నైట్ క్లబ్‌లో ఇలియానా, వరుణ్
నైట్ క్లబ్‌లో ఇలియానా, వరుణ్
Published Tue, Apr 1 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
నటి ఇలియానా అర్ధరాత్రి వరకు బాలీవుడ్ నటుడితో క్లబ్ లో గడపడంతో సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఇలియానా. కోలీవుడ్‌లో నన్బన్ చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన ఈ గోవా సుందరి తాజాగా ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించారు. ఈమె వరుణ్ ధావన్ సరసన నటించిన మే తేరా హీరో చిత్రం ప్రమోషన్ కోసం బెంగళూరు విచ్చేసి, అక్కడే ఒక నక్షత్ర హోటల్లో బస చేశారు. ఆమెతోపాటు నటుడు వరుణ్ ధావన్ కూడా ఉండడం విశేషం.
చిత్ర ప్రచార కార్యక్రమం ముగిసిన తరువాత హోటల్‌కు చేరిన వరుణ్‌ధావన్, ఇలియానా, ఆ వెంటనే నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి ఒంటి గంట వరకు వరుణ్ ధావన్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. వీరి రొమాన్స్ చూసిన అక్కడి వారు విస్మయం చెందారు. ఇప్పటికే ఇలియానా నటుడు వరుణ్ ధావన్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని స్త్రీలంటే చాలా గౌరవం అని పొగడ్తలతో ముంచెత్తి, తను పెళ్లి చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకుంటానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడిలా వరుణ్ ధావన్‌తో నైట్ క్లబ్‌ల్లో గడపడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Advertisement
Advertisement