ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట! | Alia Bhatt, participated a television show | Sakshi
Sakshi News home page

ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట!

Published Tue, Feb 17 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట!

ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట!

వర్తమానం

‘స్టూడెంట్ ఆఫ్ ఇయర్’, ‘హై వే’, ‘2 స్టేట్స్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆలియా భట్,  ఒక టీవి షోలో జీకే (జనరల్ నాలెడ్జ్)లో తన టాలెంట్‌ను ప్రదర్శించి జాతిని నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఆమె లోకపరిజ్ఞానం మీద నెట్‌లో బోలెడు జోక్‌లు కూడా వచ్చాయి. అవి తట్టుకోలేక జీకేను పెంపొందించుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. చెప్పొచ్చేదేమి టంటే, తలుచుకోవాలేగానీ ఆలియా చాలా కష్టపడుతుంది.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ముందు ఆలియా భట్ చాలా లావుగా ఉండేది. ‘‘అయిదు కిలోలైనా తగ్గితే... ఇంకా అందంగా ఉంటావు!’’ అని చెప్పాడు ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహర్. ‘‘అయిదు కిలోలేం ఖర్మ...పది కిలోలు తగ్గుతాను’’ అని చెప్పింది ఆలియా. చివరికి పదహారు కిలోల బరువు తగ్గి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ షూటింగ్‌కు హాజరైంది. దటీజ్ ఆలియా! బరువు తగ్గడానికి హడావిడి అనారోగ్య విధానాల జోలికి వెళ్లకుండా ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేది. యోగా, కిక్-బాక్సింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేసేది. అలాగే జంక్ ఫుడ్‌ను పూర్తిగా బహిష్కరించింది. అలా మూడు నెలలలో 16 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘బరువు తగ్గిన వైనంపై  పుస్తకం ఒకటి రాయవచ్చు కదా!’’ అని  ఎవరో సలహా ఇస్తే- ‘‘అవును సుమీ..ఈ ఐడియా ఏదో బాగుంది’’ అని కూడా అందట ఆలియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement