Main Tera Hero
-
వరుణ్‌తో డేటింగ్ వదంతే!
బెంగళూరు: ‘మై తేరా హీరో’ సహనటుడు వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలను నటి నర్గీస్ ఫఖ్రి తోసిపుచ్చింది. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవంది. ‘అలా మీడియాలో వార్తలు వచ్చాయా? నేను ఇంకా చదవలేదు. అసలు దాని గురించి నాకేమీ తెలియదు’ అంది. నగరంలో ఆదివారం జరిగిన మయంత్రా హెల్ప్‌లైన్‌ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్ధమనోహరి మీడియా తీరుపై పరోక్షంగా మండిపడింది. ‘ఎటువంటి వాస్తవాలు లేకుండానే అటువంటి వార్తలు రాస్తారు. కనీసం ఒకసారి కూడా చూడని వ్యక్తితో తాను ఓ రాత్రంతా చిందులు వేసినట్టు రాస్తారు. ఇదేమీ నేరం కాకపోయినా వారికి తోచినట్టు రాస్తుంటారు. భారతీయ యువకులు అమ్మాయిలతో డేటింగ్ చేసే సమయంలో చిత్రవిచిత్రంగా ఉండనవసరం లే దు. సృజనాత్మకంగా ఉంటే సరిపోతుంది. డేటింగ్ అంటే ఏమిటనేది ముందుగా వాళ్లు కచ్చితంగా తెలుసుకోవాలి. యువతుల నుంచి ఏమీ ఆశించకూడదు. సంభాషణలను సాగించవచ్చు’ అని అంది. న్యూయార్క్‌లో ఇటీవల ఓ వ్యక్తితో ఓ రోజు గడిపానంది. అతడు తనను హోటళ్లు, నైట్‌క్లబ్‌లకు తీసుకెళ్లాడని తెలిపింది. చివరికి తనను మళ్లీ ఇంటివద్ద విడిచిపెట్టాడంది. అతను ఎవరో మీరు ఊహించగలరా అంటూ మీడియాను ప్రశ్నించింది. ఆ రోజు తనకు అత్యంత గుర్తుంచుకోదగ్గదని అంది. బాలీవుడ్లో మీ ప్రయాణం ఎలా సాగుతోందని అడగ్గా అంతా గందరగోళంగా ఉందంది. కుదుపులు ఎదురవుతున్నాయంది. అయితే జీవితం మాత్రం హాయిగా ఉందని, తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
హాలీవుడ్ కంటే... బాలీవుడ్డే బాగుంది..!
ముంబై: హాలీవుడ్ చిత్రం ‘స్పై’తో తెరంగేట్రం చేసిన నాజూకు సుందరి నర్గిస్ ఫఖ్రీ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడమే సౌకర్యవంతంగా ఉందని చెబుతోంది. ‘హాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాల్లో నటించడమే నాకు సౌకర్యవంతంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నాను. పైగా ఎన్నో విషయాలను బాలీవుడ్లో నటించడం ద్వారా నేర్చుకుంటున్నాను. అందుకే నాకు ఇక్కడే బాగుంది. మరెక్కడికీ వెళ్లే ఆలోచన కూడా లేద’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు సంగీతం, నృత్యమంటే ఎంతో ఇష్టమని, బాలీవుడ్ చిత్రాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, తాను ఇక్కడ సౌకర్యవంతంగా ఉందని భావించడం వెనుకు ఇది కూడా ఓ కారణమని తెలిపింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ చిత్రాలను కూడా అంగీకరిస్తున్నానని, బాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తుండడంపై సంతోషంగా ఉందని చెప్పింది. ఈ గుర్తింపు తనకు తానుగా తెచ్చుకున్నదని, అందుకే తన ప్రయాణం తనకెంతో గర్వంగా ఉందంది. బాలీవుడ్లో కొన్ని కథలు వింటున్నానని, అంగీకరించే విషయంలో తగినంత సమయం తీసుకుంటానని, తొందరపాటుగా అంగీకరించడం తనకు అటవాటు లేదని ఈ ‘రాక్‌స్టార్’ నటి చెప్పింది. నటనను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి పెద్దపెద్దవారితో నటించే అవకాశం దక్కిందని, ఇదంతా దేవుడి దయవల్లే జరిగిందని తెలిపింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘రాక్‌స్టార్’లో నటించడం, జాన్ అబ్రహాంతో కలిసి ‘మద్రాస్ కేఫ్’లో నటించడం, వరుణ్ ధవన్‌తో కలిసి ‘మై తేరా హీరో’లో నటించడం తనకు బాలీవుడ్లో ఎంతో గుర్తింపు తీసుకొచ్చిందని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది. -
బైకు మీద వెళ్లడం చాలా కష్టం: ఏక్తా కపూర్
బైకు మీద వెళ్లడం అంటే సినిమాలు, సీరియళ్లు తీసినంత సులభం కాదని ఏక్తా కపూర్ తెలుసుకుంది. 'మై తేరా హీరో' సినిమా ప్రమోషన్ కోసం అందులో హీరో వరుణ్ ధావన్ ఆమెను తన బైకుమీద ఎక్కించుకుని ముంబైలో తిప్పాడు. అయితే అలనాటి హీరో జితేంద్ర కూతురు కావడంతో ఏక్తాకు చిన్నప్పటినుంచి కార్లు మాత్రమే అలవాటు. బైకు ఎక్కడం అంటే ఏంటో ఇప్పటివరకు తెలియదు. దాంతో మొదటిసారి ఎక్కిందో ఏమో గానీ, చాలా భయంగా అనిపించిందని చెప్పింది. చిన్నప్పుడు రెండుసార్లు సైకిల్ ఎక్కినా, రెండుసార్లూ పడిపోయానని, నాన్న పట్టుకుని తొక్కిస్తే తప్ప సైకిల్ తొక్కేదాన్ని కాదని ఏక్తా తెలిపింది.ఆయన వదిలేయగానే వెంటనే పడిపోయేదాన్నని.. దాంతో అసలు సైకిల్ అన్నా, బైకు అన్నా భయమని అంటోంది. తొలిసారి తాను వరుణ్ ధావన్ నడిపిన బైకు ఎక్కినందుకు అనేక మహిళా సంఘాల నుంచి తనను తిడుతూ ఈ మెయిళ్లు వచ్చాయని కూడా ఏక్తా తెలిపింది. అయితే వరుణ్ ధావన్ మీద మాత్రం 38 ఏళ్ల ఏక్తా ప్రశంసలు కురిపించేసింది. ఇప్పటివరకు అంత ముద్దొచ్చే కుర్రాణ్ని చూడలేదని, ఎస్కిమోకు కూడా ఐస్ క్రీం అమ్మేయగల చాతుర్యం అతడికి ఉందని చెప్పింది. బైకు విషయం పక్కన పెడితే.. చంద్రుడిమీదకు తీసుకెళ్తానన్నా అతడితో వెళ్లిపోతానని తెలిపింది. ఇక ఏక్తా ఈ సినిమాకు సహ నిర్మాత కాకపోయినా.. తన తండ్రి డేవిడ్ ధావన్ చెప్పకపోయినా ఈ సినిమాలో తాను ఇంతలా చేయగలిగేవాడిని కానని వరుణ్ ధావన్ అన్నాడు. వాళ్లిద్దరికీ సినిమాలంటే చెప్పలేనంత మమకారం ఉందని, ఏక్తా లేకపోతే అసలు తాను ఇదంతా చేసే సమస్యే లేదని చెప్పాడు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన 'మై తేరా హీరో'లో వరుణ్ సరసన నర్గీస్ ఫక్రీ, ఇలియానా ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 4న విడుదల కానుంది. -
'మై తేరా హీరో' లో ధావన్ తో ఫక్రీ
-
కెమిస్ట్రీ బాగా కుదిరింది
‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్‌తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని మోడల్ కమ్ నటి నర్గీస్ ఫక్రి మెలికలు తిరుగుతూ చెప్పింది. నర్గీస్ గతంలో రణ్‌బీర్ కపూర్, జాన్అబ్రహాంలతోనూ నటించింది. నగరంలో జరుగుతున్న ‘వీట్ బి దివా’ థర్డ్ సెషన్షోకి న్యాయనిర్ణేతగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ ‘ ‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్‌తో కెమిస్ట్రీ ఎంతో బాగా కుదిరింది. వరుణ్ ధవన్, డేవిడ్ ధవన్‌లతో కలసి పనిచేయడం ఎంతో ఉల్లాసం కలిగించింది’ అంది. షూజిత్ సర్కార్ నిర్మించిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో నర్గీస్... జర్నలిస్టు పాత్రను పోషించింది. ఈ సినిమాలో తన పాత్ర పేరు ఆయేషా అని, ఎంతో హాస్యభరితపాత్ర అని తెలిపింది. ఆ పాత్ర తనకు బాగా సరిపోయిందని ప్రత్యేకమైన ఫలరసాలు తీసుకుంటూ బరువు తగ్గించుకున్న నర్గీస్ చెప్పింది. మహిళలు తమ బరువును తగ్గించుకోవడం కడుపు మాడ్చుకోవద్దని సూచించింది. కేవలం డైట్‌పైనే ఆధారపడొద్దని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని హితవు పలికింది. లీటర్లు లీటర్లు నీరు తాగొద్దంది. మీ డైట్ టిప్స్‌ను ఇతర తారలకు కూడా తెలియజేశారా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదంది. తన సలహాలన్నీ బయట నివసించే మహిళలకు మాత్రమేనంది. కాగా దర్శక నిర్మాత డేవిడ్ ధవన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెల నాలుగో తేదీన విడుదల కానుంది. ఏక్తాకపూర్ నేతృత్వంలోని బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘మై తేరా హూ’ సినిమాను నిర్మిస్తోంది. ఇది వరుణ్ ధవన్‌కు రెండో చిత్రం. 2012లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో వరుణ్ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. -
అతను చాలా నాటీ!
వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదలైతే ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకింత థ్రిల్‌గా, టెన్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇలియానా ఈ రెండు రకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మార్చి, 28న ‘మై తేరా హీరో’ ఏప్రిల్ 4న విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నానని ఇలియానా పేర్కొన్నారు. వారం రోజుల గ్యాప్‌లో విడుదలవుతున్న ఈ రెండూ సూపర్ హిట్ అవుతాయని, తనకు డబుల్ ధమాకా ఖాయమని కూడా అన్నారామె. ‘హ్యపీ ఎండింగ్’లో సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ సరసన, ‘మై తేరా..’లో కుర్ర హీరో వరుణ్ ధావన్‌తో నటిస్తున్నారు ఇలియానా. సైఫ్ చాలా మంచి వ్యక్తి అని, ఫ్రెండ్లీగా ఉంటారని ఈ గోవా బ్యూటీ అన్నారు. ఇక, వరుణ్ ధావన్ గురించి మాట్లాడుతూ - ‘‘వరుణ్ చాలా నాటీబోయ్. చిచ్చుబుడ్డిలాంటివాడు. చాలా జోరుగా, హుషారుగా ఉంటాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేడు. అతని ఎనర్జీ లెవల్స్ సుపర్బ్. ఇలాంటి వ్యక్తులు పక్కనుంటే తెలియకుండా మనలో కూడా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఈ చిత్రం షూటింగ్లో వరుణ్‌తో పోటీపడి నేను యాక్ట్ చేస్తున్నాను. తన ముందు తేలిపోకూడదనే ఫీలింగ్ నాలో తెలియని శక్తిని పెంచుతోంది’’ అన్నారు ఇలియానా! -
వాళ్లిద్దరూ నావాళ్లు!
తొలిచిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాతోపాటు నటించినా, వారితో తనకు పోటీ ఏమీ లేదని వరుణ్ ధవన్ అంటున్నారు. ‘పోటీ గురించి కూడా మేం ముగ్గురుం మాట్లాడుకుంటుంటాం. అయితే తొలిచిత్రంలో మనతోపాటు నటించిన వారితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు మన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే అవుతారు కాబట్టి పోటీ అనే సమస్యే రాదు. నిజానికి వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధవన్ కొడుకు కూడా అయిన వరుణ్ రెండో సినిమా ‘మై తెరా హీరో’ ట్రయలర్ ఇటీవలే విడుదలయింది. ఈ కొత్త సినిమా ఏమవుతుందో అని తనకంటే వాళ్లే ఎక్కువ మథనపడుతుంటారని చెప్పారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2012లో విడుదలైన ఘనవిజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ ముగ్గురి కెరీర్ దూసుకుపోయింది. ఆలియా తాజాగా నటించిన హైవే, సిద్ధార్థ్ కొత్త సినిమా హసీ తో ఫసీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘సిద్ (సిద్ధార్థ్), ఆలియా సినిమాలు ఫిబ్రవరిలో వస్తున్నాయి. నాది మాత్రం ఏప్రిల్‌లో విడుదలవుతోంది. హసీ తో ఫసీ, హైవే ట్రయలర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ రెంటినీ చూసి తీరాల్సిందే’ అని ఈ 26 ఏళ్ల కుర్రవాడు వివరించాడు. హసీ తో ఫసీ ఫిబ్రవరి ఏడున, హైవే అదే నెల 21న ప్రేక్షకుల ముంగిటికి వస్తున్నాయి. ఇక మై తెరా హీరోకు వరుణ్ తండ్రి డేవిడే దర్శకుడు. నర్గిస్ ఫక్రీ, ఇలియానా ఇందులో హీరోయిన్లుగా కనిపిస్తారు. హైవేలో రణ్‌దీప్ హుడా హీరో కాగా, హసీ తో ఫసీలో సిద్‌కు పరిణీతి చోప్రా జోడీ కడుతోంది. కొత్త సంవత్సరంపై ఈ ముగ్గురు కొత్త నటులు భారీ ఆశలే పెట్టుకున్నట్టు అనిపిస్తోంది కదూ!