స్టెప్పులతో అదరగొట్టింది | Alia Bhatt wows her Bangalore fans with Punjabi track 'Samjhawan' | Sakshi
Sakshi News home page

స్టెప్పులతో అదరగొట్టింది

Published Sun, Jul 6 2014 10:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

స్టెప్పులతో అదరగొట్టింది

స్టెప్పులతో అదరగొట్టింది

 తన తాజా సినిమా హంప్టీ శర్మా కీ దుల్హానియా సినిమా ప్రచారం కోసం ఆలియా భట్ చాలా కష్టపడుతోంది. దీని ప్రచారం కోసం సహనటుడు వరుణ్ ధవన్‌తోపాటు శుక్రవారం బెంగళూరు వచ్చిన ఈ చిన్నది, అక్కడ హల్‌చల్ చేసింది. ఈ సినిమాలోని పంజాబీ గీతం ‘మై తెను సమ్జావాన్ కీ’కు స్టెప్పులేయడంతో అభిమానుల చప్పట్లు మార్మోగాయి. సినిమాలో ఈ పాటను శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్ పాడారు. ఆలియా కోసం సమ్జావాన్ అన్‌ప్లగ్డ్ పేరుతో ప్రత్యేక గీతాన్ని సృష్టించారు.
 
 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వరుణ్, ఆలియాకు తొలి సినిమా కాగా, వీళ్లిద్దరూ కలసి మరోసారి హంప్టీ శర్మా కీ దుల్హానియాలో కనిపిస్తునారు. ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలుకొట్టడం ఖాయమని ఆలియా బలంగా నమ్ముతోంది. వరుణ్ మాట్లాడుతూ ‘ఇది విభిన్నమైన ప్రేమకథా సినిమా. అంబాలా, చండీగఢ్, ఢిలీ ముంబైలో షూటింగ్ చేశాం. నేను గతంలో ఎన్నోసార్లు బెంగళూరుకు వ చ్చి సరదాగా గడిపాను. ఇక్కడ అర్ధరాత్రి ఒంటిగంట దాకా విందులు, వినోదాలు కొనసాగుతాయి. సరదాగా సంగీతం వింటూ స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉంటే సమయమే తెలియదు’ అని చెప్పిన వరుణ్ ఇందులో టైటిల్ పాత్ర హంప్టీ శర్మగా కనిపిస్తాడు.
 
 యాక్షన్ సినిమా ఎప్పుడు చేస్తావని అడిగితే ‘త్వరలోనే’ అని అన్నాడు. సినిమాలో ఆలియాతో తన జోడీ గురించి ప్రస్తావించగా, ఇద్దరి మధ్య ప్రేమ, ద్వేషం వంటివాటితో కథ ముందుకు సాగుతుందని చెప్పాడు. నిజజీవితంలోనూ తామిద్దరి మధ్య ఇలాంటి సంబంధాలే ఉన్నాయని తెలిపాడు. హంప్టీశర్మకు క్రికెట్ పిచ్చి ఎక్కువగా, కావ్యా ప్రతాప్‌సింగ్ (ఆలియా) ఎప్పుడూ చిలిపిగా ఉండే యువతిగా కనిపిస్తుందని వివరించాడు. శశాంక్ ఖేతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లకు వస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement