Filmfare Awards South: ఆ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు | 69th Sobha Filmfare Awards South 2024, Check Out Tamil Cinema Winners Full List Inside | Sakshi
Sakshi News home page

Filmfare Awards South: ఒక్క సినిమాకు ఆరు అవార్డులు.. కోలీవుడ్‌లో ఎవరికి వచ్చాయంటే?

Published Sun, Aug 4 2024 8:22 AM | Last Updated on Sun, Aug 4 2024 12:59 PM

69th Sobha Filmfare Awards South 2024: Check Out Tamil Cinema Winners

69వ ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ప్రతిభావంతులైన నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్స్‌ను పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తమిళంలో చిత్త (తెలుగులో చిన్నా) మూవీ ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. మరి ఏయే కేటగిరీలో చిత్త పురస్కారాలు అందుకుంది? ఇంకా ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారో చూసేద్దాం..

ఫిలింఫేర్‌ సౌత్‌ 2024 (తమిళ) అవార్డుల విజేతలు
* ఉత్తమ చిత్రం - చిత్త
ఉత్తమ దర్శకుడు- ఎస్‌.యు. అరుణ్‌ కుమార్‌ (చిత్త)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) - విడుదలై: పార్ట్‌ 1
ఉత్తమ నటుడు - విక్రమ్‌ (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) - సిద్దార్థ్‌ (చిత్త)
ఉత్తమ నటి - నిమిషా సజయన్‌ (చిత్త)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌) - ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
ఉత్తమ సహాయ నటుడు - ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
ఉత్తమ సహాయ నటి - అంజలి నాయర్‌ (చిత్త)
ఉత్తమ సంగీతం - దిబు నినన్‌ థామస్‌ & సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)

ఉత్తమ లిరిక్స్‌ - ఇలంగో కృష్ణన్‌ (అగ నగ- పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
ఉత్తమ గాయకుడు - హరిచరణ్‌ (చిన్నన్‌జిరు నిలవే.. : పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2
ఉత్తమ గాయని - కార్తీక వైద్యనాథన్‌ (కంగల్‌ ఎదో.. : చిత్త)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : తోట ధరణి (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)

చదవండి: ఫిలిం ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement