ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్టు పరీక్షల రీజనల్ కో-ఆర్డినేటర్, కేయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సొల్లేటి కనకాచారి ఒక ప్రకనటలో తెలిపారు. 17 పరీక్షా కేంద్రాల్లో 9,146మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు భాగాలుగా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు (పార్ట్-2) జనరల్ నాలెడ్జ్, 11 నుంచి 12:30 గంటల వరకు (పార్ట్-3) మేథమేటిక్స్, మధ్నాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు (పార్ట్-1) జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పషం చేశారు.
ఎస్‌బీఐటీ కేంద్రానికి ఉచిత బస్సు
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కేంద్రంలో ఆదివారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా బస్ సౌకర్యం ఉంటుంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐటీ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తమ కళాశాల బస్సు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
నేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్ష
Published Sun, May 18 2014 2:05 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement
Advertisement