ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి?
(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!)
ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి.
పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి?
(ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి)
Comments
Please login to add a commentAdd a comment