Best Actress
-
టాప్ వన్‌లో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే..?
వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. (ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్‌ను గెలికిన కంగనా) అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు. తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్‌తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9), మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్‌కు జూన్ నెలలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్ పొజీషన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత రోండో స్థానంలో అలియా భట్ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్ టెన్‌లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm — Ormax Media (@OrmaxMedia) July 21, 2023 -
ఉత్తమ హీరోయిన్గా శ్రీదేవి
జాతీయ అవార్డులలో ఉత్తమ హీరోయిన్గా లెజెండరీ తార శ్రీదేవికి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. చనిపోయిన వ్యక్తికి ఈ కేటగిరీలో అవార్డు ప్రకటించటం ఇదే తొలిసారి. అవార్డు పట్ల శ్రీదేవి భర్త బోనీకపూర్, పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ యాక్టర్ ఎప్పటికీ నిలిచి ఉంటారని ఈ అవార్డు నిరూపించింది. ఆమె పరిపూర్ణత కోసం పరితపించే నటి. ఇది మాకు చాలా ప్రత్యేకమైన క్షణం’ అని వారు చెబుతున్నారు. ఇక సినీ చరిత్రలో ధృవతారకు చిట్టచివరకు ఉత్తమ నటి(మొదటిసారి) అవార్డు దక్కిందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. శ్రీదేవి అవార్డుపై వివాదాలు వెల్లువెత్తటం ఇష్టం లేదని జ్యూరీ మెంబర్, దర్శకుడు శేఖర్‌కపూర్ చెబుతున్నారు.‘శ్రీదేవి అవార్డుపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు లేకపోలేదు. కానీ, ఆమెకు ఊరికనే ఇవ్వలేదు. సినీ లోకానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు. ఆమె చివరి చిత్రం మామ్‌లో ఆమె నటనకు ఇచ్చిన గౌరవం’ అని ఆయన తెలిపారు. రవి ఉద్యావర్ డైరెక్షన్లో తెరకెక్కిన మామ్ శ్రీదేవి ఆఖరి చిత్రం(షారూఖ్ జీరోలో నటించినప్పటికీ అందులో చిన్న పాత్రే). తన కూతురు అత్యాచారానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే లెక్చరర్ దేవకీ పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. పాక్ నటి సజల్ అలీ కూతురి పాత్ర పోషించింది. టాలీవుడ్ రచయిత కొన వెంకట్ మామ్‌కు కథా సాయం అందించారు. -
ఆస్కార్ వేడుకల్లో ఊహించని ఘటన..!
-
ఆస్కార్‌ను కొట్టేసి మరీ దర్జాగా...
లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అవార్డుల వేడుకలకు హాజరైన ఓ ప్రేక్షకుడు ఏకంగా అవార్డు షీల్డ్‌ను ఎత్తికెళ్లాడు. అంతటితో ఆగకుండా దర్జాగా మీడియాకు ఫోజులిస్తూ హల్ చల్ చేశాడు. అవార్డు వేడుకల అనంతరం గవర్నర్స్ బాల్స్ కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా ఎంపికైన ఫ్రాన్సెస్ మెక్‌డార్మమండ్ (త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) తన షీల్డ్‌ను పక్కనపెట్టారు. అంతలో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి దానిని దొంగిలించాడు. ఆపై పార్టీలో ఆ షీల్డ్ తో సందడి చేశాడు. అటుపై బయటకు వెళ్తున్న క్రమంలో మీడియా కెమెరాలకు అతను ఫోజులివ్వటం విశేషం. అవార్డు కనబడకపోవటంతో కంగారు పడిన మెక్‌డార్మమండ్.. విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో సీసీఫుటేజీ దృశ్యాల ఆధారంగా అతన్ని పట్టేసుకున్నారు. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన టెర్రీ బ్రాయంట్గా గుర్తించారు. -
ముద్దుగుమ్మ పెద్దకల!
ఆలియాభట్ జనరల్ నాలెడ్జ్ సామర్థ్యంపై నెట్లో ఎన్నో జోక్‌లు రావచ్చుగాక, అంతమాత్రాన ఆమె నటన గురించి వంక పెట్టడానికి లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ‘హైవే’ ‘టు స్టేట్స్’ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘ఉత్తమ నటి’గా ఫిలింఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. నటన అంటేనే కాదు... సంగీతం అంటే కూడా ఆలియాకు ఇష్టం. ‘హైవే’ సినిమాలో పాట పాడి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంసలు కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ దృష్టి తాజాగా ‘డెరైక్షన్’పై పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది... అన్నట్లు మహేష్‌భట్ కూతురైన ఆలియా... తండ్రిలాగే డెరైక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటోందేమో. డెరైక్టర్ కావాలనే తన కోరికను ఆలియా ఇంతవరకు బహిరంగంగా చెప్పనప్పటికీ, ఒకవేళ ఆమె డెరైక్టర్ కావాలనుకుంటే ఆ కోరిక నెరవేరడం ఎంతసేపు! ఆలియా అక్క పూజాభట్ కూడా డెరైక్టర్‌గా ప్రయత్నించిందిగానీ పెద్దగా పేరేమీ తెచ్చుకోలేదు. ఆమెకు మాజీ హీరోయిన్గా మాత్రమే పేరుంది. ‘‘హీరోయిన్గా మంచి స్టేజ్‌లో ఉన్న సమయంలో డెరైక్షన్ వైపు వెళ్లి రిస్క్ చేయవద్దు’’ అని సన్నిహితులు ఆలియాకు సలహా ఇస్తున్నారట!