general knowledge
-
అరరే... ఇట్లయితే ఎట్లా!
‘మడిసన్నాక కాస్త కళాపోషణే కాదు కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి’ అనిపిస్తుంది ఈ వైరల్ వీడియోను చూస్తే. ‘మన జాతిపిత ఎవరు?’ అనే ప్రశ్నకు ఎంతోమంది యంగ్‌స్టర్స్ చెప్పిన జవాబులు ‘అయ్ బాబోయ్’ అనిపిస్తాయి. ‘మా జాతిపిత సర్దార్ వల్లభ్‌భాయి పటేల్’ అని సమాధానం చెప్పింది ఒక అమ్మాయి. మరో అమ్మాయి... ‘నరేంద్ర మోదీ’ అని చెప్పి నాలుక కర్చుకొని ‘కాదు...కాదు...నిజంగా చె΄్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా’ అన్నది. ‘నాకు తెలుసు గానీ మీరు సడన్‌గా అడిగే సరికి గుర్తు రావడం లేదు’ అని నైస్‌గా తప్పించుకున్నారు ఒకరు. -
ఐదేళ్లకే అబ్బురపరుస్తున్న హిమాన్షు! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో..
ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఇవి చదవండి: వసుధైక కుటుంబం.. ఐదు తరాల అనుబంధం -
మీకు తెలుసా ?
-
ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? (ఫోటోలు)
-
మీకు తెలియని నిజాలు తెలుగులో (ఫోటోలు)
-
ఈ సంగతులు మీకు తెలుసా?
-
అన్నింటికీ సమాధానాలు.. ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా?
శోధించి సాధించు... అన్నారు. ఆ సాధనలో అద్భుతాలు సాధిస్తే ఎంత బాగుంటుంది! కృత్రిమ మేధస్సుతో కూడిన రకరకాల ఛాట్బోట్లు ఆ అద్భుతాలకు నిలయం కానున్నాయి. యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న ఛాట్‌బోట్ ‘ఛాట్‌బోట్‌జీపీటీ’ ఎందుకు? ఏమిటి? ఎలా? జనరేటివ్ ప్రీ–ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ జనరల్ నాలెడ్జ్ నుంచి జటిలమైన ప్రశ్నలకు సమాధానం వరకు, మ్యూజిక్ కంపోజింగ్ నుంచి పాటలు రాయడం వరకు ఎన్నో విషయాలలో ఉపకరించే ఏఐ ఆధారిత ఛాట్బోట్ల గురించి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో యూత్ ‘చాట్‌జీపీటీ’ (జనరేటివ్ ప్రీ–ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) గురించి అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. దిగ్గజ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ను ఈ ‘ఛాట్‌జీపీటీ’ సవాలు చేయగలదని కొందరు, అధిగమించి అగ్రస్థానంలో నిలవనుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలలో నిజానిజాల మాట ఎలా ఉన్నా ‘ఆసక్తి’ మాత్రం నిజం. ఇంతకీ ఏమిటి దీని ప్రత్యేకత? కంటెంట్ క్రియేషన్‌లో ఉపయోగపడుతుంది. ఏదైనా క్రియేటివ్ ఆర్టికల్ రఫ్‌గా రాస్తే మంచి మంచి పదాలు, శైలితో సొబగులు అద్దగలదు. ఏదైనా అంశానికి సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నా డేటాను క్రమపద్ధతిలోకి తీసుకురాగలదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాయగలదు. మనుషుల సంభాషణ శైలిని సహజంగా అనుకరించగలదు. తనదైన శైలిలో ఏదైనా విషయం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు ‘ఇదిగో ఈ లింకులు ఉన్నాయి’ అన్నట్లుగా చూపుతుంది. ‘ఛాట్‌జీపీటీ’ మాత్రం లింక్‌లతో పాటు తనదైన శైలిలో విషయ వివరణ ఇస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జాత్యహంకార, సెక్సిస్ట్ ప్రాంప్ట్‌లను ‘చాట్‌జీపీటీ’ డిస్మిస్ చేస్తుంది. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ‘ఛాట్‌జీపీటీ’ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించింది. కంప్యూటర్ సైంటిస్టు శామ్ఆల్ట్మన్, ఎంటర్ప్రెన్యూర్, ఇన్వెస్టర్, ప్రోగ్రామర్ ఇల్యా సట్స్‌కెర్వర్, ఎలాన్ మస్క్... లాంటివారు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రముఖులు. ఆ తర్వాత కాలంలో మస్క్ తప్పుకున్నారు. ‘ఫ్రెండ్లీ ఏఐ’ మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ దీనిలో పెట్టుబడి పెట్టడం విశేషంగా మారి అంచనాలు మరింతగా పెంచింది. ‘ఫ్రెండ్లీ ఏఐ’ ని దృష్టిలో పెట్టుకొని ఏఐ రంగంలో లోతైన పరిశోధనలు చేస్తోంది ఛాట్‌జీపీటీ. వ్యక్తిగత సంభాషణ, సోషల్‌మీడియాలో అభిప్రాయాల కలబోత అనేది ఒక ఎత్తు అయితే, ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది గార్డియన్’లాంటి పత్రికలు ‘ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాట్‌బోట్’ అంటూ ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించడం మరో ఎత్తు. మరోవైపు టెక్నాటజీ రైటర్ డాన్ గ్లిమోర్ ప్రయోగాత్మకంగా పరీక్షించి ‘ఛాట్‌జీపీటీ’ని ప్రశంసించారు. అంతా బాగానే ఉందిగానీ, ‘ఛాట్‌జీపీటీ’కి పరిమితులు, లోపాలు లేవా? అనే ప్రశ్నకు ‘నో’ అనే జవాబు మాత్రం వినిపించదు. అప్పుడప్పుడూ తప్పుడు సమన్వయాలు, పునరావృతం అయ్యే పదాలు, తప్పుడు సమాధానాలు కనిపించవచ్చు. కొన్ని సంఘటనల గురించి పరిమిత సమాచారానికి మాత్రమే పరిమితం కావచ్చు. గూగుల్‌ను పక్కకు తప్పించగలదా? కొందరు ప్రముఖుల గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు... ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ‘ఓపెన్ ఏఐ’ ఈ పరిమితులు, లోపాలను దాచాలనుకోవడం లేదు. యూజర్లు లోపాలను ఎత్తిచూపవచ్చు. సూచనలు ఇవ్వవచ్చు. వాటిని ఆహ్వానిస్తోంది ఛాట్‌జీపీటీ. ప్రయోగదశ కాలంలో పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ‘ఛాట్‌జీపీటీ’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గూగుల్‌ను పక్కకు తప్పించగలదా? యువతరం అంచనాలకు న్యాయం చేయగలదా?... మొదలైన ప్రశ్నలకు స్పష్టత వచ్చేందుకు ఎంతో కాలం పట్టేటట్లు లేదు. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత -
AP: విద్యార్థులకు అందుబాటులో ప్రపంచ జ్ఞానం!
సాక్షి, అమరావతి: బట్టీ పట్టే చదువులతో విద్యార్థుల్లో ప్రపంచ పరిజ్ఞానం లోపిస్తోంది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలోని విద్యార్థులకు విస్తృతమైన జనరల్ నాలెడ్జి కోసం రీడింగ్ రైట్ అనే సంస్థ సహకారంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చిన స్మార్టికల్ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ఆరంభించిన అనతికాలంలోనే 25 వేల మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు దానిని డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. విద్యార్థుల మానసిక వికాసానికి సచిత్ర, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివరణాత్మక వార్తా కథనాలను అందించేందుకు ఈ స్టార్టప్ యాప్‌ను ఉన్నత విద్యామండలి ఇటీవలే ప్రారంభించింది. నిపుణులు వివిధ పత్రికలు, మేగజైన్లు, ఇతర జర్నల్స్‌లో వచ్చిన వార్తా కథనాలను ఈ స్టార్టప్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు అందిస్తున్నారు. విభిన్న రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దేలా వాస్తవిక దృశ్యాత్మక అంతర్జాతీయ కథనాలను ఉండేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. చదివేకొద్దీ సమాచారం ప్రతి పదానికి అర్థం, దాని వ్యుత్పత్తితో పాటు చాలా లోతుగా అన్ని అంశాలను ఈ యాప్ అందిస్తోంది. విద్యార్థి ఏదైనా కొత్త అంశాన్ని విన్నప్పుడు దానికి సంబంధించిన ముందు వెనుక అంశాలన్నిటినీ వారికి అందిస్తోంది. సబ్జెక్టు అంశాలతో ముడిపడి ఉన్న జనరల్ నాలెడ్జి అంశాలను విద్యార్థులకు సులభమైన రీతిలో అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా సమస్త సమాచారాన్ని వారి ముందుంచుతోంది. ఇవే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు, వాటికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా యాప్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం పాటు చేసిన ఆందోళన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విద్యార్థి ఆ పదాన్ని యాప్‌లో టైప్ చేయగానే దాని ప్రాథమిక సమాచారం అందుబాటులోకి వస్తుంది. దాన్ని చదివిన వెంటనే దానితో ముడిపడి ఉన్న అంశాలు ఒకదాని వెనుక ఒకటిగా విద్యార్థికి అందుతాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికల కథనాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లలో వార్తా కథనాలు, సంపాదకీయాలు, ప్రముఖుల విశ్లేషణలు ఈ యాప్ అందిస్తోంది. ద కార్వాన్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఫ్రంట్‌లైన్–హిందీ, లైవ్‌మింట్, అబ్జర్వ్ రీసెర్చి ఫౌండేషన్, వియాన్, ద కెన్, ద వైర్, ఆర్టికల్ 14, బ్రోకింగ్ ఇండియా, ద హిందూ, ద ప్రింట్, లైవ్‌లా, బిజినెస్ స్టాండర్డ్, ద ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ పత్రికలు, మేగజైన్ల కథనాలు విద్యార్థులకు యాప్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎడిటోరియల్స్, బిజినెస్, ఇండియన్ పాలిటిక్స్, సైన్సు అండ్ టెక్నాలజీ, ఎకానమీ, స్టార్టప్స్ అండ్ ఇండస్ట్రీ, లీగల్, వరల్డ్ ఎఫైర్స్, నాట్సో రీసెంట్, కల్చర్, పాలసీ, సైకాలజీ, మెంటల్హెల్త్, ఫిలాసఫీ అనే విభాగాల కింద లోతైన విశ్లేషణాత్మక కథనాలను విద్యార్థులకు ఇది అందిస్తోంది. వివరణాత్మక విధానంలో వచనం, చిత్రం, దృశ్యరూపకంగా ఆయా అంశాలను వివరించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో విశ్లేషణలతో రూపొందించిన ఈ కథనాల ద్వారా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచం తెలియనుంది. విద్యార్థులకు అందుబాటులోప్రపంచ జ్ఞానం ఈ యాప్ ద్వారా విద్యార్థులందరూ ప్రపంచ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిపుచ్చుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌తో సహ web. readingright. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీరియాడికల్స్ జర్నల్స్‌లో నిపుణులు ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేసి వడపోసి రూపొందించిన వార్తా కథనాలను ఈ స్మార్టికల్ యాప్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ యాప్ ద్వారా ప్రపంచ పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. – హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఇమ్రాన్ ఖాన్ మేధోశక్తి.. భారత్ జనాభా 13 వందల కోట్లు అంటా?: వైరల్
ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. రాత పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూ, బృంద చర్చలు అని వివిధ దశల్లో పరీక్షిస్తారు. మరి రాజకీయ ఉద్యగం పొందాలంటే. ఇవేవి అవసరం లేదు. ఓ పార్టీ పెట్టి, ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదిస్తే చాలు. కానీ ఓ దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి. కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే అవగాహన అయినా ఉండాలి. చుట్టు పక్కల దేశాల్లో పరిస్థిలపై ఓ అవగాహన ఉండాలి. ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మేధోశక్తిని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ జనాభా ‘‘వన్ బిలియన్ అండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్’’ అని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఇంతకు మందు జపాన్, జర్మనీ పొరుగు దేశాలు అని తెలిపిన ఇమ్రాన్.. చైనాను పాకిస్తాన్ పొరుగు దేశంగా కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఇమ్రాన్ క్రికెట్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్లో రెండు ప్రపంచకప్‌లు ఒకటి టెస్ట్ క్రికెట్, రెండోది వన్డే క్రికెట్ ఉన్నాయని ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా జూన్‌లో జరిగిన ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను ప్రశంసించాడు. అయితే భౌగోళికంగా జపాన్, జర్మనీ దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ పాకిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అంతే కాకుండా 2019 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 136 కోట్లు. దీంతో ఈ వీడియోకు సంబంధించి నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ భౌగోళిక పరిజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులకు వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలోచించి మాట్లాడవయ్యా బాబు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. India’s population is one billion and 300 crore- Pakistani Prime Minister Imran Khan pic.twitter.com/oP0G9O9kh4 — Shama Junejo (@ShamaJunejo) August 1, 2021 -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
గవర్నర్ కీలుబొమ్మా?
పట్నా: బిహార్‌లో ఆదివారం సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇండియాలో, ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో గవర్నర్ పాత్రను విశ్లేషించండి. గవర్నర్ కీలుబొమ్మా(కఠ్పుత్లీ)?’అన్నది ఆ ప్రశ్న. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విపక్షాలు విమర్శించడం జరిగేదే. అయితే, ఏకంగా ప్రభుత్వ పరీక్షలో, అందులోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రావడంతో విద్యార్థులు విస్తుపోయారు. బిహార్ సర్వీస్ కమిషన్ అధికారులు ఈ తప్పును ప్రశ్నపత్రాన్ని రూపొందించిన అధ్యాపకుడిపైకి నెట్టేశారు. ‘ప్రశ్నలో తప్పేమీ లేదు.అయితే, కఠ్పుత్లీ పదాన్ని తీసేసి ఉంటే బాగుండేది’అని నసిగారు. గతంలో 8వతరగతి పరీక్షలో కశ్మీర్‌ను ఓ దేశంగా పేర్కొంటూ.. ‘చైనా, ఇండియా, నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్ దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు?’ అన్న ప్రశ్న వచ్చింది. 2016లో ఇంటర్మీడియెట్‌లో ర్యాంకు సాధించిన రూబీరాయ్ పొలిటికల్ సైన్స్‌లో ‘వంట చేయడం’ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది. 2015లో పరీక్షరాసే విద్యార్థులకు కాపీలు అందించడం కోసం వారి బంధువులు పరీక్ష గది గోడలు ఎక్కడం తెల్సిందే. -
ముద్దుగుమ్మ పెద్దకల!
ఆలియాభట్ జనరల్ నాలెడ్జ్ సామర్థ్యంపై నెట్లో ఎన్నో జోక్‌లు రావచ్చుగాక, అంతమాత్రాన ఆమె నటన గురించి వంక పెట్టడానికి లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ‘హైవే’ ‘టు స్టేట్స్’ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘ఉత్తమ నటి’గా ఫిలింఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. నటన అంటేనే కాదు... సంగీతం అంటే కూడా ఆలియాకు ఇష్టం. ‘హైవే’ సినిమాలో పాట పాడి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంసలు కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ దృష్టి తాజాగా ‘డెరైక్షన్’పై పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది... అన్నట్లు మహేష్‌భట్ కూతురైన ఆలియా... తండ్రిలాగే డెరైక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటోందేమో. డెరైక్టర్ కావాలనే తన కోరికను ఆలియా ఇంతవరకు బహిరంగంగా చెప్పనప్పటికీ, ఒకవేళ ఆమె డెరైక్టర్ కావాలనుకుంటే ఆ కోరిక నెరవేరడం ఎంతసేపు! ఆలియా అక్క పూజాభట్ కూడా డెరైక్టర్‌గా ప్రయత్నించిందిగానీ పెద్దగా పేరేమీ తెచ్చుకోలేదు. ఆమెకు మాజీ హీరోయిన్గా మాత్రమే పేరుంది. ‘‘హీరోయిన్గా మంచి స్టేజ్‌లో ఉన్న సమయంలో డెరైక్షన్ వైపు వెళ్లి రిస్క్ చేయవద్దు’’ అని సన్నిహితులు ఆలియాకు సలహా ఇస్తున్నారట! -
ఆలియా... అలా... బరువు తగ్గిందన్నమాట!
వర్తమానం ‘స్టూడెంట్ ఆఫ్ ఇయర్’, ‘హై వే’, ‘2 స్టేట్స్’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆలియా భట్, ఒక టీవి షోలో జీకే (జనరల్ నాలెడ్జ్)లో తన టాలెంట్‌ను ప్రదర్శించి జాతిని నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఆమె లోకపరిజ్ఞానం మీద నెట్లో బోలెడు జోక్‌లు కూడా వచ్చాయి. అవి తట్టుకోలేక జీకేను పెంపొందించుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. చెప్పొచ్చేదేమి టంటే, తలుచుకోవాలేగానీ ఆలియా చాలా కష్టపడుతుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ముందు ఆలియా భట్ చాలా లావుగా ఉండేది. ‘‘అయిదు కిలోలైనా తగ్గితే... ఇంకా అందంగా ఉంటావు!’’ అని చెప్పాడు ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహర్. ‘‘అయిదు కిలోలేం ఖర్మ...పది కిలోలు తగ్గుతాను’’ అని చెప్పింది ఆలియా. చివరికి పదహారు కిలోల బరువు తగ్గి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ షూటింగ్‌కు హాజరైంది. దటీజ్ ఆలియా! బరువు తగ్గడానికి హడావిడి అనారోగ్య విధానాల జోలికి వెళ్లకుండా ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేది. యోగా, కిక్-బాక్సింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేసేది. అలాగే జంక్ ఫుడ్‌ను పూర్తిగా బహిష్కరించింది. అలా మూడు నెలలలో 16 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘బరువు తగ్గిన వైనంపై పుస్తకం ఒకటి రాయవచ్చు కదా!’’ అని ఎవరో సలహా ఇస్తే- ‘‘అవును సుమీ..ఈ ఐడియా ఏదో బాగుంది’’ అని కూడా అందట ఆలియా! -
నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు..!
సీతంపేట: నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు... ఇళ్లంతా అల్లరి చేస్తారు... బడికి వెళతావా అంటే ఊ..హూ అంటారు.. అఆలు దిద్దిస్తే అష్ట వంకరలు తిప్పుతారు. ఏబీసీడీలు చదవమంటే నోరు మెదపరు. అయితే పాత కొత్త పణుకువలసకు చెందిన భవిత అలా కాదు. జనరల్ నాలెడ్జలో దిట్ట. ఏ ప్రశ్న అడిగినా టక్కమని సమాధానం చెబుతుంది. ఒక సారి వింటే చాలు గుర్తుపెట్టేసుకుంటుంది. ప్రపంచ దేశాలు-వాటి రాజధానులు, రాష్ట్రాలు-వాటి రాజధానులు, ఏయే సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.. తెలుగు నెలలు, సంవత్సరాలు, ప్రముఖులు సమాధుల పేర్లు, అవి ఎక్కడ ఉన్నాయి వంటివి ఇట్టే చెప్పేస్తోంది. రోజూ ఇంటి వద్ద జనరల్నాలెడ్జ్ చెప్పడానికి పాప కోసం అరగంట పాటు కేటాయిస్తానని.. తొమ్మిదో తరగతి విద్యార్థికి ఓ మాస్టారు పాఠాలు చెబుతుండగా విని రాజధానులు వాటి పేర్లు చెప్పాలని ఇంటి వద్ద పట్టుబట్టిందని.. దీంతో జనరల్ నాలెడ్‌జ విషయాలు భవితకు చెబుతున్నామని.. అన్నీ చెప్పడమే తరువాయి ఇట్టే గుర్తుపెట్టుకుని అనర్గలంగా చెప్పేస్తుందని స్థానిక మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆమె తండ్రి దిలీప్ చెప్పారు. ఆదివారం యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీతంపేట మండలంలో వన భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉపాధ్యాయులు ఆ చిన్నారిని పలు ప్రశ్నలు వేయగా టకటక చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నారి ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు అభినందించారు. -
మీ ఇంట్లోనే డంబ్బెల్ మెంటల్ జిమ్ ఉంది!
కాఫీ విత్ కరణ్ టీవి షోలో ‘‘మన రాష్ట్రపతి ఎవరు?’’ అన్న ప్రశ్నకు- ‘‘పృథ్వీరాజ్ చవాన్’’ అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది బాలివుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్. ఇక అప్పటి నుంచి ఈ అమ్మాయి మీద సామాజిక మాధ్యమాల్లో జోక్లే జోకులు. ఇది తట్టుకోలేక ‘డంబ్బెల్ మెంటల్ జిమ్’లో చేరి తన విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసింది ఆలియా. ‘మెంటల్ జిమ్’లో రకరకాల దినపత్రికలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడంతో పాటు చరిత్రకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేది. ‘‘ఇప్పుడు నన్ను ఏ పశ్న అడిగినా సమాధానం చెబుతాను’’ అని ధీమాగా అంటోంది. సరే, ఆలియా భట్ సంగతి వదిలేద్దాం. మన విషయం ఆలోచిద్దాం. ‘మనిషన్నాక కాస్త కళా పోసన ఉండాలి’ అనే డైలాగు మీకు తెలిసిందే కదా. గమనించాల్సిన విషయం ఏమిటంటే, కళాపోసన పక్కన, లోకజ్ఞానం(జనరల్ నాలెడ్జ్) కూడా ఉండాలి. యువతలో అధికశాతం..పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నప్పుడే ‘జనరల్ నాలెడ్జ్’ చదువుతారు. మిగతా సమయంలో దాంతో సంబంధం లేనట్లుగానే ఉంటారు. ఇది సరియైన విధానం కాదనే విషయాన్ని గ్రహించాలి. మన దేశానికి సంబంధించిన ఏ విషయం గురించి అడిగినా టక్కుమని చెప్పేలా ఉండాలి. జనరల్ నాలెడ్జ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం ఆలియా భట్లా ‘డంబ్ బెల్ మెంటల్ జిమ్’కు వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి నుంచే విజ్ఞానాన్ని మెరుగు పర్చుకోవచ్చు. ఇలా చేసి చూడండి: దినపత్రికలు తప్పనిసరిగా చదవాలి. ఆలా చదువుతున్న క్రమంలో ఎన్నో విషయాలు మనసులో నిక్షిప్తమైపోతాయి క్విజ్ పోటీలలో తరచుగా పాల్గొనాలి. దీని ద్వారా మనకు ఎంత తెలుసు, ఎంత తెలియదు అనేది అవగాహనలోకి వస్తుంది చరిత్ర, ఆటలు, సంస్కృతి, శాస్త్రీయం... ఇలా విభజించుకొని వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను ఒకటికి రెండుసార్లు చదవాలి జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను కొని చదువుతూ ఉండాలి జీకె మీద ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్‌తో కలిసి ‘ప్రశ్న-జవాబు’ ఆట ఆడండి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారే విజేత ‘రోజుకు అయిదు కొత్త విషయాలు’ నేర్చుకోండి. నెలకు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. -
ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!!
ఆలియా భట్ హిందీ సినిమాల్లో అద్భుతంగా నటిస్తుంది. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్లే. కానీ, జనరల్ నాలెడ్జి విషయంలో మాత్రం అమ్మడు చాలా పూర్. ఆ విషయం మీద సోషల్ మీడియాలో ఆమెపై జోకులు తెగ పేలుతుంటాయి. తాజాగా ఆమె తన అజ్ఞానాన్ని మరోసారి నిరూపించుకుంది. కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోతో మొదటిసారి ఆమె అజ్ఞానం బయటపడింది. భారత రాష్ట్రపతి ఎవరంటే, పృథ్వీరాజ్ చవాన్ అని ఆమె చెప్పింది. తాజాగా షకున్ బత్రా రూపొందించిన కామెడీ వీడియోలో.. ఆలియా ఓ మెంటల్ ట్రైనింగ్ జిమ్‌లో చేరినట్లు ఉంటుంది. ఆ ట్రైనింగ్ ద్వారా ఆమె తన జనరల్ నాలెడ్జిని పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పది నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఆలియా తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్, తల్లి సోనీ రాజ్దాన్, 2స్టేట్స్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఉంటారు. కరణ్ జోహార్ అడిగే అన్ని ప్రశ్నలకు పిచ్చి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆలియాభట్ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. తన మీద సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వస్తున్న జోకులన్నింటినీ తాను ఆస్వాదిస్తానని గతంలో ఓసారి ఆలియా చెప్పింది. -
హమారా భారత్ మహాన్...
ప్రపంచదేశాలకు భగవద్గీత రూపంలో భరోసాను అందించిన దేశం మనది... స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను ఒడ్డి పోరాడటం నేర్పిన భగత్‌సింగ్, మహాత్మాగాంధీల చరిత్రలను ప్రపంచానికి అందించిన దేశం మనది. ఏ మతం వారికైనా ఉన్నతపీఠం ఇచ్చి మతం కన్నా మానవత్వం గొప్పదన్న విషయాన్ని చాటుతున్న దేశం మనది... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాదు కానీ... గణతంత్రదినోత్సవం సందర్భంగా యువతలో జాతీయవాదం, జాతీయాంశాలపై అవగాహన గురించి ఔతా్సిహ కులు కొందరు చిన్న అధ్యయనం నిర్వహించారు. అత్యంత సాధారణమైన ప్రశ్నలను అడిగి.. వారి అవగాహన ఎంత? అనే అంశం గురించి అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనాన్ని వీడియో రూపంలో కూర్చి యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేశారు. విషాదకరమైన విషయం ఏమిటంటే... ఆ వీడియోలో అడిగేది ఐదో తరగతి స్థాయి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలే అయినా.. చెప్పే సమాధానాలు మాత్రం బాధను కలిగిస్తాయి! భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మన జాతీయ గీతం ఏది? ఎవరు రాశారు? రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ఎవరు ప్రసంగిస్తారు? మహాత్మాగాంధీ భారత ప్రధానమంత్రి అయ్యారా? లాంటి ప్రశ్నలు అడి గారు అధ్యయనకర్తలు.అడిగింది ఎవరినో అనామకులను కాదు. మెట్రో యూత్‌ను! స్టైల్‌కు ఐకాన్‌లలా కనిపించే యువతీ యువకులను. అయితే వాళ్లు చెప్పే సమాధానాలు మాత్రం వారి పట్ల సానుభూతి కలిగేలా ఉన్నాయి. ‘జాతీయ గీతమా? దాన్ని రవీంద్రనాథ్ ఛటోపాధ్యాయ రాశారా? ’ అనే ఎదురు ప్రశ్నలు. ‘రిపబ్లిక్‌డే రోజున.... ఐ థింక్ ...అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తారు కదా!’ అనే సందేహాలు. ‘గాంధీ... 1947లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు...’ అంటూ నమ్మకంగా చెప్పే వారి మొహాలు కనిపిస్తాయి ఆ వీడియోలో. మన దేశానికి సంబంధించిన చాలా ప్రాథమిక విషయాలు యువతకు తెలియవనే నిజాన్ని ఆ వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు అధ్యయనకర్తలు. అందరూ అలాగే ఉంటారా?! అంటే ఔనని చెప్పలేం. ఇదే సమయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫేస్బుక్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టేసుకొనేంత దేశభక్తి కూడా మనకే సొంతం. మరి అవగాహనకూ దేశాభిమానానికీ సం బంధం లేకపోవచ్చు. అయితే కొన్నింటిపై నైనా కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం. ఉద్యోగరీత్యా మరోదేశానికి వెళ్లితే అక్కడ మీ దేశం గురించి చెప్పండని ఎవరైనా అడిగితే నీళ్లు నమలకూడదు కదా! అందుకోసమైనా కొన్ని విషయాలపై అవగాహన సంపాదించుకోవాలి.దేశానికి సంబంధించిన విషయాలపై అవగాహన అనేది కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. దేశ ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవడం మన కనీస బాధ్యత. అలా తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి ఎన్నోవిషయాలున్నాయి. ఉదాహరణకు.. సంఖ్యామానానికి ఒక రూపం ఇచ్చింది భారతీయులే. భారతీయుడైన ఆర్యభట్ట ‘సున్న’ ను ఆవిష్కరించారు.గత పదివేల సంవత్సరాల్లో ఏనాడూ కూడా భారతదేశం మరో దేశంపై దండెత్తిందీ లేదు. ఆక్రమించుకొన్నదీ లేదు. క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే తక్షశిల విశ్వవిద్యాలయం ఏర్పడింది. అందులో అప్పట్లోనే దాదాపు పదివేల ఐదువందల మంది విద్యార్థులు అభ్యసించేవారట. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో ఏర్పాటు చేసిన నలంద విశ్వవిద్యాలయం భారతీయ విద్యావిధానం ఎంత అమోఘమైనదో చాటి చెప్పింది. చెస్‌ను ఆవిష్కరించింది భారతదేశంలోనే. పురాతన యుద్ధవిద్య ‘చతురంగ’ ఆధారంగా చదరంగాన్ని ఆవిష్కరించారు. ప్రపంచదేశాలకు భగవద్గీత రూపంలో భరోసాను అందించి దేశం మనది... స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను ఒడ్డి పోరాడటం నేర్పిన భగత్‌సింగ్, మహాత్మాగాంధీల చరిత్రలను ప్రపంచానికి అందించిన దేశం మనది... ఏ మతం వారికైనా ఉన్నతపీఠం ఇచ్చి మతం కన్నా మానవత్వం గొప్పదన్న విషయాన్ని చాటుతున్న దేశం మనది. ప్రపంచానికి ఆర్యభట్ట వంటి ఖగోళ శాస్త్రజ్ఞుడిని అందించిన దేశం మనది. అదంతా గతం అనుకొంటే... భవిష్యత్తూ ఉంది. అయితే కొంత జడత్వమూ మన దగ్గర ఉంది. దాన్ని జయిస్తే హమారా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. -
జనరల్ నాలెడ్జ్
జాతీయ గీతం (జనగణమన) → ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 24 → రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తుప్రతిపై ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రచించారు. → జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించగా అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. ఊ తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయగీతాన్ని ఆలపించారు. ఊ జాతీయగీతాన్ని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ అనే పేరుతో 1912లో ప్రచురించారు. → జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది. జాతీయ ముద్ర (చిహ్నం) → ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 26 ఊ జాతీయ ముద్రగా అశోకుని సారనాథ్‌లోని ధర్మస్థూపంపై ఒకే పీఠం మీదున్న నాలుగు సింహాల బొమ్మను తీసుకున్నారు. ఊ ఈ స్థూపంపై నాలుగు సింహాలు, (మూడు మాత్రమే కనిపిస్తాయి) వాటి కింద పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం నుంచున్నట్లు ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తారు. ఊ పీఠం పై భాగంలో మాండకో పనిషత్ నుంచి గ్రహించిన ‘సత్యమేవ జయతే’ అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్- (2) పరీక్షలో జనరల్ నాలెడ్జ్ నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు వస్తాయి? ఏయే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు? - యు.జయశ్రీ, రహ్మత్‌నగర్ ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలడుగుతారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వీటికి సమాధానాలు గుర్తించడానికి ఏ సబ్జెక్టులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. వర్తమాన వ్యవహారాల కోసం ప్రతిరోజూ ప్రామాణిక దినపత్రిక చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. సిలబస్‌లో నిర్దేశించిన భారతదేశ చరిత్ర, జాగ్రఫీ కోసం 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహనకు రావాలి. సిలబస్ ఆధారంగా స్పష్టమైన లే అవుట్ రూపొందించుకోవాలి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి తెలియని వాటిని వదిలేయడమే మంచిది. మార్కెట్లో జనరల్ నాలెడ్జ్ కోసం ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అన్నింటినీ కొని చదవకుండా ప్రామాణికమైన పుస్తకాలను ఎంచుకోవాలి. 8, 9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు తిరగేస్తే 50 శాతం మార్కులు ఖాయమైనట్లే. ప్రిపరేషన్ పూర్తై తర్వాత పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రశ్నల సరళి, ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. అందుకనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలి. ఈ ఏడాది సీడీఎస్ (1) ఎగ్జామ్‌లో అడిగిన కొన్ని ప్రశ్నలు: 1. నవంబర్ 8, 2013లో ఫిలిప్ఫీన్స్‌లో టైపూన్ సంభవించి చాలామంది ప్రజలు మరణించారు. అయితే ఆ టైపూన్ పేరేమిటి? ఎ) హయాన్ బి) ఉటార్ సి) ఫైలిన్ డి) నెసాత్ 2. ఏ గుప్త చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఎ) కుమార గుప్త -2 బి) కుమార గుప్త - 1 సి) చంద్ర గుప్త -2 డి) సముద్ర గుప్త ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
ఇల్లే బడి... అమ్మానాన్నలే గురువులు
‘ఆ అమ్మాయి టేబుల్ టెన్నిస్ బాగా అడుతుంది’ అంటే... దేశానికి పతకాలు సాధించిపెట్టే ఓ క్రీడాకారిణి ఉంది అని సంతోషిస్తారు. ‘ఆ అమ్మాయి వేగంగా టైప్ చేస్తుంది’ అంటే... మంచి సాధన అని ఊరుకుంటారు. ‘ఆ అమ్మాయి రెండు చేతులతో రాస్తుంది’ అంటే... మల్టీటాస్కింగ్ అని ప్రశంసిస్తారు. ‘ఆ అమ్మాయి చక్కగా పాడుతుంది, పియానో వాయిస్తుంది’ అంటే... సంగీత జ్ఞానమున్న కుటుంబం కావచ్చంటారు. ‘ఆ అమ్మాయి అరగంటలో హైదరాబాద్ బిర్యానీ వండి వడ్డిస్తుంది’ అంటే... ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అని ఇప్పుడే కితాబిస్తారు. ‘ఆ అమ్మాయి ఎనిమిదేళ్లకే పదవ తరగతి పరీక్ష పాసయింది’ అంటే మాత్రం... ‘అవునా’ అంటూ కళ్లు విప్పార్చి మరీ ఆశ్చర్యపోతారు. ఇక... ఇవన్నీ ఒకే అమ్మాయి సాధించిన రికార్డులని తెలిస్తే...? ఆ అమ్మాయి నైనా జైస్వాల్ అని మెరిసే కళ్లతో చూడడమే మిగులుతుంది. పద్నాలుగేళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సాధించడం, ఇంతటి సాధన ఎలా సాధ్యమైందంటే అంతా మా అమ్మానాన్నల శ్రమ ఫలితమే అంటోంది నైనా. నిజమే.. నైనా జైస్వాల్ తండ్రి అశ్విని కుమార్ న్యాయశాస్త్రం చదువుకున్నారు. అంతకంటే ముందు ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడు. ఇప్పటికీ ఇంటర్, డిగ్రీ, లా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులు కొంత శ్రద్ధ చూపిస్తే పిల్లల్లో ఉన్న ఐక్యూకు పదును పెట్టవచ్చు. అందుకు నిదర్శనం మేము, మా పిల్లలే. నా ఆలోచనకు మా ఆవిడ భాగ్యలక్ష్మి కూడా సహకరించడంతో పిల్లలను బాలమేధావులుగా తీర్చిదిద్దడం సాధ్యమైంది’’ అంటారాయన. అక్క బాటలోనే తమ్ముడు! నైనా తమ్ముడు అగస్త్య ఎనిమిదేళ్ల కుర్రాడు. రామాయణం, భగవద్గీతల్లోని శ్లోకాలు కంఠస్థం చేశాడు. భావంతో సహా ఆ శ్లోకాలనూ వల్లిస్తాడు. వంద ఎక్కాలు గుక్క తిప్పుకోకుండా చెబుతాడు. తండ్రి తయారు చేసిన మూడు వేల ప్రశ్నల జనరల్ నాలెడ్జ్ బుక్లెట్ నుంచి ఏ ప్రశ్నకైనా ఠక్కున జవాబులు చెప్పగలడు. తాజాగా పదవ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘‘తెలివితేటలు, మేధాసంపత్తి అనేవి పెంచుకుంటూ పోతే పెరుగుతాయి తప్ప, ఏ ప్రయత్నమూ చేయకుండా కాలం గడిపేస్తే పెరగవు. మా పిల్లల విషయంలో నేను చేసింది అదే’’ అంటారు అశ్విని కుమార్. ‘‘నాకు సంస్కృతం రాదు, బాబుతో రామాయణం, భగవద్గీత శ్లోకాలు పలికించడం, అర్థం చెప్పడం వంటివన్నీ వాళ్లమ్మ నిర్వహిస్తున్న శాఖ. మేమిద్దరం మా పిల్లల్ని ‘ఇల్లే బడి’ అనే పద్ధతిలో తీర్చిదిద్దాలనుకున్నాం. అదే చేశాం’’ అంటారు. లండన్ నుంచి ప్రత్యేక అనుమతి పిల్లల్లో ఎనిమిదేళ్లకే పదో తరగతి పరీక్ష రాయగల సామర్థ్యం ఉందని తల్లిదండ్రులు గ్రహించడం ఒక ఎత్తు. అయితే ఆ పిల్లల చేత పరీక్ష రాయించడానికి అనుమతి పొందడం మరో ఎత్తు. అది చిన్న విషయం కాదు. అందుకు విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ‘‘మా పాప నైనా చేత పరీక్ష రాయించడానికి అప్పటి విద్యాశాఖ మంత్రిని అనుమతి కోరాను. అప్పటికి ఆ మంత్రికి అలా పరీక్ష రాయవచ్చని కూడా తెలియదట. ఆశ్చర్యపోయారు కానీ అనుమతి మాత్రం ఇవ్వలేదు. జిల్లా విద్యా శాఖాధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. దాంతో ఐజిసిఎస్ఈ (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలో పరీక్ష రాయించడానికి లండన్‌కి ఉత్తరం రాశాను. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశానికి ఢిల్లీకి వచ్చిన కేంబ్రిడ్జి ప్రతినిధి అలీసా రిచర్డ్సన్ను కోరాను. అప్పుడామె చెన్నైలోని ‘సౌత్ ఏషియా’విభాగాధిపతిని కలవమని రిఫరెన్స్ ఇచ్చారు. అక్కడ పాప ఐక్యూ టెస్ట్ చేసిన తర్వాత అనుమతినిచ్చారు’’ అని చిన్న వయసులోనే నైనా జైస్వాల్ పదో తరగతి పరీక్ష రాయడానికి మార్గం సుగమం చేసుకున్న వైనాన్ని వివరించారు అశ్విని కుమార్. సర్దుబాటు సంతోషమే! స్కూలుకెళ్లి చదువుకోవడం అనే సాధారణ పద్ధతి నుంచి ఇంట్లోనే చదువుకునే విధానాన్ని చేపట్టడానికి దారి తీసిన పరిస్థితులను తల్లి భాగ్యలక్ష్మి. వివరించారు. ‘‘పెళ్లికి ముందు నుంచే ఆయన బోధనారంగంలో ఉన్నారు. కొంతమంది చురుకైన పిల్లలకు క్లాసు సిలబస్ కంటే ఎక్కువ విషయాలను చెప్పాలని తపన పడేవారు. అయితే, ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి పెద్దగా స్పందన వచ్చేది కాదు. అప్పుడే మేమిద్దరం ‘ఇతరుల పిల్లల విషయంలో మనం నిర్ణయం తీసుకోకూడదు, మన పిల్లలనైతే మనకు నచ్చినట్లు పెంచుకోవచ్చు’ అని అప్పుడే అనుకున్నాం’’ అంటారామె. ఈ తల్లిదండ్రుల కృషితో ఆ ఇంట్లో ఇద్దరు బాలమేధావులు తయారయ్యారు. పిల్లలను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం కోసం ఎంత వరకైనా శ్రమిస్తాననే తండ్రి, పిల్లల అవసరాల కోసం మా ఖర్చులు తగ్గించుకోవడం మాకేమీ బాధ అనిపించడంలేదనే తల్లి ఈ పిల్లలకు సొంతం. అక్క కంటే నేనే ముందు! నైనాకు రెండు చేతులతో రాయడం నేర్పించడానికి కారణం - మెదడును చురుగ్గా ఉంచడానికేనంటారు తల్లిదండ్రులు. మెదడులోని రెండు పార్శ్వాలూ చురుగ్గా ఉండాలంటే రెండు చేతులతో రాస్తే చాలంటారు. నైనా జాతీయ స్థాయి విజేత అయిన సంఘటన తమకు అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారా దంపతులు. అందరూ భావిస్తున్నట్లు ఇన్ని రంగాల్లో రాణించడం వల్ల తమ పిల్లలు ఒత్తిడికి లోను కావడం లేదని, ఇప్పుడు ఏ ఒక్కటి ఆపేయమన్నా ఏడుస్తారనీ వారు చెప్పారు. ఇంతలో అగస్త్య కలగ జేసుకుంటూ ‘‘అక్క అన్నింట్లో ఫస్ట్, కానీ నేను అక్క కంటే ఫస్టే పేపర్లో, టీవీలో వచ్చేశా’’ అంటూ ‘అవును కదమ్మా’ అంటూ తల్లి వైపు చూశాడు. నైనా తాజాగా పద్నాలుగేళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇటీవలే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష రాసింది. త్వరలోనే పి.జి చేయనుంది. ఇక, సివిల్స్ పరీక్ష రాయడానికి 21 ఏళ్ల వయఃపరిమితి కాబట్టి, ఆ అర్హత వచ్చే లోపు పిహెచ్డి కూడా చేస్తానంటోంది. ‘‘ఒక మంచి పని చేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా చేతిలో అధికారం ఉండాలి. అందుకే మా అమ్మాయిని ఐఎఎస్ అధికారిని చేయాలనుకున్నా’’నంటారామె తండ్రి. ఎంఎస్సి మైక్రో బయాలజీ చదివి పిల్లల కోసం పై చదువులకు, ఉద్యోగానికి దూరంగా ఉన్న భాగ్యలక్ష్మి ‘‘మా అమ్మాయితోపాటు నేను కూడా పిహెచ్డి చేస్తా’’ అన్నారు. ఇంతలో ‘‘టీటీ టోర్నమెంట్‌కు అక్కకు తోడుగా నాన్న వెళ్తున్నాడు, నేను కూడా టీటీ ఆడి నాతోపాటు అమ్మను చైనాకు తీసుకెళ్తా’’ అంటూ తల్లిని చుట్టుకున్నాడు అగస్త్య. రత్నాల్లాంటి పిల్లలను ఇవ్వడం వరకే దేవుడి వంతు. ఆ రత్నాలకు మెరుగులు దిద్దడం తల్లిదండ్రుల బాధ్యత అనడానికి అశ్వినికుమార్, భాగ్యలక్ష్మి దంపతులే నిదర్శనం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అమ్మానాన్నకు అన్నీ నేనే అవుతా! ఇలాంటి అమ్మానాన్నలు ఉండడం మా అదృష్టం. వాళ్ల సమయం, జీవితం మా కోసమే అన్నట్లు ఉంటారు. నేను సివిల్స్ రాసి మంచి ఉద్యోగం సాధించిన తర్వాత మా అమ్మానాన్నలకు పూర్తి విశ్రాంతినిచ్చి వాళ్లకు అన్నీ నేనే చూసుకుంటాను. - నైనా జైస్వాల్, 14 ఏళ్లకే డిగ్రీ పాసైన బాల మేధావి పుట్టింది: 2000 మార్చి 22వ తేదీన, హైదరాబాద్‌లో పదవ తరగతి పరీక్ష పాసయింది: 2008లో 12వ తరగతి పాసయింది : 2010లో డిగ్రీ పాసయింది: ఇటీవలే ఉస్మానియా యూనివర్శిటీ నుంచి (బి.ఎ, మాస్ కమ్యూనికేషన్స్) జాతీయ స్థాయి పతకాలు: టేబుల్ టెన్నిస్‌లో 2010- 2011లలో అండర్ 12 కేటగిరీలో స్వర్ణ, అండర్ 14 కేటగిరీలో కాంస్య పతకాలు, అండర్ 12, అండర్ 14 టీమ్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు, {పస్తుత స్థాయి: జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, అంతర్జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకు. -
ఎడ్.సెట్(సోషల్) మోడల్ పేపర్
Ed.CET(Social) Model Paper ________________________________ Part-A General English (Marks: 25) Read the passage and answer the questions 1 to 4. Some prophets of doom assert that we shall soon exhaust the Earth's resources or pollute ourselves to death. Optimists assert that Earth's systems are robust and that improved technologies will ease all the pressures on the planet. Others see the main concerns as political, with environmental issues carrying the seeds of inequity and war. Scientific understanding is too limited to say where the truth lies. If the care of the planet is management task our species is in the position of a child who has to fly a jet plane without knowing what all the switches and levers do. 1. The blame for the environmental crisis facing the Earth lies with 1) man's greed and selfishness 2) inadequate management of Earth' resources 3) adequate management of Earth' resources 4) wars pollute the Earth 2. Which one of the following statements is true according to the passage? 1) Sometimes political motives influence people's concern for the planet 2) Wars will cause greater pollutions on Earth 3) People will feel exhausted owing to the green house effect 4) Men should feel responsible towards society 3. What does the comparison in the last sentence of the passage convey? 1) We, on Earth are inexperi-enced in managing Earth's resources 2) Most of the people do not know how to fly an aeroplane 3) We are experienced in mana-ging Earth's resources 4) We are as ignorant as infants 4. According to the passage no-body knows the truth because 1) people do not know of what the future holds for them 2) scientists often are used by politicians 3) there are very few scientists capable of research in this area 4) objective analyses are not thorough or exhaustive The questions 5 to 7 consist of six sentences. The first and the sixth sentence are given. The middle four sentences in each have been jumbled up. These are labeled P, Q, R and S. You are required to find out the proper order to make it meaningful and mark on the Answer Sheet. 5. S1: The art of growing old is on which the passage of time has forced upon my attention. S6: This is not always easy; one's own past is a gradually increasing weight. P: One of these is undue absorption in the past. Q: One's thoughts must be dire-cted to the future, and to things about which there is something to be done. R: Psychologically there are two dangers to be guarded against in old age. S: It does not do to live in memories, in regrets for the good old days, or in sadness about friends who are dead. The proper sequence should be: 1) Q S R P 2) R P Q S 3) R P S Q 4) Q P R S 6. S1: We were about to return to our car when a man appeared S6: All the way home, we were so upset that hardly anyone spoke a word. P: Though father apologized that man did not seem satisfied and asked for his name and address. Q: Poor father who looked very confused explained that he had not seen the notice. R: He looked very annoyed and angrily said that these grounds were private property. S: He pointed out to a notice which said that camping was strictly prohibited. The Proper sentence should be: 1) S R P Q 2) S R Q P 3) R S P Q 4) R S Q P 7. S1: If you lie on the ground and wriggle about, do you move forward? S6: The snakes can move them forward as they wish. P: It's because of their scales. Q: So how is it that snakes move forward and sideways, and in any direction they chose by doing the samething? R: No of course you don't, you just stay where you are wriggling. S: On the underside of a snake, the scales are larger than those on the back. The proper sequence should be 1) Q S R P 2) R Q S P 3) R Q P S 4) Q S P R 8. Choose the appropriate verb from the following: Well, I ____ them for more than a month now. 1) have followed 2) had followed 3) have been following 4) has followed 9. Everybody will be at the office at about 8:30 a.m. tomorrow as the meeting ____ at 9:00 a.m. 1) started 2) starts 3) would starting 4) starting 10. The match was uninteresting so I ____ asleep in the middle and didn't watch till the end. 1) fall 2) fell 3) felled 4) falling 11. I met ____ one-eyed man at the bank. 1) a 2) an 3) the 4) no article 12. It took us____ hour to reach the airport. 1) a 2) an 3) the 4) no article 13. A chip off the old block means ______ 1) someone who is not similar in character to one of their parents 2) someone who is dissimilar in character to their parents 3) someone who is similar in character to one of their parents 4) someone who is similarly in character 14. Choose the correct preposition to fill in the blanks: I saw something about it ____ television. 1) in 2) on 3) at 4) through 15. Harish comes to work ____ car but I prefer to come ____foot. 1) by, by 2) by, on 3) up to, by 4) along, up 16. I will be ready to leave ____about twenty minutes. 1) in 2) at 3) on 4) for 17. Choose the rightly spelt word. 1) Precise 2) Pressis 3) Prcise 4) Prsice 18. Pick out the most suitable word to complete the sentence. Sweets and candies are made in a ____ 1) confectionary 2) factory 3) plant 4) unit 19. The opposite of the word 'Obvious' is 1) Clear 2) Apparent 3) Lucid 4) Obscure 20. Choose the antonym of the word 'Annoy' 1) Irritate 2) Upset 3) Disappoint 4) Delight 21. Choose the correct option which completes the expression. A bird in hand is worth –––– 1) Two in the bush 2) Ten in a shop 3) Three in a market 4) Four on a tree 22. The correct form of the changed voice of the sentence The teacher will show slides to students. 1) Students will be shown slides by the teacher. 2) Teacher will be shown slides by the students. 3) Students will show the slides to the teacher. 4) Teacher shows the students slide. 23. He said, "Be nice to your bro-ther". 1) He said be nice to your brother. 2) He said to be nice to your brother. 3) He asked me to be nice to my brother. 4) He told you to be nice to your brother. 24. Identify the simple sentence in the given sentences: 1) Harish and Ravi play football every afternoon. 2) Harsha and John played football, so Julie went shopping. 3) When he handed his homework, he forgot to give the teacher the last page. 4) They played football but they stopped. 25. They finish work at five 'O' clock. The appropriate question tag for the statement is: 1) Did they? 2) Didn't they? 3) Do they? 4) Don't they? Part-B: General Knowledge (15 Marks) 26. ‘నార్మన్ బోర్లాగ్ అవార్డ’ను ఏ రంగంలో కృషి చేసినవారికి అందజేస్తారు? 1) పర్యావరణ పరిరక్షణ 2) వ్యవసాయం 3) పత్రికా రంగం 4) ప్రపంచశాంతి, సత్సంబంధాలు 27. 2016లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరమేది? 1) రియో డిజనిరో 2) లండన్ 3) స్టాక్‌హోమ్ 4) లాస్ ఏంజిల్స్ 28. డెరైక్ట్ టు హోమ్ (డి.టి.హెచ్.) సేవల్లో ఏ సమాచార ఉపగ్రహ పరికరాన్ని ఉపయోగి స్తారు? 1) సి-బ్యాండ్ ట్రాన్‌సమీటర్ 2) ఎస్-బ్యాండ్ ట్రాన్‌సమీటర్ 3) ఎం.ఎస్.ఎస్. ట్రాన్స పాండర్ 4) కె.యు. బ్యాండ్ ట్రాన్‌సపాండర్ 29. ప్లాస్మోడియం అనే వ్యాధి కారకం వల్ల వచ్చే వ్యాధి ఏ శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది? 1) మెదడు 2) కాలేయం 3) చర్మం 4) నాడీవ్యవస్థ 30. ‘ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్’ ఎక్కడ ఉంది? 1) న్యూఢిల్లీ 2) సిమ్లా 3) హైదరాబాద్ 4) బెంగళూరు 31. ‘సినిమా’ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు? 1) ఎడిసన్, ప్రిన్స 2) షెవర్డ, బారన్ 3) నికోలస్, ల్యూమెరీ 4) కార్బట్, గిన్‌సబర్‌గ 32. పార్లమెంట్‌లోని ‘హౌస్ ఆఫ్ పీపుల్’ (ప్రజల సభ)కు ‘లోక్‌సభ’ అని పేరు పెట్టిన వారెవరు? 1) మౌలాలంకర్ 2) నెహ్రూ 3) రాజేంద్రప్రసాద్ 4) పటేల్ 33. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 2010 2) 2011 3) 2008 4) 2009 34. 2014 మార్చిలో దేశంలోనే తొలి పోస్టాఫీస్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు? 1) న్యూఢిల్లీ 2) కోల్‌కతా 3) తిరువనంతపురం 4) చెన్నై 35. యూనిసెఫ్ గత మార్చిలో వెలువరించిన నివేదిక ప్రకారం ఇండియాలో స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య ఎంత? 1) 10 కోట్లు 2) 8 కోట్లు 3) 5 కోట్లు 4) 3 కోట్లు 36. ‘యుగోవ్’ అనే అంతర్జాతీయ సంస్థ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయమైన వ్యక్తి ఎవరు? 1) బరాక్ ఒబామా 2) నరేంద్రమోడీ 3) బిల్‌గేట్స్ 4) అబ్దుల్ కలామ్ 37. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురు షుల సింగిల్స్ విజేత? 1) రఫెల్ నాదల్ 2) వావ్రింకా 3) ఫెదరర్ 4) ముర్రే 38. ‘ఆంధ్రా కబీర్’ బిరుదు ఉన్నవారెవరు? 1) వేమన 2) చిలకమర్తి లక్ష్మీనరసింహం 3) దాశరథి 4) అన్నమయ్య 39. ‘మై ఎర్లీ లైఫ్’ గ్రంథకర్త ఎవరు? 1) ఇందిరాగాంధీ 2) సరోజినీనాయుడు 3) మహాత్మాగాంధీ 4) జ్యోతిరావ్ పూలే 40. {పపంచ ఆరోగ్యదినోత్సవాన్ని ఏ తేదీన జరుపు కుంటాం? 1) ఏప్రిల్ 7 2) మార్చి 24 3) మే 12 4) అక్టోబరు 16 Teaching Aptitude (Marks:10) 41. విద్యార్థుల అభ్యసన మెరుగుపడటానికి ఏ చర్య శ్రేష్టమైంది? 1) విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం 2) నల్లబల్లపై రాసిన ముఖ్యాంశాలన్నిం టినీ నోట్‌బుక్‌పై రాసుకోవడం 3) తరగతిలోని తోటి పిల్లలతో కలిసి పనిచేయడం 4) ఏ రోజు ఇచ్చిన ఇంటిపని (హోమ్ వర్క) ఆ రోజే చేయడం 42. తరగతి బోధన అంతిమ లక్ష్యం? 1) విద్యార్థుల అభ్యసనకు దోహద పడేలా ఉండాలి 2) నిర్దేశించిన కాలంలో సిలబస్ పూర్తి చేయాలి 3) పాఠ్య పుస్తకంలోని విషయాన్ని విద్యార్థులకు సంపూర్ణంగా అంద జేసేలా ఉండాలి 4) పాఠంలోని ముఖ్యాంశాలను పిల్లలకు నోట్స్ రూపంలో అందించాలి 43. విద్యార్థులు తరగతిలో క్రమశిక్షణారాహి త్యంగా ప్రవర్తించినప్పుడు ఉపాధ్యాయు డు చేయాల్సింది? 1) విద్యార్థులను గట్టిగా మందలించడం 2) ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థులపై ఫిర్యాదు చేయడం 3) విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించడం 4) ఏదీకాదు 44. ఉపాధ్యాయుని అభివృద్ధికి తోడ్పడనివి 1) స్టాఫ్ రూమ్ చర్చలు 2) పానెల్ చర్చలు 3) లైబ్రరీలు 4) సైన్స ఎగ్జిబిషన్లు 45. {పతిభావంతుడైన ఉపాధ్యాయుడు ఎవరు? 1) సకాలంలో పాఠ్యాంశాలను నిబద్ధతతో పూర్తి చేసేవారు 2) విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేవారు 3) విద్యార్థులందరూ మంచి మార్కులు తెచ్చుకునేట్టు చేసేవారు 4) రోజూ పాఠశాలకు వచ్చి కేటాయించిన క్లాసులకు బాధ్యతగా వెళ్లేవారు 46. బోధనలో ప్రామాణికత దేన్ని సూచిస్తుంది? 1) విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని 2) తరగతిలో విద్యార్థుల హాజరును 3) విద్యార్థులు అడిగే ప్రశ్నల నాణ్యతను 4) బోధన జరిగినంత సేపు విద్యార్థులు తరగతిలో నిశ్శబ్దాన్ని పాటించడాన్ని 47. ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు ఓ విద్యార్థి అందులోని తప్పును ఎత్తి చూపితే, అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చేయాలి? 1) బోధన మధ్యలో ఆటంకపర్చినందుకు ఆ విద్యార్థిని హెచ్చరించి, తాను చెప్పిందే సరైందని గట్టిగా చెప్పాలి 2) తన గౌరవానికి భంగం కలిగిందని తరగతి గది నుంచి వెళ్లిపోవాలి 3) ఆ విద్యార్థి సూచనను పట్టించు కోకుండా బోధనను కొనసాగించాలి 4) ఆ విద్యార్థిని మన్నించమని అడగాలి 48. తరగతి నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలి? 1) ఉపాధ్యాయుడు తనకు నచ్చిన విద్యా ర్థిని నియమించాలి 2) తరగతి విద్యార్థులందరితో ప్రజాస్వా మ్య పద్ధతిలో ఎన్నుకోవాలి 3) తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థిని నియ మించాలి 4) విద్యార్థి ఆకారం ఆధారంగా విద్యా ర్థుల సమ్మతితో ఎన్నుకోవాలి 49. బోధనా ప్రణాళికను తయారు చేసేట ప్పుడు గమనించాల్సిన ముఖ్యాంశం- 1) విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం 2) బోధించాల్సిన పాఠ్య విషయం 3) బోధనకు కావాల్సిన కాల వ్యవధి 4) తరగతిలోని విద్యార్థుల సంఖ్య 50. ‘ఇకాలజీ’ అంటే? 1) ప్రకృతి అధ్యయన శాస్త్రం 2) పరిసరాల అధ్యయన శాస్త్రం 3) ఆవాస అధ్యయన శాస్త్రం 4) జీవన విధానాల అధ్యయన శాస్త్రం Part-C Geography (35 Marks) 51. ‘ఎర్రమచ్చ’ ఉన్న గ్రహం? 1) శని 2) శుక్రుడు 3) అంగారకుడు 4) గురుడు 52. సూర్యకుటుంబం విశ్వంలో ఒక భాగమని సిద్ధాంతీకరించినవారెవరు? 1) హెర్షల్ 2) హబుల్ 3) కోపర్నికస్ 4) టాలమీ 53. అంతర్జాతీయ దినరేఖ అని దేన్నంటారు? 1) గ్రీనిచ్ రేఖాంశం (0ని రేఖాంశం) 2) తూర్పు, పశ్చిమ 180ని రేఖాంశం 3) భూమధ్య రేఖ (0ని అక్షాంశం) 4) భూమధ్య రేఖ మధ్య నుంచి వెళ్లే ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలిపే రేఖ 54. ‘ఉత్పతనం’ అంటే? 1) {దవరూపంలోని నీరు వాయు రూపం లోకి మారకుండానే ఘనరూపంలోకి మారడం 2) ఘన రూపంలోని మంచు వాయు రూపంలోకి మారకుండానే ద్రవ రూపంలోకి మారడం 3) ఘన రూపంలోని మంచు ద్రవ రూపం లోకి మారకుండానే నేరుగా వాయు రూపంలోకి మారడం 4) {దవ రూపంలోని నీరు ఘన రూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారడం 55. భూపటలంలో అత్యధికంగా ఉండే లోహ మూలకం ఏది? 1) సిలికాన్ 2) అల్యూమినియం 3) ఇనుము 4) మెగ్నీషియం 56. సముద్ర మట్టం నుంచి అంటార్కిటికా ఖం డం సగటు ఎత్తు ఎంత? 1) 3,050 మీ. 2) 2,250 మీ. 3) 3,550 మీ. 4) 2,750 మీ. 57. కర్బన అవక్షేప శిల అయిన ‘సుద్ద’ (Chalk) కు మూలాధారం? 1) సూక్ష్మజీవులు 2) పక్షుల రెట్ట 3) కర్పరాలు, ప్రవాళాలు 4) వృక్ష సంబంధ పదార్థాలు 58. డార్లింగ్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? 1) దక్షిణ అమెరికా 2) ఉత్తర అమెరికా 3) ఆస్ట్రేలియా 4) ఆఫ్రికా 59. చైనా, రష్యా మధ్య ఉమ్మడి సరిహద్దుగా ప్రవహిస్తున్న నది? 1) హోయాంగ్హో 2) యాంగ్ ట్సికియాంగ్ 3) వోల్గా 4) ఆమూర్ 60. అయస్కాంత ఆవరణం ఏ ఆవరణంపై ఉంటుంది? 1) స్ట్రాటో 2) మిసో 3) ఎక్సో 4) ఐనో 61. కింది వాటిలో ‘ప్రశాంత మండలం’ ఏది? 1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల 2) ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖల 3) ధ్రువ అధిక పీడన మేఖల 4) ఉప ఆయన రేఖ అల్ప పీడన మేఖల 62. కిందివాటిలో శీతల పవనం కానిది? 1) మిస్ట్రల్ 2) సిరాకో 3) బోరా 4) బ్లిజార్డ 63. సమాన లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు? 1) ఐసోబార్‌స 2) ఐసోగోన్స 3) ఐసోనెఫ్స్ 4) ఐసోహెలయన్స 64. సింధుశాఖ (ఎఠజ) అంటే? 1) ఒక భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన ఇరుకైన సముద్ర భాగం 2) సముద్రంలో పైకి చొచ్చుకువచ్చిన సన్నని భూభాగం 3) రెండు భూ భాగాలను విభజించే చిన్న సముద్ర భాగం 4) రెండు సముద్రాలను విభజించే మందమైన భూ భాగం 65. ‘ఎల్‌నినో’ అంటే? 1) భూ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి సముద్రాలపై ప్రభావం చూపడం 2) సముద్రాలపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగి పీడనం తగ్గడం 3) సముద్రాల ఉష్ణోగ్రత కొన్ని కాలాల్లో పెరగడం 4) భూ ఉష్ణోగ్రత కొన్ని కాలాలపాటు పెరిగి ఆ తర్వాత తగ్గడం 66. కాఫీ, టీ, రబ్బరు తోటలు పెరగడానికి అనువైన మృత్తికలు? 1) నల్లరేగడి మృత్తికలు 2) లాటరైట్ మృత్తికలు 3) ఎర్ర మృత్తికలు 4) ఒండ్రు మృత్తికలు 67. కిందివాటిలో సరికాని జత ఏది? 1) అమెజాన్ - రెడ్ ఇండియన్స 2) కాంగో - పిగ్మీలు 3) మలేషియా - సమాంగ్లు 4) బోర్నియో - హిట్టెన్ టాట్లు 68. ‘మృతలోయ’ (Death Valley) ఏ ఎడారిలో ఉంది? 1) సహారా 2) సోనారన్ 3) అటకామా 4) అరేబియా 69. ‘లానోలు’ ఏ దేశంలో ఉన్నాయి? 1) వెనిజులా 2) అర్జెంటీనా 3) బ్రెజిల్ 4) మెక్సికో 70. ‘విట్ వాటర్సరాండ్’ బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఏ ప్రకృతి సిద్ధ మండ లంలో ఉంది? 1) సవాన్నా ప్రాంతం 2) స్టెప్పీ ప్రాంతం 3) భూమధ్య రేఖా మండలం 4) రుతుపవన మండలం 71. రుతుపవన మండలం ఉనికి? 1) 20ని - 40ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య 2) 10ని - 20ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య 3) 10ని - 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య 4) 20ని - 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య 72. ‘టండ్రా’ అంటే అర్థం? 1) మంచు ప్రాంతం 2) జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం 3) ప్రపంచ చివరి ప్రాంతం 4) చెట్లు లేని ప్రాంతం 73. అత్యంత తీవ్రమైన టొర్నడో (ఉరు ములతో కూడిన తుఫాన్)లు ఏ దేశంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి? 1) యూఎస్ఏ 2) కెనడా 3) బంగ్లాదేశ్ 4) ఫిలిప్పైన్‌స 74. ‘విరూపకారక ఫలకల సిద్ధాంతం’ దేనికి సంబంధించింది? 1) భూకంపాలు 2) వరదలు 3) భూమి పుట్టుక 4) అన్నీ 75. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం (చ.కి.మీ.ల్లో)? 1) 3,28,750 2) 2,28,60 3) 2,75,045 4) 2,50,705 76. నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాత అస్థిరత్వం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? 1) తెలంగాణా 2) కోస్తాంధ్ర 3) రాయలసీమ 4) పైవన్నీ 77. ఏ నదితో కలిసి శారదా నది ఒకేచోట సముద్రంలో కలుస్తుంది? 1) వరాహ 2) తాండవ 3) లాంగూల్యా 4) వంశధార 78. రాజుల గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి? 1) వరంగల్ 2) ఆదిలాబాద్ 3) ఖమ్మం 4) తూర్పు గోదావరి 79. ‘బాబర్’ అంటే? 1) విశాలమైన చిత్తడి ప్రాంతం 2) పూర్వకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం 3) నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం 4) గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర ప్రాంతం 80. కాలువల ద్వారా సాగయ్యే భూమి అధి కంగా ఉన్న రాష్ర్టం ఏది? 1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్ 3) తమిళనాడు 4) మహారాష్ర్ట 81. సాగుచేస్తున్న భూమిలో 90 శాతం సంకర జాతి వ్యవసాయం కింద ఉన్న పంట? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) నూనె గింజలు 82. కర్నూలు (ఆంధ్రప్రదేశ్), హసన్ (కర్ణా టక) ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి చెందినవి? 1) రాగి 2) వెండి 3) సున్నపురాయి 4) బెరైటీస్ 83. కొత్తగా ఏర్పడిన రైల్వేజోన్ ఏది? 1) తూర్పు కోస్తా రైల్వే మండలం 2) పశ్చిమ మధ్య రైల్వే మండలం 3) ఆగ్నేయ మధ్య రైల్వే మండలం 4) వాయవ్య రైల్వే మండలం 84. పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం? 1) మహారాష్ర్ట 2) తమిళనాడు 3) ఉత్తరప్రదేశ్ 4) గోవా 85. దేశంలో అక్షరాస్యత శాతం ఎంత? 1) 73 2) 69.8 3) 75 4) 71.5 History (30 Marks) 86. ఏ యుగంలో మానవుల మధ్య సామాజిక సంబంధాలు బలపడ్డాయి? 1) పాత రాతి 2) మధ్య శిలా 3) నూతన శిలా 4) లోహ యుగం 87. ‘జిగ్గురాత్’లు అంటే? 1) మెసపటోమియాలోని పట్టణ దేవాలయాలు 2) చైనాలోని బౌద్ధ ఆరాధన మందిరాలు 3) సుమేరియాలోని పరిపాలన కేంద్రాలు 4) ఈజిప్ట్‌లోని పిరమిడ్లు 88. చైనాలో భూస్వామ్య పద్ధతులను ప్రవేశ పెట్టినవారెవరు? 1) షియోవాంగ్ టీ 2) శ్యాంగ్ షూ 3) లావోట్జీ 4) ఫూ-షీ 89. ఏ ఇంగ్లండ్ రాజు కాలంలో బైబిల్‌ను ఆంగ్లంలోకి అనువదించారు? 1) మొదటి ఆర్లియన్స 2) మొదటి విలియమ్ 3) మొదటి లూయీ 4) మొదటి జేమ్స్ 90. తాను ప్రయాణించిన సముద్ర మార్గాల పటాలను తయారు చేయించిన రాజు? 1) పోప్ జాన్ ఐఐఐ 2) లూయి ఐగ 3) జేమ్స్ కామెరూన్ 4) హెన్రీ 91. ‘జరతృష్ణ’ అనే బోధనల రచయిత? 1) ప్లీనీ 2) హెర్మిషన్ 3) జోరాస్టర్ 4) సోఫోక్లెస్ 92. ‘మైదాస్ - ఫైదాస్’ అనే వారెవరు? 1) జ్యూయిష్ సమాజంలో ఆరాధనీయులు 2) రోమన్ల ఐక్యతకు కృషి చేసినవారు 3) ప్రసిద్ధి చెందిన గ్రీక్ కళాకారులు 4) మయా నాగరికత పూర్వీకులు 93. {Mూసేడుల వల్ల జరగని పరిణామం? 1) యూరోపియన్ల విజ్ఞానం పెరిగింది 2) తురుష్కులపై క్రైస్తవుల ఆధిపత్యం పెరిగింది 3) యూరప్‌లో ఫ్యూడల్ వ్యవస్థ బలహీన పడింది 4) మత సంస్కరణోద్యమానికి పునాది పడింది 94. {ఫెంచి విప్లవానికి నాంది పలికిన సంఘటన? 1) టెన్నిస్ కోర్ట సమావేశం 2) బాస్టిల్ కోట ముట్టడి 3) బోస్టన్ తేనీటి విందు 4) రక్తపాత రహిత విప్లవం 95. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1) 1769 2) 1774 3) 1786 4) 1793 96. ‘ఉదారత’ (ఔజీఛ్చట్చజీటఝ) సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినవారెవరు? 1) రూసో 2) ప్లేటో 3) ఆరిస్టాటిల్ 4) మాంటే స్క్యూ 97. వియన్నా సమావేశంలో పాల్గొన్న ఫ్రాన్స ప్రతినిధి? 1) మెటర్నిక్ 2) కాజిల్రిగ్ 3) టాలీలాండ్ 4) విల్లింగ్టన్ 98. ‘ఔట్లాండర్స’ నాయకుడు? 1) సైమన్ బోలీవర్ 2) లివింగ్స్టన్ 3) సెసిల్ రోడ్స 4) జఫర్సన్ 99. వర్సెయిల్స్ సంధి షరతుల ప్రకారం జర్మనీ ‘స్ల్కెష్విగ్’ను ఏ దేశానికి ధారా దత్తం చేసింది? 1) డెన్మార్క 2) ఫ్రాన్స 3) ఇంగ్లండ్ 4) బెల్జియం 100. హిట్లర్ ‘మెయిన్ కాంఫ్’ గ్రంథంలో దేని గురించి వివరించాడు? 1) తన పార్టీ అనుసరించాల్సిన రాజనీతి నియమాలు 2) నోర్డిక్ జాతి గొప్పతనం, అదృష్టం 3) తన యుద్ధ విజయాలు, గొప్పతనం 4) నాజీ పార్టీ కార్యకర్తల ఆదర్శభావాలు 101. నాటో ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1) 1947 2) 1948 3) 1949 4) 1950 102.‘విశాలమైన రంగస్థలం మీద త్వరలో ప్రదర్శించబోయే గొప్ప నాటకానికి డ్రస్ రిహార్సల్స్’గా దేని గురించి వ్యాఖ్యా నిస్తారు? 1) మొదటి ప్రపంచ యుద్ధం 2) రెండో ప్రపంచయుద్ధం 3) క్యూబా సంక్షోభం 4) స్పానిష్ అంతర్యుద్ధం సమాధానాలు 1) 1; 2) 1; 3) 1; 4) 4; 5) 3; 6) 4; 7) 3; 8) 3; 9) 2; 10) 2; 11) 1; 12) 2; 13) 3; 14) 2; 15) 2; 16) 1; 17) 1; 18) 1; 19) 4; 20) 4; 21) 1; 22) 1; 23) 3; 24) 1; 25) 4; 26) 2; 27) 1; 28) 4; 29) 2; 30) 3; 31) 3; 32) 1; 33) 4; 34) 4; 35) 2; 36) 3; 37) 2; 38) 1; 39) 3; 40) 1; 41) 3; 42) 1; 43) 4; 44) 1; 45) 2; 46) 3; 47) 4; 48) 2; 49) 1; 50) 3; 51) 4; 52) 1; 53) 2; 54) 3; 55) 2; 56) 2; 57) 1; 58) 3; 59) 4; 60) 3; 61) 1; 62) 2; 63) 4; 64) 1; 65) 3; 66) 2; 67) 4; 68) 2; 69) 1; 70) 2; 71) 3; 72) 4; 73) 3; 74) 1; 75) 3; 76) 2; 77) 1; 78) 3; 79) 4; 80) 2; 81) 2; 82) 1; 83) 3; 84) 4; 85) 1; 86) 2; 87) 3; 88) 1; 89) 4; 90) 4; 91) 2; 92) 3; 93) 2; 94) 1; 95) 1; 96) 4; 97) 3; 98) 3; 99) 1; 100) 2; 101) 3; 102) 4. -
నేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్ష
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్టు పరీక్షల రీజనల్ కో-ఆర్డినేటర్, కేయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సొల్లేటి కనకాచారి ఒక ప్రకనటలో తెలిపారు. 17 పరీక్షా కేంద్రాల్లో 9,146మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు భాగాలుగా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు (పార్ట్-2) జనరల్ నాలెడ్జ్, 11 నుంచి 12:30 గంటల వరకు (పార్ట్-3) మేథమేటిక్స్, మధ్నాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు (పార్ట్-1) జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పషం చేశారు. ఎస్బీఐటీ కేంద్రానికి ఉచిత బస్సు ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని ఎస్బీఐటీ కేంద్రంలో ఆదివారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా బస్ సౌకర్యం ఉంటుంది. ఈ విషయాన్ని ఎస్బీఐటీ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తమ కళాశాల బస్సు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.