తన సినిమాలను చూసి అంతా సంతోషించాలనేది తన అభిమతమని వర్ధమాన నటుడు వరుణ్ ధవన్ పేర్కొన్నాడు. ధవన్ హీరోగా ఇటీవల విడుదలైన ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’
తన సినిమాలను చూసి అంతా సంతోషించాలనేది తన అభిమతమని వర్ధమాన నటుడు వరుణ్ ధవన్ పేర్కొన్నాడు. ధవన్ హీరోగా ఇటీవల విడుదలైన ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదలుకుని తాజా సినిమా ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ వరకూ వరుణ్ నటించిన సినిమాలన్నింటికీ వివిధ దర్శకులు దర్శకత్వం వహించారు. ప్రతి సినిమాలో వరుణ్ విభిన్నమైన పాత్రను పోషించాడు. తన తాజా ప్రాజెక్టులతోపాటు ఆలియాభట్‌తో అనుభవం తదితరాలకు సంబంధించిన తన మనోభావాలను మీడియాతో వరుణ్ పంచుకున్నాడు.
‘ఆలియాతో పనిచేయడం విభిన్నమైన అనుభూతిని కలిగించింది. నా నటనాశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో నటించిన సినిమాలకంటే ఆలియాతో నటించే సమయంలో నా నటనా శైలి పూర్తిగా మారిపోయింది. ఇక తాజా సినిమా ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’లో తనను అత్యంత ప్రేమించే యువతి పాత్రను ఆలియా పోషించింది. ఆమెతో నటిస్తుంటో నాలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలు వేసేది. బాగా చార్జి అయ్యేవాడిని. నా సంభాషణలను అత్యంత నిదానంగా చెప్పేవాడిని.
ఈ సినిమాలో తనతోపాటు నటించిన శశాంక్ మరో నటనా పాఠశాలనుంచి వచ్చాడు. అతనిది పూర్తిగా థియేటర్ బ్యాక్‌గ్రౌండ్. అతను నసిరుద్దీన్ షా శిష్యుడు. నటన విషయంలో అతని శైలి నా కంటే భిన్నంగా ఉండేది. ఎంతో సహజంగా ఉండేది. అతనితో కలసి పనిచేయడం నాకు ఎంతో అనుభవం మిగల్చడంతోపాటు ఎంతో ఉత్సాహంగా కూడా అనిపించేది. శశాంక్.. నాకు నాలుగు టేక్‌లు ఇచ్చేవాడు. ఏదిఏమయినప్పటికీ అతనితో పనిచేయడంవల్ల నేను ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు వీలైంది ’అని చెప్పాడు వరుణ్ ధవన్.