కొన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించే కంటెంట్ ఉంటుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ కావడం వల్ల.. థియేటర్లలోకి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. తీరా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా జనాలకు నచ్చేయొచ్చు. అలా హీరో సిద్ధార్థ్‌కి హిట్ వచ్చేలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది.
ఏంటా సినిమా?
తెలుగోడు కానప్పటికీ హీరోగా టాలీవుడ్లో సిద్ధార్థ్ మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ రానురాను సరైన మూవీస్ చేయకపోవడంతో ఇతడిని తెలుగు ప్రేక్షకులు కూడా పక్కనబెట్టేశారు. అలా గత కొన్నాళ్ల నుంచి తమిళంలోనే నటిస్తూ, వాటిని తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 'చిన్నా' అనే మూవీని నిర్మించి, లీడ్ రోల్ చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అనే సెన్సిటివ్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!)
'చిన్నా' కథేంటి?
అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఈశ్వర్ (సిద్ధార్థ్).. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు ఉంటున్న ఊరిలో చిన్నపిల్లల్ని అహహరించి అత్యాచారం చేయడం, దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. మరోవైపు ఈశ్వర్ అన్న కూతురు కిడ్నాప్ అవుతుంది. మరి అన్న కూతుర్ని ఈశ్వర్ వెతికి పట్టుకున్నాడా? చివరకు ఏమైందనేదే 'చిన్నా' స్టోరీ.
ఓటీటీ రిలీజ్ డేట్
అక్టోబరు 6న తెలుగులో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిలబడలేకపోయింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నవంబరు 17 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)
Comments
Please login to add a commentAdd a comment