పాపం అనన్య.. నైట్‌ క్లబ్‌లోకి నో ఎంట్రీ | Ananya Panday Not Allowed To Enter A Club In Mumbai Cause Of Her Age | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ను నైట్‌ క్లబ్‌లోకి అనుమతించలేదు ఎందుకంటే..

Published Wed, Jun 5 2019 8:04 PM | Last Updated on Wed, Jun 5 2019 8:06 PM

Ananya Panday Not Allowed To Enter A Club In Mumbai Cause Of Her Age - Sakshi

అనన్య పాండ్య.. పునీత్ మల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’  లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్‌ కూడా అధికంగానే ఉన్నారు. తన గ్లామర్‌తో ఎంతో మంది కుర్రకారుల గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఓ నైట్‌ క్లబ్‌లో మాత్రం ఎంట్రీ లభించలేదు. గత వారం అనన్య తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ముంబైలోని ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు.  క్లబ్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకొని బయటకు పంపించారు. కారణం ఏమిటంటే అనన్య వయసు 24 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. ఆ క్లబ్‌లో  24 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి ఉందని, ఆ కారణంతోనే అనన్యను అనుమతి ఇవ్వలేదని క్లబ్‌ యాజమాన్యం చెబుతోంది. కాగా తన వయసు వల్లే క్లబ్‌లోకి వెళ్లలేకపోయానని అనన్య తెగ ఫీల్‌ అవుతుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement