ముద్దుగుమ్మ పెద్దకల! | Aliyabhat jokes on net | Sakshi
Sakshi News home page

ముద్దుగుమ్మ పెద్దకల!

Published Mon, Jun 22 2015 10:33 PM | Last Updated on Tue, Oct 2 2018 3:53 PM

ముద్దుగుమ్మ పెద్దకల! - Sakshi

ముద్దుగుమ్మ పెద్దకల!

ఆలియాభట్ జనరల్ నాలెడ్జ్ సామర్థ్యంపై నెట్‌లో ఎన్నో  జోక్‌లు రావచ్చుగాక, అంతమాత్రాన ఆమె నటన గురించి వంక పెట్టడానికి లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ‘హైవే’ ‘టు స్టేట్స్’ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘ఉత్తమ నటి’గా ఫిలింఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. నటన అంటేనే కాదు... సంగీతం అంటే కూడా ఆలియాకు ఇష్టం. ‘హైవే’ సినిమాలో పాట పాడి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంసలు కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ దృష్టి తాజాగా ‘డెరైక్షన్’పై పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది... అన్నట్లు మహేష్‌భట్ కూతురైన ఆలియా... తండ్రిలాగే డెరైక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటోందేమో.
 
డెరైక్టర్ కావాలనే తన  కోరికను ఆలియా ఇంతవరకు బహిరంగంగా చెప్పనప్పటికీ, ఒకవేళ ఆమె డెరైక్టర్ కావాలనుకుంటే ఆ కోరిక నెరవేరడం ఎంతసేపు!
 
ఆలియా అక్క పూజాభట్ కూడా డెరైక్టర్‌గా ప్రయత్నించిందిగానీ పెద్దగా పేరేమీ తెచ్చుకోలేదు. ఆమెకు మాజీ హీరోయిన్‌గా మాత్రమే పేరుంది. ‘‘హీరోయిన్‌గా మంచి స్టేజ్‌లో ఉన్న సమయంలో  డెరైక్షన్ వైపు వెళ్లి రిస్క్ చేయవద్దు’’ అని సన్నిహితులు ఆలియాకు సలహా ఇస్తున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement