అతను చాలా నాటీ!
అతను చాలా నాటీ!
Published Sun, Feb 2 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదలైతే ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకింత థ్రిల్‌గా, టెన్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇలియానా ఈ రెండు రకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మార్చి, 28న ‘మై తేరా హీరో’ ఏప్రిల్ 4న విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నానని ఇలియానా పేర్కొన్నారు. వారం రోజుల గ్యాప్‌లో విడుదలవుతున్న ఈ రెండూ సూపర్ హిట్ అవుతాయని, తనకు డబుల్ ధమాకా ఖాయమని కూడా అన్నారామె.
‘హ్యపీ ఎండింగ్’లో సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ సరసన, ‘మై తేరా..’లో కుర్ర హీరో వరుణ్ ధావన్‌తో నటిస్తున్నారు ఇలియానా. సైఫ్ చాలా మంచి వ్యక్తి అని, ఫ్రెండ్లీగా ఉంటారని ఈ గోవా బ్యూటీ అన్నారు. ఇక, వరుణ్ ధావన్ గురించి మాట్లాడుతూ - ‘‘వరుణ్ చాలా నాటీబోయ్. చిచ్చుబుడ్డిలాంటివాడు. చాలా జోరుగా, హుషారుగా ఉంటాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేడు. అతని ఎనర్జీ లెవల్స్ సుపర్బ్. ఇలాంటి వ్యక్తులు పక్కనుంటే తెలియకుండా మనలో కూడా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఈ చిత్రం షూటింగ్‌లో వరుణ్‌తో పోటీపడి నేను యాక్ట్ చేస్తున్నాను. తన ముందు తేలిపోకూడదనే ఫీలింగ్ నాలో తెలియని శక్తిని పెంచుతోంది’’ అన్నారు ఇలియానా!
Advertisement
Advertisement