కెమిస్ట్రీ బాగా కుదిరింది
కెమిస్ట్రీ బాగా కుదిరింది
Published Wed, Feb 12 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్‌తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని మోడల్ కమ్ నటి నర్గీస్ ఫక్రి మెలికలు తిరుగుతూ చెప్పింది. నర్గీస్ గతంలో రణ్‌బీర్ కపూర్, జాన్‌అబ్రహాంలతోనూ నటించింది. నగరంలో జరుగుతున్న ‘వీట్ బి దివా’ థర్డ్ సెషన్‌షోకి న్యాయనిర్ణేతగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ ‘ ‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్‌తో కెమిస్ట్రీ ఎంతో బాగా కుదిరింది. వరుణ్ ధవన్, డేవిడ్ ధవన్‌లతో కలసి పనిచేయడం ఎంతో ఉల్లాసం కలిగించింది’ అంది. షూజిత్ సర్కార్ నిర్మించిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో నర్గీస్... జర్నలిస్టు పాత్రను పోషించింది. ఈ సినిమాలో తన పాత్ర పేరు ఆయేషా అని, ఎంతో హాస్యభరితపాత్ర అని తెలిపింది. ఆ పాత్ర తనకు బాగా సరిపోయిందని ప్రత్యేకమైన ఫలరసాలు తీసుకుంటూ బరువు తగ్గించుకున్న నర్గీస్ చెప్పింది.
మహిళలు తమ బరువును తగ్గించుకోవడం కడుపు మాడ్చుకోవద్దని సూచించింది. కేవలం డైట్‌పైనే ఆధారపడొద్దని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని హితవు పలికింది. లీటర్లు లీటర్లు నీరు తాగొద్దంది. మీ డైట్ టిప్స్‌ను ఇతర తారలకు కూడా తెలియజేశారా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదంది. తన సలహాలన్నీ బయట నివసించే మహిళలకు మాత్రమేనంది. కాగా దర్శక నిర్మాత డేవిడ్ ధవన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెల నాలుగో తేదీన విడుదల కానుంది. ఏక్తాకపూర్ నేతృత్వంలోని బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘మై తేరా హూ’ సినిమాను నిర్మిస్తోంది. ఇది వరుణ్ ధవన్‌కు రెండో చిత్రం. 2012లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో వరుణ్ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు.
Advertisement
Advertisement