జాతీయ గీతం (జనగణమన)
→ ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 24
→ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తుప్రతిపై ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రచించారు.
→ జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించగా అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. ఊ తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయగీతాన్ని ఆలపించారు. ఊ జాతీయగీతాన్ని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ అనే పేరుతో 1912లో ప్రచురించారు.
→ జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది.
జాతీయ ముద్ర (చిహ్నం)
→ ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 26 ఊ జాతీయ ముద్రగా అశోకుని సారనాథ్‌లోని ధర్మస్థూపంపై ఒకే పీఠం మీదున్న నాలుగు సింహాల బొమ్మను తీసుకున్నారు. ఊ ఈ స్థూపంపై నాలుగు సింహాలు, (మూడు మాత్రమే కనిపిస్తాయి) వాటి కింద పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం నుంచున్నట్లు ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తారు. ఊ పీఠం పై భాగంలో మాండకో పనిషత్ నుంచి గ్రహించిన ‘సత్యమేవ జయతే’ అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్
Published Sun, Jul 27 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement