Night Club
-
USA: నైట్ క్లబ్‌పై కాల్పులు.. 11 మందికి గాయాలు
వాషింగ్టన్: నూతన సంవత్సం వేళ అమెరికాలో వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. లూసియానా రాష్ట్రంలో ఓ వాహనంతో ఒక దుండగుడు బీభత్సం సృష్టించి, 15 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.న్యూయార్క్‌లోని ఓ నైట్ క్లబ్(Night club)లో సామూహిక కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మందిపై కాల్పులు జరిగాయి. గాయాల పాలైనవీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన క్వీన్స్ నగరంలోని అమేజురా నైట్ క్లబ్లో చోటుచేసుకుంది. జనవరి ఒకటిన రాత్రి 11:45 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. సిటిజన్ యాప్ నివేదిక ప్రకారం కాల్పులకు పాల్పడిన ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు. అమేజురా ఈవెంట్ హాల్ జమైకా లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్ స్టేషన్‌కు సమపీంలో ఉంది. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్ధం వినపడటంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా చుట్టుపక్కల రోడ్లను మూసివేశారు. దీనికిముందు లాస్ వెగాస్(Las Vegas)లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల ట్రక్‌లో పేలుడు సంభవించింది. గడచిన 24 గంటల్లో వరుసగా మూడు దాడుల ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. MASS SHOOTING IN NYC: At least 13 victims shot at the Amazura Night Club located at 91-12 144th Pl, Jamaica, Queens. Massive crime scene set up. Unknown conditon of the victims. pic.twitter.com/HDXGhA3HJo— Breaking911 (@Breaking911) January 2, 2025ఇది కూడా చదవండి: అమెరికాలో వరుస ప్రమాదాలు.. ట్రంప్, మస్క్ సంచలన వ్యాఖ్యలు -
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పబ్ కల్చర్
-
నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని ఓ నైట్ క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమా దంలో 13 మంది సజీవ దహనమ య్యారు. మరో నలుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ టియేటర్ నైట్ క్లబ్లో ఉదయం 6 గంటల సమయంలో మొదలైన మంటలు భవనమంతటా వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. లోపల మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం పైకప్పు కూలుతుందనే భయంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారని చెప్పారు. -
జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యూజిక్, డ్యాన్స్, మందు.. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులో యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని ఓ పబ్ వినూత్నంగా ఆలోచించింది. ఇవన్నీ రొటీన్ అనుకొని ఏకంగా జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాములు, తొండలు, కుక్కలు వంటి వైల్డ్ జంతువులను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని క్సోరా (Xora) నైట్ క్లబ్ ఇటీవల తమ పబ్‌లో విదేశీ వన్యప్రాణులను చేర్చింది. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్సోరా నైట్‌క్లబ్ ఈ వారాంతంలో తమ పబ్‌లో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారని. దీనికి సంబంధించిన ఫోటోలు వారి ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయని, దయచేసి చర్యలు తీసుకోండంటూ ఆశిష్ అనే వ్యక్తి పోలీసులను కోరారు. Taking it up with @TelanganaDGP @CVAnandIPS @TelanganaCOPs and PCCF The audacity is shameful & shocking https://t.co/JADNkZLMAL — Arvind Kumar (@arvindkumar_ias) May 29, 2023 దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు సంఘటన అని వర్ణించారు. దీనిని తెలంగాణ డీజీపీ,సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు. కాగా నెల క్రితం కూడా సైబరాబాద్‌లోనూ ఇదే రీతిలో పబ్ లో జంతువులను ప్రదర్శనకు పెట్టారు నిర్వాహకులు. పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వహకులు చెబుతున్నారు. అయితే పబ్‌లో జంతువులను ప్రదర్శించడంపై క్సోరా నైట్ క్లబ్ నిర్వాహకులు స్పందించారు. పబ్‌లో ఉపయోగిస్తున్న ఎక్సోటిక్ అనిమల్స్ లైసెన్స్‌తో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. సదరు జంతువుల వల్ల ఏ హాని ఉండదని పేర్కొంది. చదవండి: Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి! Here's video footage of the wildlife on display from the Instagram page of Xora Bar & Kitchen, Jubilee Hills Rd#36 @cyberabadpolice. pic.twitter.com/XF56uI1keh — Ashish Chowdhury (@ash_chowder) May 29, 2023 Lol okay. pic.twitter.com/TdRQByEQQU — Ashish Chowdhury (@ash_chowder) May 30, 2023 -
ఫ్రీగా వస్తోందని తప్పతాగి.. కుప్పకూలిపోయాడు
క్లబ్లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్ స్టాప్‌గా అలా తాగుతూనే కుప్పకూలి.. మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని జేబులోంచి డబ్బును లాగేసుకుని.. శవాన్ని బయటకు విసిరిపారేసింది ఆ ముఠా. ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్ టూరిస్ట్ హత్య కేసులో.. 58 మందిపై తాజాగా అభియోగాలు నమోదు చేశారు పోలాండ్ పోలీసులు. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో.. సదరు టూరిస్ట్ ప్రాణం తీశారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 700 నేరపూరితమైన అభియోగాలను ఈ ముఠాపై నమోదు చేశారు. ఏం జరిగిందంటే.. 2017లో బ్రిటన్‌కు చెందిన మార్క్ సీ అనే వ్యక్తి పోలాండ్‌లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో ఫుల్‌గా తాగాడు. ఆపై క్రాకో లో ఉన్న వైల్డ్ నైట్ క్లబ్‌కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా మందు తాగుతూ పోయారు. అయితే ఒక దశకు వచ్చేసరికి.. మార్క్ ఆపేద్దామనుకున్నా క్లబ్ నిర్వాహకులు ఊరుకోలేదు. గంటన్నరలో అతనితో 22 పవర్ఫుల్ షాట్స్ తాగించారు. ఇంకేం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్క్. చనిపోయిన తర్వాత ఆ ముఠా.. అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్ బయటకు నెట్టేసింది. శవ పరీక్షలో.. మార్క్ ఒంట్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్ పాయిజన్‌తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఆరేళ్లుగా దర్యాప్తు చేసింది. మద్యం తాగించి మత్తులో మునిగిపోయే మందు బాబుల నుంచి డబ్బు, నగదు దోచుకుంటున్నట్లు.. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్‌గా ఈ మోసం నడుస్తున్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు మనిషి శరీరం బ్లడ్‌లో ఆల్కాహాల్ లెవల్ 0.3కి చేరినా, అంతకు మించినా ఆల్కాహాల్ పాయిజనింగ్ జరిగినట్లు లెక్క. దొరికింది కదా అని వేగంగా మద్యం తాగడమూ ఆరోగ్యానికి హానికరమే. మాట, నడకలో తడబాటుతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడడం లేదంటే ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలతో గుండె ఆగిపోవడం లాంటి హఠాత్ పరిణామాలు ఎదురవుతాయి. -
మనుషుల కంటే తుపాకులెక్కువ ! 3 వారాలు.. 38 కాల్పులు.. 70 ప్రాణాలు
మీకు ఒక విషయం తెలుసా..? అమెరికాలో నిప్పులు గక్కిన తుపాకీ తూటాలకు 1968–2017 మధ్య 15 లక్షల మంది అమాయకులు బలయ్యారు. ఈ సంఖ్య అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం నుంచి ఆ దేశం చేసిన యుద్ధాల్లో కోల్పోయిన సైనికుల కంటే ఎక్కువ. గత ఏడాదే అమెరికా తుపాకుల విక్రయానికి సంబంధించి బైడెన్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తెచ్చింది. అయినప్పటికీ కొత్త సంవత్సరంలో కేవలం మూడు వారాల్లో 38 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో ఈ దారుణ మారణకాండను ఇక అరికట్టలేరా ? అమెరికా నెత్తురోడుతోంది. గన్ కల్చర్ విష సంస్కృతి మరింతగా విస్తరిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల శబ్దాలు భయపెడుతున్నాయి. అయితే చంపడం, లేదంటే ఆత్మహత్య చేసుకొని చావడం. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి బయటకు వెళితే క్షేమంగా వెనక్కి వస్తారో లేదో తెలీదు. చదువుకోవడానికి బడికి వెళితే ఏ ఉన్మాది ఏం చేస్తాడోనని హడలిపోవాలి. నైట్ క్లబ్బులో విందు వినోదాలైనా, రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా ఎటు వైపు నుంచి ఈ తూటా దిగుతుందో చెప్పలేము. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్న వాళ్లలో యువత ఎక్కువ మంది ఉన్నారని తేలడంతో గత ఏడాది జూన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వారి చేతుల్లోకి తుపాకులు వెళ్లకుండా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చారు. అయినా కాల్పులు పెరిగాయే తప్ప తగ్గలేదు. 2023కి అగ్రరాజ్యం కాల్పులతో స్వాగతం పలికింది. ఒహియో, ఫ్లోరిడా, షికాగో, కరోలినా, పెన్సిల్వేనియాలలో తుపాకీల మోత మోగింది. అప్పట్నుంచి 38 సార్లు కాల్పులు జరిగితే 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 21న కాలిఫోర్నియాలో మాంటెరరీ పార్క్‌లో చైనీయుల కొత్త సంవత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మరణిస్తే 48 గంటలు తిరక్కుండానే కాలిఫో ర్నియా హాఫ్ మూన్ బే వ్యవసాయక్షేత్రంలో ఏడు గురు తూటాలకు బలయ్యారు. షికాగోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు. ఎన్నాళ్లీ నెత్తుటి మోత ..! అమెరికా రాజ్యాంగానికి రెండో సవరణ పౌరులు తుపాకులు కలిగి ఉండే హక్కుని కల్పించింది. రెండు ప్రధాన పార్టీల్లో రిపబ్లికన్లు తుపాకీలు కలిగి ఉండడానికి మద్దతుగా ఉండడం ఈ విషసంస్కృతిని కూకటి వేళ్లతో పెకిలించివేయడానికి వీల్లేకుండా చేస్తోంది. ప్రభుత్వం గన్ కల్చర్‌పై కఠిన ఆంక్షలు విధించాలని భావించిన సమయంలో సుప్రీం కోర్టు బహిరంగంగా తుపాకీ తీసుకువెళ్లే హక్కు అమెరికన్లకు ఉందంటూ గత ఏడాది సంచలన తీర్పు ఇచ్చింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులతో బలమైన లాబీయింగ్ చేస్తూ తుపాకుల నిషేధానికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ ఉంటుంది. టెక్సాస్ పాఠశాలలో ఒక టీనేజర్ జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది విద్యార్థులు బలవడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా తుపాకీ సంస్కృతిపై వ్యతిరేకత వచ్చి అదొక ప్రజా ఉద్యమంగా మారింది. అమెరికా ప్రజల్లో 60శాతం మంది తుపాకుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీనేజర్లకి తుపాకులు విక్రయిస్తే వారి నేరచరితను విచారించాలంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడం లేదు. శక్తిమంతమైన రాష్ట్రాలు తలచుకుంటేనే ఈ తుపాకుల హింసకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ► అమెరికాలో తుపాకీ తూటాలకు రోజుకి సగటున 53 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ► కరోనా సమయంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో తుపాకుల అమ్మకాలు ఏకంగా 63% పెరిగాయి. ► 2013 నుంచి ఏఆర్–15 రైఫిల్స్ అమ్మకాలు ఏడాదికి కోటికి పైగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ► 2020లో కాల్పులు దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచాయి. ఆ ఏడాది 610 కాల్పులు జరగ్గా 45,222 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. ► 2021లో రైఫిళ్లు, పిస్తోళ్లు వంటి చిన్న ఆయుధాల మార్కెట్ 370 కోట్ల డాలర్లుగా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదిరేటి స్టెప్పు మేమేస్తే (ఫొటోలు)
-
నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరడో స్ప్రింగ్స్‌లోని ఓ గే నైట్ క్లబ్లో సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా వెళ్లాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడటానికి కారణమేంటనే విషయాలను వెల్లడించలేదు. అమెరికా మీడియా మాత్రం సాయుధుడు ఇంకా క్లబ్‌లోనే ఉన్నాడని, స్నైపర్‌తో కాల్పులు జరుపుతున్నాడని పేర్కొంది. ఈ క్లబ్లో ప్రతిఏటా నవంబర్ 20న గే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పదుల సంఖ్యలో స్వలింగ సంపర్కులు నైట్ క్లబ్‌కు వచ్చారు. అయితే సాయుధుడు ఒక్కసారిగా వీరిపై కాల్పులకు తెగబడ్డాడు. చదవండి: 140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్.. -
Thailand: నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్ చోన్బురి ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో పలువురు దుర్మరణం పాలయ్యారు. అర్ధరాత్రి దాటాక సట్టాహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా 13 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 35 మంది తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితులంతా థాయ్ పౌరులేనని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. -
21 మంది విద్యార్థులు మృతి.. నైట్ కబ్ల్‌లో ఏం జరిగింది?
పరీక్షలు ముగిశాయని ఆనందంలో వారంతా పార్టీ చేసుకున్నారు. నైట్ క్లబ్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంతలో ఏమైందో తెలియదు.. నైట్ క్లబ్లో 21 మంది టీనేజర్లు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులంతా కలిసి దక్షిణాఫ్రికాలోని టౌన్షిప్ టావెర్న్‌లో పార్టీ చేసుకున్నారు. అనంతరం వారంతా చనిపోవడం కలకలం రేపింది. అయితే, వారి బాడీలపై ఎలాంటి గాయాలు లేకపోవడం పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో, పోలీసులు సైతం షాకయ్యారు. వీరి మృతి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. విద్యార్థులు ఎలా మరణించారో తెలుసుకోవడానికి వారి మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. వారిపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, స్థానిక వార్తాపత్రిక డిస్పాచ్‌లైవ్ తన వెబ్సైట్లో " మృతుల శరీరాలు టేబుల్స్, కుర్చీలు, నేలపై ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయి, శరీరాలపై గాయాల ఆనవాళ్లు లేవు’’ అని కథనంలో పేర్కొంది. ఇక, చనిపోయిన వారిలో 8 మంది విద్యార్థినిలు ఉండగా.. 13 మంది బాలురు ఉన్నారు. మరోవైపు.. విద్యార్థుల మరణ వార్త తెలియడంలో వారి పేరెంట్స్ నైట్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలను చూపించాలని బోరున విలపించారు. అయితే, టౌన్షిప్ టావెర్న్లలో 18 ఏళ్లు పైబడిన వారికి మద్యపానం అనుమతిస్తారు. వీటిని సాధారణంగా షెబీన్స్ అని పిలుస్తారు. ఇవి ఇళ్లలో కూడా ఉంటాయి. ఇది అధికంగా సేవించడం వల్లే వారు చనిపోయి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాగా, చాలా మంది విద్యార్థులు హైస్కూల్ పరీక్షలు ముగిసిన తర్వాత "పెన్సు డౌన్" పార్టీలు జరుపుకుంటున్నారని తల్లిదండ్రులు, అధికారులు చెప్పారు. విద్యార్థుల మరణ వార్తపై.. దక్షిణాఫ్రికా ప్రధాన మంత్రి ఆస్కార్ మబుయానే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది జీర్ణించుకోలేని విషయం. 21 మంది యువత ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. South African Tavern Tragedy: 21 Teenagers Dead In South Africa Bar, Cause Still Unclear https://t.co/DTZOPo4AH6 — ɐɯɹɐɥs ɥsuɐ (@anshsharma) June 27, 2022 ఇది కూడా చదవండి: జీ7 సదస్సు వేళ.. నామరూపాల్లేకుండా నగరాలు, పుతిన్‌ను హేళన చేస్తూ.. -
ఓయూకొచ్చి నైట్ క్లబ్ గురించి చెప్తారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్లో ఉన్న పర్సనల్ వీడియో ఒకటి రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నేపాల్ ఖాట్మాండులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాహుల్.. పబ్‌లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ తరుణంలో.. తెలంగాణలో ఆయన టూర్ దగ్గరపడుతున్న వేళ.. ఈ వీడియోను విమర్శనాస్త్రంగా చేసుకుంది టీఆర్ఎస్. ‘‘ఓయూ వెళ్లి నైట్ క్లబ్లో పార్టీ గురించి చెప్తారా? అంతకు మించి ఏం మాట్లాడతారు? రాహుల్ ఓయూకి వస్తే విద్యార్థులు చెడిపోతారు’’ అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సెటైర్లు వేశారు. అటు గతంలో కాంగ్రెస్ పాలన.. ఇటు బీజేపీ పాలన దేశాన్ని నాశనం చేశాయంటూ విమర్శించారు. ఇక రాహుల్ పర్యటనకు అనుమతుల విషయంలో ఓయూ వీసీదే తుది నిర్ణయమని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. తప్పేముంది?: జగ్గారెడ్డి ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోపై వస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వెళ్తే తప్పేంటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఫంక్షన్ పోతే తప్పేంటి?. పెళ్లికి వెళ్తే రాజకీయం చేయడం చీప్ ట్రిక్స్. కావాలని బురద చల్లుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వాళ్లకు కామన్ సెన్స్ లేదా? మీ నాయకుల వెనకాల కెమెరాలు పెట్టి చూడాలా? ఏం చేస్తున్నారో. టీఆర్ఎస్ నేతలకు హయత్ హోటల్స్‌లో సెపరేట్ రూల్స్ ఉన్నాయి. బీజేపీ నాయకులకు కూడా సూట్ రూమ్స్ ఉన్నాయి. వీటన్నింటిని ఏమనాలి? మరి అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. చదవండి: రాహుల్ నైట్ క్లబ్ వీడియో కాంగ్రెస్ స్పందన ఇది! -
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముంది?
సాక్షి, ఢిల్లీ: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. నేపాల్ మన(భారత్‌కు) మిత్ర దేశం. ఆహ్వానం మేరకే రాహుల్ గాంధీ వివాహ వేడుకకు వెళ్లారు. అంతేగానీ ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట వేడుకకు వెళ్లలేదు.. షరీఫ్‌తో కలిసి కేక్ కట్టింగ్ చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. రాహుల్ చేసిందాంట్లో తప్పేమీ లేదు. అలా పెళ్లికి వెళ్లడం సంప్రదాయం కూడా. నేరం కాదు. బహుశా బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు రణ దీప్ సూర్జేవాలా. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్,బీజేపీల మధ్య కొత్త రగడకు దాడి తీసింది రాహుల్ నైట్ క్లబ్ వీడియో. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి వరుసపెట్టి ట్వీట్లు, పోస్టులతో సెటైర్లు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ కౌంటర్‌కి దిగింది. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్.. ఇది ఎవరో చెప్పాలంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. Who is this ? 😉 pic.twitter.com/dVuiiHGpEL — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022 చదవండి: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో దుమారం -
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. విమర్శలు
Rahul Gandhi Night Club Video:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్ వీడియో ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపుతోంది. నైట్‌పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ కాంగ్రెస్ నేతపై విరుచుకుపడుతోంది. వ్యక్తిగత టూర్ అయినప్పటికీ.. వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇన్చార్జి అమిత్ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతపై, ఆ పార్టీ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన సుమ్నీమా ఉదాస్ వివాహ వేడుక కోసం నిన్న(సోమవారం) రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్ హోటల్లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్ ఉదాస్ ధృవీకరించారు. భూమ్ ఉదాస్.. మయన్మార్‌లో నేపాల్ అంబాసిడర్‌గా ఉన్నారు. Noiiice 😎 pic.twitter.com/jTvUyVuE7A — Ajit Datta (@ajitdatta) May 3, 2022 ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ ‘దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్ నేపాల్ టూర్‌పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఆయుధంగా చేసుకుంది. Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent. Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate... pic.twitter.com/dW9t07YkzC — Amit Malviya (@amitmalviya) May 3, 2022 హానీ ట్రాప్.. విమర్శలు దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్ గాంధీ ఓ మహిళతో క్లోజ్‌గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్ నుంచి వివరణ రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ను ముంచుతూ.. యువరాజు విలాసాల్లో తేలుతున్నాడంటూ పలువురు సెటైర్లు సైతం పేలుస్తున్నారు. -
అరెస్ట్ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్లో దాడి జరిపి, కోవిడ్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను ముంబై పోలీసులు 34 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సురేశ్ రైనా, గురు రంధావా, సుసానే ఖాన్ సహా పలువురు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. వాటి ప్రకారం నైట్ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలి. అయితే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా క్లబ్‌ను తెరిచి ఉంచినందుకు నిర్వాహకులను, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను అక్కడ ఉన్నా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు ఉండగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సుసానే ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. తనను అరెస్ట్ చేశారంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు సుసానే ఖాన్. దీని గురించి తమను లేదా క్లబ్ యాజమాన్యాన్ని సంప్రదించకుండా ఊహాగానాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ నుంచి ప్రకటన వచ్చే వరకు ఆగరు.. స్వయంగా వారే ఎంక్వైరీ చేయ్యరు. ఏది తోస్తే అది రాస్తారు.. ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు సుసానే ఖాన్. ఇక దీని గురించి తానే స్వయంగా వివరణ ఇవ్వాలని భావించానని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశారు సుసానే ఖాన్. దీనిలో ఆమె ‘గత రాత్రి క్లోజ్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో భాగంగా సహార్ జేడబ్ల్యూ మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. పార్టీ టైం కాస్త ఎక్స్టెండ్ అయ్యింది. ఉదయం 2.30గంటల సమయంలో అధికారులు క్లబ్‌లోకి వచ్చారు. యాజమాన్యాన్ని పిలిచి కొత్త కర్ఫ్యూ నియమాలు గురించి చెప్పి.. ఇంతసేపు ఎందుకు ఒపెన్ చేసి ఉంచారనే తదితర విషయాల గురించి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న వారందరని మరో మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సిందిగా కోరారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపిచారు. ఇది వాస్తవంగా జరిగింది. ఇక మీడియాలో నేను అరెస్ట్ అయ్యానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా బాద్యతారహితమైనవి.. అవాస్తవాలు’ అని పేర్కొన్నారు సుసానే. (చదవండి: రైనా, టాప్ హీరో మాజీ భార్య అరెస్ట్) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) ఇక ఇందుకు సంబంధించి గురు రంధావా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. గత రాత్రి జరిగిన సంఘటనకు తాను ఎంతో బాధపడుతున్నానని... కొత్త కర్ఫ్యూ నియమాల గురించి తనకు తెలియదని.. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని దానిలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానని తెలిపారు. -
నైట్ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది
సాక్షి, ముంబై: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న నైట్ క్లబ్బులపై బీఎంసీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో పట్టుబడిన నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీచేయడమే గాకుండా ఓ క్లబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్యల్లో భాగంగా నాలుగు క్లబ్‌ల యజమానుల నుంచి రూ.43,200 జరిమానా వసూలు చేశారు. కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి నైట్ క్టబ్బులు నడిపితే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యాజమాన్యాలు తమ వైఖరి మర్చుకోకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్లబ్ యాజమాన్యాలలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. అందులో పార్టీలు చేసుకునే కస్టమర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదముంది. నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చహల్ సూచించారు. కఠిన చర్యలు తీసుకుంటాం: బీఎంసీ కమిషనర్. కొన్ని క్లబ్బుల యజమానులు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ చహల్ దృష్టికి వచ్చింది. దీంతో నగరంతోపాటు ఉప నగరాలలో అర్ధరాత్రి దాటిన ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో దాదర్‌లోని ప్రీతం హోటల్లో, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్ క్లబ్బుల్లో నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు బీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో నైట్ క్లబ్లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్ ధరించలేదు. సామాజిక దూరమైతే పటాపంచలైంది. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులతోపాటు జరిమానా విధించారు. చదవండి: (సోదరిపై ప్రేమతో అతడు చేసిన పని ఇప్పుడు హాట్‌టాపిక్..) ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్ది రోజులు ముఖాలకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి పనులు చేయాల్సి ఉంది. కానీ, కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల కరోనా మళ్లీ పడగలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కానీ, నైట్ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని చహల్ హెచ్చరించారు. క్లబ్ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు. -
అమెరికా: నైట్ క్లబ్లో కాల్పుల కలకలం
గ్రీన్విల్లే: అమెరికా దక్షిణ కరోలినాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 8 మందికి గాయాలయ్యాయి. మృతులను గ్రీన్విల్లేకు చెందిన మైకాల బెల్ (23), డంకన్‌కు చెందిన క్లారెన్స్ జాన్సన్ (51)గా గుర్తించారు. జాన్సన్ నైట్ క్లబ్లో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవారని అధికారులు వెల్లడించారు. అమెరికా 244వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నైట్ క్లబ్లో నిర్వహించిన వేడుకలకు దాదాపు 200 మంది హాజరయ్యారు. తుపాకీ కాల్పు చోటు చేసుకోవడంతో అప్పటి వరకు ఆనందంగా వేడుకలకు సిద్ధం అవుతున్న నైట్ క్లబ్లో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. అయితే వారి ఆచూకీ సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదు. గాయపడిన వారు గ్రీన్విల్లే మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ముఠా సంబంధిత గొడవల కారణంగానే కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత) -
పాపం అనన్య.. నైట్ క్లబ్‌లోకి నో ఎంట్రీ
అనన్య పాండ్య.. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్ కూడా అధికంగానే ఉన్నారు. తన గ్లామర్‌తో ఎంతో మంది కుర్రకారుల గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఓ నైట్ క్లబ్లో మాత్రం ఎంట్రీ లభించలేదు. గత వారం అనన్య తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ముంబైలోని ఓ నైట్ క్లబ్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. క్లబ్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకొని బయటకు పంపించారు. కారణం ఏమిటంటే అనన్య వయసు 24 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. ఆ క్లబ్లో 24 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి ఉందని, ఆ కారణంతోనే అనన్యను అనుమతి ఇవ్వలేదని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. కాగా తన వయసు వల్లే క్లబ్‌లోకి వెళ్లలేకపోయానని అనన్య తెగ ఫీల్ అవుతుందట. -
మెక్సికోలో కాల్పులు
గ్వానజువాటో: మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానజువాటో రాష్ట్రంలోని లాప్లాయా నైట్‌క్లబ్‌పై శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలిస్తున్న ముఠాలు లక్ష్యంగా మెక్సికో సైన్యం వేట మొదలెట్టింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలతో నైట్‌క్లబ్‌పై కాల్పులు జరిపిన దుండగులు ఘటనాస్థలం నుంచి కారులో పరారయ్యారు. పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఆయిల్ చోరీ కారణంగా మెక్సికో గత కొన్నేళ్లలో రూ.21,000 కోట్లు నష్టపోయింది. -
నన్ను విచిత్రంగా చూశారు
ఉషా ఉతుప్... మాంచి జోష్ ఉన్న సింగర్. ఫీమేల్ సింగర్ అంటే వాయిస్ సున్నితంగా ఉండాలి అనుకునే ఆలోచనని తన బేస్ వాయిస్‌తో బద్దలుకొట్టారు. పేద్ద బొట్టు, తల నిండా పువ్వులు, చీర కట్టుతోనే మనందరికీ ఎప్పుడూ కనిపిస్తారు. కెరీర్ స్టార్టింగ్‌లో తన వేషధారణ వల్ల ఎదుర్కొన్న ఓ విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో నైట్ క్లబ్లో పాటలు పాడేదాన్ని. నైట్ క్లబ్‌కి కూడా చీర కట్టుకొని వెళ్లేదాన్ని. అక్కడికి వచ్చిన వాళ్లంతా నన్ను స్టైజ్ మీద చూసి ‘ఈ అమ్మ ఏం పాడుతుందిలే..’ అన్నట్టుగా నన్ను విచిత్రంగా చూసేవారు. తీరా నేను పాడటం అయిపోయిన తర్వాత ‘వావ్’ అన్నట్టుగా ముఖాలు పెట్టేవారు. చాలా మంది అనుకుంటారు ఉషా ఉతుప్ అనగానే చీర, పెద్ద బొట్టుతో కనిపిస్తారు.. ఇది మార్కెటింగ్ స్ట్రాటెజీ అని. కానీ అలా ఏం కాదు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడూ చీరే కట్టుకునేవారు. నాకు తెలిసిన డ్రెస్ అదొక్కటే. అలాగే నేను చీర కట్టుకొని వెళ్లడం వల్ల నైట్‌క్లబ్‌కి ఫ్యామిలీలు కూడా రావడం స్టార్ట్ అయ్యారు. అలా నైట్ క్లబ్ ఫ్యామిలీ ప్లేస్‌లా మారిపోయింది. ఆడియన్స్‌లో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే భార్యలందరికీ తమ భర్తల మీద ఓ భరోసా ఉండేది. నా శరీరాకృతి, నా అందం చూసి వాళ్ల భర్తల మనసు చలించదు అని (నవ్వుతూ)’’ అంటూ తన మీద తానే జోక్ వేసుకుంటూ, పాత అనుభవాలను పంచుకున్నారు ఉషా ఉతుప్. -
పోర్న్‌స్టార్ అరెస్ట్.. అంతలోనే...
సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్(స్టోర్మీ డేనియల్స్) అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. ఒహియో రాష్ట్రంలో ఓ క్లబ్లో ఆమె స్ట్రిప్పింగ్ డాన్సులు చేస్తూ.. కొందరితో అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణల మేర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది గంటలకే ఆమెపై ఆరోపణలు కొట్టేస్తూ విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. కొలంబస్‌లోని సైరెన్స్ జెంటిల్మెన్స్ క్లబ్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రిప్పింగ్ డాన్స్ చేస్తూ టాప్ లెస్‌గా ఆమె కస్టమర్లు, అక్కడికొచ్చిన నలుగురు అధికారుల పట్ల ప్రవర్తించిందని ఆరోపణ. వెంటనే స్టోర్మీతోపాటు, మరో ఇద్దరు డాన్సర్లను అరెస్ట్ చేసి జాక్సన్ పైక్ జైలుకు తరలించారు. అయితే ఉదయం ఆ ఆరోపణలను ఎత్తేసిన పోలీసులు.. ఆమెను రిలీజ్ చేయటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుట్ర కోణం.. స్టెఫానీ క్లిఫోర్డ్.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ కాకముందు ఆయన తనతో అఫైర్ నడిపాడని.. ఆ విషయం బయటకు పొక్కకుండా డీల్ కూడా కుదుర్చుకున్నాడని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేసే అరెస్ట్ చేయించారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. డిటెక్టివ్లు మారువేషంలో క్లబ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే డ్రగ్స్, వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకే తాము సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. కాసేపటికే... స్టోర్మీని అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే పోలీసులు విడుదల చేశారు. ఆరు వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారని, శుక్రవారం ఆమె కోర్టులో సైతం హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది మైకేల్ అవెనట్టి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే నైట్ క్లబ్లో ఆమె సభ్యత్వం ఉన్న డాన్సర్ కావటంతోనే ఆమెపై ఆరోపణలు కొట్టేసి.. వదిలేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్టెఫానీ పెదవి విప్పాల్సి ఉంది. -
‘గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో భారీ అగ్ని ప్రమాదం
లండన్: స్కాట్లాండ్కు చెందిన చారిత్రక గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్కూల్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 20 ఫైరింజన్లు, 120 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషిచేశారు. స్కూల్లో మొదలైన అగ్ని కీలలు వేగంగా క్యాంపస్ నైట్‌క్లబ్, ఓ2 ఏబీసీ అనే మ్యూజిక్ కేంద్రానికి కూడా వ్యాపించాయి. ఈ భవనానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ చార్లెస్ రెన్ని మెకింతోష్ రూపకల్పన చేశారు. -
క్రిమినల్
కళ్ళు తెరిచేసరికి ఓ షెడ్లో చెక్క కుర్చీలో ఉన్నా. తాళ్ళతో కట్టేశారు నన్ను. నా నోటికి టేప్ అంటించారు.ఆశ్చర్యంతో అయోమయంగా పరిసరాలను పరికించి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఒక్కో విషయం మెల్లగా గుర్తుకు రాసాగింది. రాత్రి ఎనిమిది గంటలకు ఆల్ నైట్ క్లబ్లో డ్రింక్స్‌కి ఆర్డర్ ఇచ్చాను. ఓ యువతి నాకు కంపెనీ ఇచ్చింది. అందం కంటే ఆకర్షణే ఎక్కువ ఆమెలో. చికెన్ పకోడాను ఒకరికొకరం తినిపించుకుంటూ డ్రింక్స్ పూర్తిచేశాం. ఆ రోజు కాస్త ఎక్కువే తాగాను నేను. సెల్‌ఫోన్ మోగడంతో మాట్లాడుతూ అక్కణ్ణుంచి వెళ్ళిందామె. నేను బిల్ చెల్లించి తూలుకుంటూ బైటకు నడిచాను. పార్కింగ్‌లో ఉన్న నా బైక్‌ని తీయబోతూంటే, వెనుక నుంచి వచ్చి నా చేయి పట్టుకుందామె. ‘మీకు డోస్ ఎక్కువయింది. ఈ స్థితిలో బైక్ రైడ్ సేఫ్ కాదు. ఈ పక్కనే నా రూమ్ ఉంది. ఈ రాత్రికి అక్కడ ఉండి తెల్లవారాక వెళుదురుగాని’ అంది.ఆమెను చూశాక ఎందుకో మారు మాట్లాడకుండా ఆమె వెంట నడిచాను. తల గట్టిగా విదిలించి మళ్ళీ కళ్ళు తెరచాను నేను – ‘ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఇలా కట్టిపడేసిందెవరు??...’ ఓ వ్యక్తి బకెట్‌తో నీళ్ళు తెచ్చి నా నెత్తిమీద గుమ్మరించాడు. నా మత్తు పూర్తిగా దిగిపోయింది. అది కలా కాదు, కల్లా కాదు – పచ్చి వాస్తవం! నా ఎదుట కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతను – సిటీలో పేరుమోసిన డాన్!‘భాయ్’ అని పిలుస్తారంతా. అతని వెనుక అనుచరులు కొందరు నిల్చున్నారు.పక్కనే ఉన్న స్టూల్ మీద కొన్ని ఏటీఎమ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, బ్లో టార్చ్, ప్లయర్స్, హాక్సా బ్లేడ్, క్లా హేమర్, పెన్ నైఫ్ వగైరాలు ఉన్నాయి. అవన్నీ నావే. నేను, నాక్రైమ్ పార్ట్నర్ రాబర్ట్ దోచుకొచ్చినవి. భాయ్‌కి ఆగ్రహం తెప్పించే పని నేను ఏం చేశానో బోధపడలేదు నాకు. ఆ విషయమే అడుగుదామంటే, నోటికి టేప్.‘‘బ్రహ్మాజీ!’’ భాయ్ పిలుపుతో చుట్టూ చూశాను. కాని, అతను పిలిచింది నన్నేనని గ్రహించి విస్తుపోయాను. జేబులోంచి ఓ పాత ఐడీ కార్డ్ తీశాడు భాయ్. ‘‘నీ జేబులోంచి తీసిన ఐడీ కార్డ్ ఇది. ఇదే నిన్ను పట్టిచ్చింది. ఈ పదేళ్ళలో కార్డ్‌ని మార్చలేదనుకుంటాను నువ్వు. మసకబారిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని తీసేసి కలర్ ఫోటోని పెట్టుకోవాలనిపించలేదా నీకు. ఇప్పుడు అనిపించినా ప్రయోజనం లేదులే. ఎందుకంటే ఇకపైన దీని అవసరం నీకు ఉండదుకదా!’’ అన్నాడతను. ‘‘నీ పేరు బ్రహ్మాజీ. కోల్‌కతాలో ఓ చెప్పుల కంపెనీ ఉంది నీకు. బిజినెస్ పని మీద ఈ ఊరికి వచ్చావు. వారం క్రితం తప్పతాగి కారు నడుపుతూ ఓ యువతిని ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయావు..’’ ఆ యువతి భాయ్ చిన్న పెళ్ళాం జాస్మిన్ అట. ఆ రాత్రి రోడ్ క్రాస్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగిందట. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలిందట. అదరిపడ్డాను నేను. అసలు ఆ బ్రహ్మాజీ ఎవరో నేను ఎరుగను. నా పేరు సిద్ధు. ఓ క్రిమినల్ని. బ్రహ్మాజీ అన్న వ్యక్తి ఐడీ కార్డ్ నా జేబులోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ‘మిస్టేకెన్ ఐడెంటిటీ’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాను. టేప్ అడ్డు వచ్చింది. తల అడ్డుగా తిప్పాను. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు వెళుతూన్న ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీసాడు. కార్ నంబర్ ఆధారంగా నిన్ను ట్రేస్ చేయడం జరిగింది.’’ చెప్పాడు భాయ్. ఆ హంతకుడు నేను కానని చెప్పడానికి కళ్ళతో, తలతో గింజుకున్నాను. టేప్‌ని తొలగించవలసిందిగా సైగలు చేశాను.‘‘ప్రాణానికి ప్రాణమైన నా జాస్మిన్ ప్రాణాలను గాలిలో కలిపేసినవాడు బతికి ఉండకూడదు. వాణ్ణి యమపురికి పంపి నా జాస్మిన్ ఆత్మకు శాంతి చేకూర్చుతానని శపథం చేశా. నా శపథం నెరవేరబోతోంది ఇప్పుడు..’’ అంటూ అనుచరులకు సైగ చేశాడు భాయ్.నిశ్శబ్దంగా అతని పక్కకు వచ్చి నిలుచున్న వ్యక్తిని చూసి తెల్లబోయాను నేను.రాబర్ట్! నా క్రైమ్ పార్ట్నర్! గత పదేళ్ళుగా రాబర్ట్, నేను కలసి నేరాలు చేస్తున్నాము. అతను ఇతరుల క్రెడిట్ కార్డులు, ఏటీఎమ్ కార్డులను దొంగిలించి తెచ్చి నాకు అమ్ముతాడు. నేను వాటికి ఫేక్ పిన్ నంబర్లు సృష్టించి క్యాష్ చేసుకుంటాను. జాస్మిన్‌కి యాక్సిడెంట్ జరిగినట్లు చెప్తున్న రోజు నేను ముంబైలో ఉన్నానన్న విషయం రాబర్ట్‌కి తెలుసు. ‘రాబర్ట్! ప్లీజ్! నేను బ్రహ్మాజీని కాననీ, నీ ఫ్రెండ్ సిద్ధూననీ, యాక్సిడెంట్ రోజున నేను ఈ ఊళ్ళోనే లేననీ భాయ్‌తో నిజం చెప్పు,’ అర్థింపుగా అతని వంక చూశాను. చూపులు మరల్చుకున్నాడు.మూడు రోజుల క్రితం మోనిక అన్న మాటలు హఠాత్తుగా నా మదిలో మెదిలాయి – ‘సిద్ధూ! నీ ఫ్రెండ్ ఓవర్ స్మార్ట్. తన పెళ్ళాంతో సంబంధం పెట్టుకున్నావని తెలిస్తే చంపేస్తాడు నిన్ను. నేనంటే పిచ్చి కనుక, కోపంతో నాలుగు దెబ్బలు వేసి ఊరుకుంటాడంతే’. ఏడాది క్రితం మోనికను ఎలాగో ట్రాప్ చేసి పెళ్ళి చేసుకున్నాడు రాబర్ట్. ఆమె అంటే పిచ్చిప్రేమ. కాని, ఆమె నాపైన మనసు పారేసుకుంది. మా వ్యవహారం రాబర్ట్‌కి తెలిసిపోయిందనీ, అందుకే జాస్మిన్ యాక్సిడెంటు కేసులో నన్ను తెలివిగా ఇరికించాడనీ గ్రహించడం కష్టం కాలేదు నాకు. నేను నోరు విప్పితే భాయ్‌కి నిజం తెలుస్తుందనే నా నోటికి టేప్ కూడా వేయించాడని బోధపడింది. ‘‘బ్రహ్మాజీ! నీ అంతిమ ప్రార్థన చేసుకో’’ అన్న భాయ్ హెచ్చరికతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అతని చేతిలోని రివాల్వర్ మెల్లిగా పైకి లేస్తుంటే, నేరజీవితం సరిగ్గా ఎక్కడ ముగుస్తుందో తెలుస్తున్నట్టనిపించింది. - తిరుమలశ్రీ -
క్లబ్బులో గొడవ: హీరోయిన్ అరెస్టు
-
మాలీలో నైట్‌క్లబ్‌పై దాడి
బమాకో(మాలి): మాలీలో విదేశీయులు ఎక్కువగా వెళ్లే ఓ నైట్‌క్లబ్‌పై దుండగులు దాడి చేశారు. మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఫ్రాన్స్, బెల్జియం దేశీయులిద్దరు సహా ఐదుగురు చనిపోయారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు నిపుణులు సహా 9 మంది గాయపడ్డారు. మాలి రాజధాని బమాకోలోని ‘లా టై రెస్టారెంట్’పై శనివారం ఈ దాడి జరిగింది. కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఓ కారులో పారిపోయారు. అక్కడి నుంచి వెళుతూ సమీపంలోనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారుపైనా కాల్పులు జరపడంతో దాని డ్రైవర్ చనిపోయాడు. అలాగే ఓ ఇంటి బయట ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును, వీధిలో వెళుతున్న ఓ పౌరుడిని కూడా కాల్చి చంపారు. ఇది ఉగ్రవాద చర్యగానే ఫ్రాన్స్ భావిస్తోంది. -
చంటోడిని కారులో వదిలి.. నైట్క్లబ్బుకు వెళ్లిన తల్లి!
పిల్లాడి కంటే ఆ మహాతల్లికి నైట్క్లబ్బే ఎక్కువ అయిపోయింది. మూడేళ్ల కొడుకును వేడిగా ఉన్న కారులో ఒంటరిగా వదిలిపెట్లి, క్లబ్బుకు వెళ్లిన ఆ తల్లిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య హారిస్ కౌంటీకి చెందిన ఉజ్మా షేక్ అనే మహిళ తన పిల్లవాడితో సహా నైట్ క్లబ్బులోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, తలుపు వద్ద ఉన్న కాపలాదారు.. ఆమెను లోనికి వెళ్లనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి వెళ్లి, ఈసారి ఒంటరిగా వచ్చింది. తన స్నేహితురాలి వద్ద పిల్లాడిని వదిలిపెట్టినట్లు అతడికి చెప్పింది. దాంతో ఆ కాపలాదారుకు అనుమానం వచ్చి, కారు వద్దకు వెళ్లాడు. తీరా చూస్తే కారులో పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. పిల్లాడిని నిర్లక్ష్యంగా అలా వదిలేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. తర్వాత 1.20 లక్షల రూపాయల బాండు సమర్పించడంతో వదిలిపెట్టారు. -
నైట్ క్లబ్లో ఇలియానా, వరుణ్
నటి ఇలియానా అర్ధరాత్రి వరకు బాలీవుడ్ నటుడితో క్లబ్ లో గడపడంతో సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందిన నటి ఇలియానా. కోలీవుడ్‌లో నన్బన్ చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన ఈ గోవా సుందరి తాజాగా ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించారు. ఈమె వరుణ్ ధావన్ సరసన నటించిన మే తేరా హీరో చిత్రం ప్రమోషన్ కోసం బెంగళూరు విచ్చేసి, అక్కడే ఒక నక్షత్ర హోటల్లో బస చేశారు. ఆమెతోపాటు నటుడు వరుణ్ ధావన్ కూడా ఉండడం విశేషం. చిత్ర ప్రచార కార్యక్రమం ముగిసిన తరువాత హోటల్‌కు చేరిన వరుణ్‌ధావన్, ఇలియానా, ఆ వెంటనే నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి ఒంటి గంట వరకు వరుణ్ ధావన్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. వీరి రొమాన్స్ చూసిన అక్కడి వారు విస్మయం చెందారు. ఇప్పటికే ఇలియానా నటుడు వరుణ్ ధావన్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని స్త్రీలంటే చాలా గౌరవం అని పొగడ్తలతో ముంచెత్తి, తను పెళ్లి చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకుంటానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడిలా వరుణ్ ధావన్‌తో నైట్ క్లబ్‌ల్లో గడపడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.