలో నా నటనా శైలి పూర్తిగా మారిపోయింది. ఇక తాజా సినిమా ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’లో తనను అత్యంత ప్రేమించే యువతి పాత్రను ఆలియా పోషించింది. ఆమెతో నటిస్తుంటో నాలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలు వేసేది. బాగా చార్జి అయ్యేవాడిని. నా సంభాషణలను అత్యంత నిదానంగా చెప్పేవాడిని. ఈ సినిమాలో తనతోపాటు నటించిన శశాంక్ మరో నటనా పాఠశాలనుంచి వచ్చాడు. అతనిది పూర్తిగా థియేటర్ బ్యాక్‌గ్రౌండ్. అతను నసిరుద్దీన్ షా శిష్యుడు. నటన విషయంలో అతని శైలి నా కంటే భిన్నంగా ఉండేది. ఎంతో సహజంగా ఉండేది. అతనితో కలసి పనిచేయడం నాకు ఎంతో అనుభవం మిగల్చడంతోపాటు ఎంతో ఉత్సాహంగా కూడా అనిపించేది. శశాంక్.. నాకు నాలుగు టేక్‌లు ఇచ్చేవాడు. ఏదిఏమయినప్పటికీ అతనితో పనిచేయడంవల్ల నేను ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు వీలైంది ’అని చెప్పాడు వరుణ్ ధవన్. -
స్టెప్పులతో అదరగొట్టింది
తన తాజా సినిమా హంప్టీ శర్మా కీ దుల్హానియా సినిమా ప్రచారం కోసం ఆలియా భట్ చాలా కష్టపడుతోంది. దీని ప్రచారం కోసం సహనటుడు వరుణ్ ధవన్‌తోపాటు శుక్రవారం బెంగళూరు వచ్చిన ఈ చిన్నది, అక్కడ హల్చల్ చేసింది. ఈ సినిమాలోని పంజాబీ గీతం ‘మై తెను సమ్జావాన్ కీ’కు స్టెప్పులేయడంతో అభిమానుల చప్పట్లు మార్మోగాయి. సినిమాలో ఈ పాటను శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ పాడారు. ఆలియా కోసం సమ్జావాన్ అన్ప్లగ్డ్ పేరుతో ప్రత్యేక గీతాన్ని సృష్టించారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వరుణ్, ఆలియాకు తొలి సినిమా కాగా, వీళ్లిద్దరూ కలసి మరోసారి హంప్టీ శర్మా కీ దుల్హానియాలో కనిపిస్తునారు. ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలుకొట్టడం ఖాయమని ఆలియా బలంగా నమ్ముతోంది. వరుణ్ మాట్లాడుతూ ‘ఇది విభిన్నమైన ప్రేమకథా సినిమా. అంబాలా, చండీగఢ్, ఢిలీ ముంబైలో షూటింగ్ చేశాం. నేను గతంలో ఎన్నోసార్లు బెంగళూరుకు వ చ్చి సరదాగా గడిపాను. ఇక్కడ అర్ధరాత్రి ఒంటిగంట దాకా విందులు, వినోదాలు కొనసాగుతాయి. సరదాగా సంగీతం వింటూ స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉంటే సమయమే తెలియదు’ అని చెప్పిన వరుణ్ ఇందులో టైటిల్ పాత్ర హంప్టీ శర్మగా కనిపిస్తాడు. యాక్షన్ సినిమా ఎప్పుడు చేస్తావని అడిగితే ‘త్వరలోనే’ అని అన్నాడు. సినిమాలో ఆలియాతో తన జోడీ గురించి ప్రస్తావించగా, ఇద్దరి మధ్య ప్రేమ, ద్వేషం వంటివాటితో కథ ముందుకు సాగుతుందని చెప్పాడు. నిజజీవితంలోనూ తామిద్దరి మధ్య ఇలాంటి సంబంధాలే ఉన్నాయని తెలిపాడు. హంప్టీశర్మకు క్రికెట్ పిచ్చి ఎక్కువగా, కావ్యా ప్రతాప్‌సింగ్ (ఆలియా) ఎప్పుడూ చిలిపిగా ఉండే యువతిగా కనిపిస్తుందని వివరించాడు. శశాంక్ ఖేతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లకు వస్తోంది. -
ఒకటి కాదు... రెండుసార్లు!
విశేషం సిద్ధార్థ మల్హోత్రా తెలుసుకదా? అదేనండీ...కరణ్ జోహర్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఫిబ్రవరి 2007 ‘మెన్స్ హెల్త్’ పత్రికకు కవర్ మోడల్‌గా పనిచేసిన సిద్ధార్థ....కొంత కాలానికి ముంబాయికి వచ్చి ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు కరణ్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత హీరో కూడా అయ్యాడు. ఏప్రిల్ 2014 ‘మెన్స్ హెల్త్’ కోసం తాజాగా మరోసారి మోడల్ అవతారం ఎత్తాడు. ‘‘ఈ ఏడు సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో ఫోటో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చేయగలనా అని సందేహించాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆత్మవిశ్వాసం వచ్చింది’’ అంటున్నాడు సిద్ధార్థ. విశేషం ఏమిటంటే ‘మెన్స్ హెల్త్’ కవర్ పేజీ మోడల్‌గా రెండు సార్లు చేసిన తొలి వ్యక్తి...సిద్ధార్థ మల్హోత్రా! -
రెండో సినిమా అగ్ని పరీక్షే!
పెద్దగా అంచనాలేవీ లేకుండానే బాలీవుడ్‌లోకి ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ చిత్రంతో అడుగుపెట్టాడు. గుంపులో గోవిందయ్య పాత్ర కావడంతో ఈజీగానే నెట్టుకొచ్చేశాడు. సినిమా విడుదలైంది. మరీ అంత హిట్ కాకపోయినా ఫరవాలేదనిపించింది. ఆ తర్వాత రెండో చిత్రం కోసం అవకాశం వచ్చింది. అయితే ఇది మొదటి సినిమాలాంటిది కాదు. గుంపులో గోవిందయ్య పాత్ర అసలే కాదు. సోలో హీరో..! మంచిపేరొచ్చినా, చెడ్డ పేరొచ్చినా ఈ సోలో హీరోకే వస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మరి ఈ అడుగులు అతని కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి. ... ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు..? ఇంకెవరు.. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో అలియాభట్, వరుణ్ ధావన్‌తో కలిసి తెరను పంచుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా గురించి. తొలి చిత్రంలో నటించే అవకాశం 28 సంవత్సరాలకుగానీ దక్కలేదు. ఇక రెండో చిత్రం ‘హసీ తో ఫసీ’లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి మల్హోత్రా మాట్లాడుతూ... ‘చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో ఆందోళనగా కూడా ఉంది. ఇది నాకు అగ్ని పరీక్ష వంటిదే. ఎందుకంటే ఈ సినిమాలో నేను సోలో హీరో. ఏది చేసినా... నేనే! ఏది దక్కినా.. నాకే! అందుకే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. అయితే ఈ చిత్రం నన్ను నిరాశపర్చదనే విశ్వాసం కూడా ఉంది. ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు వందశాతం కష్టపడ్డాను. మొదటి చిత్రంలో నటించేటప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నన్ను పరిచయం చేసిన కరణ్ నా సగం బాధ్యతలను తన భుజాలపైనే వేసుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నా బాధ్యత చాలా పెరిగినట్లు అని పించింది. ఈ చిత్రంలో ఓ రొమాంటిక్ కామిడీ. దర్శకుడు వినీల్ మాథ్యు చాలా అందంగా తెరకెక్కించాడు. అయితే ప్రేక్షకులు ఆదరించినప్పుడే ఏ నటుడికైనా గుర్తింపు దక్కుతుంది. చూద్దాం.. రెండో పరీక్షలో నెగ్గుతానో..? లేదో...? -
నేనిప్పుడు బాత్రూమ్ సింగర్‌ని కాదు!
‘‘మా ఇంట్లో అంతా నన్ను బాత్రూమ్ సింగర్ అని ఆటపట్టిస్తుంటారు. బయటివాళ్ల ముందు పాడటానికి సాహసించని నేను ఇప్పుడు అందరికీ వినపడేట్లు పాడా’’ అని సంబరపడిపోతూ చెబుతున్నారు అలియా భట్... డాటరాఫ్ ది గ్రేట్ డెరైక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్‌భట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన అలియా ప్రస్తుతం ‘హైవే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల్లో ‘సూహా సాహా...’ అనే పాటను ఎవరితో పాడిస్తే బాగుంటుందా అని రహమాన్ అనుకుంటున్నప్పుడు, అలియా గొంతు బాగుంటుందనీ తనతో పాడిద్దామని ఇంతియాజ్ అన్నారు. వాస్తవానికి ఈ దర్శకుడి ముందు అలియా ఎప్పుడూ పాడలేదు. కానీ, ఆయన అలియాలోని సింగర్‌ని గమనించారు. ఆ విషయమే రహమాన్ దగ్గర చెప్పారు ఇంతియాజ్. దాంతో అలియాతో పాడించాలని రహమాన్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ, అలియా మాత్రం చాలా టెన్షన్ పడ్డారట. ముందు పాడటానికి సంశయించానని, రహమాన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పాడగలిగానని ఆమె పేర్కొన్నారు. రెండు సార్లు రఫ్ ట్రాక్ పాడిన తర్వాత మూడోసారి ఫైనల్ వెర్షన్ పాడానని, రహమాన్‌గారు మెచ్చుకున్నారని కూడా చెప్పారు. బాత్రూమ్ సింగర్ అయిన తనతో పాట పాడించిన ఘనత రహమాన్‌కే దక్కుతుందని అలియా తెలిపారు.