
ప్రముఖ సింగర్ కమ్ మ్యూజీషియన్ రాహుల్ వైద్య ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. బిగ్‌బాస్-14 హిందీ షోలో రన్నరప్‌గా నిలిచిన మనవాళ్లకు కూడా కొంత పరిచమయ్యాడు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ అయ్యే హిందీ సినిమాల్లో పలు పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువైన కారు కొనుగోలు చేయడం విశేషం.
(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి)
'ఇండియన్ ఐడల్' సింగింగ్ షోతో కెరీర్ మొదలుపెట్టిన రాహుల్ వైద్య.. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గానూ ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం 'లాఫర్ చెఫ్-అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే షో చేస్తున్నాడు. ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశాడు.
ఇకపోతే బిగ్ బాస్ షోలో పాల్గొన్న టైంలో సీరియల్ నటి దిశా పర్మర్‌తో ప్రేమలో పడ్డాడు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉన్న ఇతడు ఇప్పుడు ఖరీదైన కారు కొని వార్తల్లో నిలిచాడు.
(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment