
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్ చోన్‌బురి ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో పలువురు దుర్మరణం పాలయ్యారు.
అర్ధరాత్రి దాటాక సట్టాహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా 13 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 35 మంది తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితులంతా థాయ్ పౌరులేనని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment