Chinna Movie
-
Filmfare Awards South: ఆ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు
69వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ప్రతిభావంతులైన నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్స్‌ను పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తమిళంలో చిత్త (తెలుగులో చిన్నా) మూవీ ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. మరి ఏయే కేటగిరీలో చిత్త పురస్కారాలు అందుకుంది? ఇంకా ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారో చూసేద్దాం..ఫిలింఫేర్ సౌత్ 2024 (తమిళ) అవార్డుల విజేతలు* ఉత్తమ చిత్రం - చిత్త* ఉత్తమ దర్శకుడు- ఎస్.యు. అరుణ్ కుమార్ (చిత్త)* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - విడుదలై: పార్ట్ 1* ఉత్తమ నటుడు - విక్రమ్ (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సిద్దార్థ్ (చిత్త)* ఉత్తమ నటి - నిమిషా సజయన్ (చిత్త)* ఉత్తమ నటి (క్రిటిక్స్) - ఐశ్వర్య రాజేశ్ (ఫర్హానా), అపర్ణ దాస్ (దాదా)* ఉత్తమ సహాయ నటుడు - ఫహద్ ఫాజిల్ (మామన్నన్)* ఉత్తమ సహాయ నటి - అంజలి నాయర్ (చిత్త)* ఉత్తమ సంగీతం - దిబు నినన్ థామస్ & సంతోష్ నారాయణన్ (చిత్త)* ఉత్తమ లిరిక్స్ - ఇలంగో కృష్ణన్ (అగ నగ- పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ గాయకుడు - హరిచరణ్ (చిన్నన్‌జిరు నిలవే.. : పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2* ఉత్తమ గాయని - కార్తీక వైద్యనాథన్ (కంగల్ ఎదో.. : చిత్త)* ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : తోట ధరణి (పొన్నియన్ సెల్వన్: పార్ట్ 2)చదవండి: ఫిలిం ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే? -
'చిన్నా'పై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. Siddharth’s strong attack on #Animal 👌 pic.twitter.com/lgO0XD2TuG — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'యానిమల్' తప్పితే చెప్పుకోదగ్గ మూవీ ఏం లేదు. దీంతో మూవీ లవర్స్ కన్ను ఓటీటీలపై పడింది. వీళ్లని ఎంటర్టైన్ చేసేందుకు 25 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ విషయానికొస్తే.. నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనితో పాటు 'చిన్నా', 'మార్టిన్ లూథర్ కింగ్', 800, జర హట్కే జర బచ్కే, మిషన్ రాణిగంజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేట్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 27- డిసెంబరు 3 వరకు) అమెజాన్ ప్రైమ్ షెహర్ లఖోట్ (హిందీ సిరీస్) - నవంబరు 30 క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 దూత (తెలుగు సిరీస్) - డిసెంబరు 01 నెట్‌ఫ్లిక్స్ లవ్ లైక్ ఏ K-డ్రామా (జపనీస్ సిరీస్) - నవంబరు 28 ఒన్మ్యోజీ (జపనీస్ సిరీస్) - నవంబరు 28 అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 29 బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 29 ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 30 హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబరు 30 ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 ద బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 30 వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 01 మే డిసెంబరు (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) - డిసెంబరు 01 స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 01 ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 28 ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 01 ద షెపార్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 సోనీ లివ్ మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) - నవంబరు 29 జియో సినిమా 800 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబరు 02 బుక్ మై షో బ్యాక్ ఆన్ ద స్ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28 (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) -
ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!
ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎమోషనల్ 'చిన్నా' సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి. సంపూ డిఫరెంట్ సినిమా లాక్డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చే సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కాబట్టి వాటి గురించి కాసేపు అలా పక్కనబెట్టేద్దాం. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఆసక్తి రేపుతున్నవన్నీ కూడా డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) ఈ శుక్రవారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. చిన్నా, కన్నూరు స్క్వాడ్, ఘోస్ట్ లాంటి డబ్బింగ్ బొమ్మలతో పాటు జెట్టీ, జోతి సినిమాలతో పాటు 'ఫ్లవర్ ఆఫ్ ఈవిల్' అనే ఓ కొరియన్ సిరీస్.. తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఆయా ఓటీటీల్లో ఏయే సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (నవంబరు 17th) అమెజాన్ ప్రైమ్ బాయ్స్ 4 - మరాఠీ సినిమా మాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రం ట్విన్ లవ్ - ఇంగ్లీష్ సిరీస్ బుదాక్ ఫ్లాట్ - మలేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) బిహ్తెర్ - టర్కిష్ ఫిల్మ్ (స్ట్రీమింగ్) కంగ్రాట్స్ మై ఎక్స్ - థాయ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద వానిషింగ్ ట్రయాంగిల్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కన్నూర్ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం చిన్నా - తెలుగు డబ్బింగ్ మూవీ డ్యాషింగ్ త్రూ ద స్నో - ఇంగ్లీష్ సినిమా షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ - ఇంగ్లీష్ చిత్రం జీ5 ఘోస్ట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం బ్యాడ్ బాయ్ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) నెట్‌ఫ్లిక్స్ ఆల్ టైమ్ హై - ఫ్రెంచ్ సినిమా బిలీవర్ 2 -కొరియన్ మూవీ కోకోమెలన్ లేన్ - ఇంగ్లీష్ సిరీస్ రస్టిన్ - ఇంగ్లీష్ సినిమా స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్ సీ యూ ఆన్ వీనస్ - ఇంగ్లీష్ మూవీ సుఖీ - హిందీ సినిమా ద డాడ్స్ - ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ద క్వీన్స్ టౌన్ కింగ్స్ - ఇంగ్లీష్ మూవీ ద రైల్వే మెన్ - హిందీ సిరీస్ వి ఫర్ వెంజెన్స్ - ఇంగ్లీష్ ఫిల్మ్ ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ - జపనీస్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) బెస్ట్ క్రిస్మస్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ఆహా జెట్టీ - తెలుగు సినిమా జోతి - తమిళ మూవీ ఈ-విన్ ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో డౌన్ లో - ఇంగ్లీష్ మూవీ టి.ఐ.ఎమ్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించే కంటెంట్ ఉంటుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ కావడం వల్ల.. థియేటర్లలోకి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. తీరా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా జనాలకు నచ్చేయొచ్చు. అలా హీరో సిద్ధార్థ్‌కి హిట్ వచ్చేలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఏంటా సినిమా? తెలుగోడు కానప్పటికీ హీరోగా టాలీవుడ్లో సిద్ధార్థ్ మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ రానురాను సరైన మూవీస్ చేయకపోవడంతో ఇతడిని తెలుగు ప్రేక్షకులు కూడా పక్కనబెట్టేశారు. అలా గత కొన్నాళ్ల నుంచి తమిళంలోనే నటిస్తూ, వాటిని తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 'చిన్నా' అనే మూవీని నిర్మించి, లీడ్ రోల్ చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అనే సెన్సిటివ్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 'చిన్నా' కథేంటి? అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఈశ్వర్ (సిద్ధార్థ్).. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు ఉంటున్న ఊరిలో చిన్నపిల్లల్ని అహహరించి అత్యాచారం చేయడం, దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. మరోవైపు ఈశ్వర్ అన్న కూతురు కిడ్నాప్ అవుతుంది. మరి అన్న కూతుర్ని ఈశ్వర్ వెతికి పట్టుకున్నాడా? చివరకు ఏమైందనేదే 'చిన్నా' స్టోరీ. ఓటీటీ రిలీజ్ డేట్ అక్టోబరు 6న తెలుగులో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిలబడలేకపోయింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నవంబరు 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!
సిద్దార్థ్.. తమిళ హీరోనే అయినా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలతో బాక్సాఫీస్ హిట్లు కొట్టి ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ప్రేక్షకులకు కొంత దూరమయ్యాడనే చెప్పాలి. సరైన హిట్ కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఎమోషనల్ కథను సెలక్ట్ చేసుకుని నటించడమే కాక నిర్మాతగానూ మారాడు. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్తా'. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజైంది. తమిళనాడులో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరుతో అక్టోబర్ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో చిన్నా చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిమిష సజయాన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?
ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి. పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి? (ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
గేటు బయట నిలబెట్టి మాట్లాడారు.. సిద్ధార్థ్ ఎమోషనల్
హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినా.. తెలుగు హీరోలతో సమానంగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాలు సిద్ధార్థ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సిద్ధార్థ్‌కి సరైన హిట్ పడలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ టాలెంటెడ్ హీరోని పక్కన పెట్టేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల టక్కర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా రిలీజైన విషయమే చాలా మందికి తెలియదు. ‘చిన్నా’తో కమ్‌బ్యాక్ చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతవుతున్న సిద్ధార్థ్‌కి తాజాగా ఓ సూపర్ హిట్ పడింది. ఆయన నటిస్తూ నిర్మించిన ‘చిట్టా’ చిత్రం తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇదే చిత్రాన్ని ‘చిన్నా’పేరుతో తెలుగులో అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అంజలీ నాయర్, నిమిష సజయన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28నే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ రోజు ఇక్కడ చాలా సినిమాలు విడుదల కావడంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. దీంతో అక్టోబర్ 6న వాయిదా వేశారు. రిలీజ్‌కు ఎవరూ ముందుకు రాలేదు ‘చిన్నా’చిత్రాన్ని తమిళ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సెప్టెంబర్ 28 నాడే రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. దానికి గల కారణం ఏంటో తాజాగా జరిగిన తెలుగు ప్రెస్‌మీట్ సిద్ధార్థ్ వెల్లడించాడు. ‘నా సినిమా బాగుందని ఉదయనిధి స్టాలిన్ తమిళ్లో కొన్నాడు. కేరళ కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గోకులమ్ గోపాలన్ మా సినిమాను తీసుకున్నాడు. కన్నడలో కేజీయఫ్ నిర్మించివారు విడుదల చేశారు. కానీ తెలుగులో మాత్రం చిన్నా రిలీజ్‌కు ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది అయితే ‘సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారని’అడిగారట. (చదవండి: హీరో సిద్ధార్థ్ భావోద్వేగం.. ఇక్కడికి ఇకపై రానంటూ!) మా సినిమా చూసి విడుదల చేయండి అని కొంతమంది దగ్గరకు వెళ్తే.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడారు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఇలాంటి అవమానం జరగలేదు. నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఉంది. 2013 నుంచి 2022 వరకు నా దగ్గరకు కేవలం మూడు కథలు మాత్రమే టాలీవుడ్ నుంచి వచ్చాయి. అందులో ‘మహా సముద్రం’ ఒకటి. నేనొక నటుడిని మాత్రమే. నాకు ఒక ప్రాంతం అంటూ ఉండదు. మంచి కథలు వస్తే ఎక్కడైనా నటిస్తాను. ఇప్పుడు ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!
హీరో సిదార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలారోజుల తర్వాత తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇతడు.. స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తనని, తన సినిమా అవమానించారని చెబుతూ బరస్ట్ అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? సిద్ధార్థ్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? స్వతహాగా తమిళ నటుడు అయినప్పటికీ పలు సూపర్‌హిట్ తెలుగు సినిమాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటిది గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. చాన్నాళ్ల తర్వాత 'మహాసముద్రం' అనే సినిమాలో నటిస్తే అది ఘోరంగా ఫ్లాప్ అయింది. అలా సక్సెస్ లేక అల్లాడుతున్న సిద్ధార్థ్.. తానే నటిస్తూ, నిర్మిస్తూ 'చిట్టా' అనే సినిమా తీశాడు. గత వారం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో 'చిన్నా' పేరుతో రిలీజ్ చేద్దామని చూస్తే.. సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ బాధపడ్డాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!) సిద్ధార్థ్ కామెంట్స్ 'ఇంతకన్నా గొప్ప సినిమా నేను చూడలేదు' అని ఉదయనిధి స్టాలిన్, తమిళంలో నా సినిమాను కొన్నారు. కేరళలోనూ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ నా సినిమా తీసుకున్నారు. కన్నడలో 'కేజీఎఫ్' నిర్మించిన వాళ్లు రిలీజ్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి.. 'సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారు?' అని అన్నారట. నేనో మంచి మూవీ తీస్తే ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. ఆ టైంలో నా దగ్గరకొచ్చి.. మేం మీతో ఉన్నామని ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. వాళ్లకు చాలా థ్యాంక్స్. నా సినిమాలో అది ఉంది, ఇది ఉందని చెప్పి అడుక్కు తినే బ్యాచ్ కాదు. మీకు సినిమాలపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్‌కి వెళ్లి 'చిన్నా' చూడండి. ఇది చూసిన తర్వాత 'తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం' అనిపిస్తే.. ఇక తెలుగులో ప్రెస్మీట్స్ పెట్టను. ఇక్కడికి రాను అని చెబుతూ సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) On of my friend Said #Chithha movie is very good and he praised #Siddharth in this movie. Hope Telugu Audience will encourage this good movie 👍#Chinna releasing on October 6thpic.twitter.com/HIq8I35sFp — ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) October 3, 2023