ఏ నటుడికైనా అవార్డులు తీసుకోవడం అంటే అదో పెద్ద అచీవ్‌మెంట్. కానీ ప్రముఖ హీరో నాని మాత్రం తనకు ఇలా అవార్డులు తీసుకోవడంపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని అన్నాడు. తాజాగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఇతడు ఈ కామెంట్స్ చేశాడు. 'దసరా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడు అవార్డ్ తీసుకున్న టైంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)
'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టేజీపై అవార్డులు తీసుకుంటున్న యాక్టర్స్‌ని చూసినప్పుడు ఏదో ఓ రోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. రోజురోజుకీ అది తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే.. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్, నటీనటులతో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన కొత్త యాక్టర్స్ అవార్డులు తీసుకుంటే అందరితో కలిసి చూడాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను అవార్డు తీసుకోవడానికి రాలేదు. శౌర్యువ్ (హాయ్ నాన్న దర్శకుడు), శ్రీకాంత్ ఓదెల్ (దసరా దర్శకుడు) అవార్డులు తీసుకుంటే చూడాలని'
'ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వాళ్లిద్దరూ అవార్డులు దక్కించుకోవడం, వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ప్రతిభావంతమైన కొత్త ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ప్రయాణంలో నేను భాగమైతే అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ తొలి అడుగులో నేనో ఇటుకగా మారితే అది నాకు పెద్ద అవార్డ్. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకం. థ్యాంక్యూ సో మచ్' అని నాని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)
Comments
Please login to add a commentAdd a comment